ETV Bharat / entertainment

'క' రివ్యూ - కిరణ్‌ అబ్బవరం కొత్త కాన్సెప్ట్​ సినిమా ఎలా ఉందంటే? - KA MOVIE REVIEW

టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'క' మూవీ రివ్యూ ఇదే!

Kiran Abbavaram KA Movie Review
Kiran Abbavaram KA Movie Review (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2024, 6:59 AM IST

Diwali Release Movies Kiran Abbavaram KA Movie Review : దీపావళి సందర్భంగా బాక్సాఫీస్ ముందుకు వచ్చిన చిత్రాల్లో కిరణ్ అబ్బవరం నటించిన 'క' కూడా ఒకటి. అయితే ఈ చిత్రం గురించి కిరణ్ అబ్బవరం చెప్పిన మాటలు, విసిరిన సవాళ్లు సినిమాపై కాస్త ఆసక్తిని పెంచాయి. మరి ఇంతకీ ఈ 'క' చిత్రం ఎలా ఉందంటే? సినిమాలో ఉన్న కొత్తదనమేంటి? తెలుసుకుందాం.

కథేంటంటే(KA Movie story) - అనాథ అయిన అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) ఎప్పటికైనా తన తల్లిదండ్రులు తిరిగొస్తారన్న ఆశతో జీవనం కొనసాగిస్తుంటాడు. ఇతరుల ఉత్తరాలు చదువుతూ, వాటిని తన సొంత వాళ్లే రాసినట్లు ఊహించుకుంటూ, ఆ రాతల్లో తాను పోగొట్టుకున్న బంధాల్ని వెతుక్కుంటాడు. అయితే ఓసారి తన ఉత్తరం దొంగతనంగా చదివాడని మాస్టార్ గురునాథం (బలగం జయరాం) కొట్టడం వల్ల, ఆశ్రమం నుంచి పారిపోతాడు వాసుదేవ్.

ఆ తర్వాత కొంతకాలానికి కృష్ణగిరికి వచ్చిన వాసు అక్కడ కాంట్రాక్ట్ పోస్ట్‌ మెన్‌గా ఉద్యోగంలో చేరుతాడు. ఈ క్రమంలోనే పోస్ట్‌మాస్టర్ రంగారావు (అచ్యుత్ కుమార్) కూతురు సత్యభామ (నయన సారిక)తో ప్రేమలో పడతాడు. మరోవైపు అదే ఊళ్లో అమ్మాయిలు ఒక్కొక్కరుగా మిస్ అయి పోతుంటారు. అదే సమయంలో ఉత్తరాలు చదివే అలవాటున్న వాసుకు ఓ లెటర్ వల్ల ఈ మిస్సింగ్ కేసులకు సంబంధించిన క్లూ దొరకడం, అక్కడి నుంచి వాసుదేవ్ జీవితంలో సమస్యలు ఎదురుకావడం జరుగుతాయి. మరి ఊరి అమ్మాయిలను ఎలా మాయమైపోతున్నారు? దానికి కారణం ఎవరు? అసలు సినిమాలో ఉన్న ముసుగు వ్యక్తి ఎవరు? వాసుదేవ్ - సత్యభామల ప్రేమకథ ఫలించిందా? అనేదే కథ.

ఎలా సాగిందంటే? - 'క' కొత్త కాన్సెప్ట్ కథ అనే చెప్పాలి. సినిమాలోని ప్రతి అంతశం వేటికవే ఆకట్టుకుంటాయి. సినిమా అంతా ఒకెత్తైతే, ఇంటర్వెల్, క్లైమాక్స్​ సీన్స్ మరొకెత్తు. ఈ రెండూ ప్రేక్షకుల బుర్ర తిరిగిపోయేలా చేస్తాయి. ఓ కొత్త అనుభూతిని అందిస్తాయి.

ముఖ్యంగా మనిషి పుట్టుక, కర్మ ఫలం, రుణానుబంధం - ఈ మూడు అంశాల్ని ముడిపెట్టిన దర్శకుడు, చివరికి చెప్పిన సందేశం, కథను ముగించిన తీరు చాలా బాగుంది. సినిమాలో మధ్యలో వచ్చే కోర్టు యాక్షన్ సీక్వెన్స్, జాతర పాట, క్లైమాక్స్ ఫైట్ మాస్ ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. చివరి 15నిమిషాలు కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. భావోద్వేగాలతో మదిని బరువెక్కిస్తుంది.

ఎవరెలా చేశారంటే? - కిరణ్ అబ్బవరం అద్భుతంగా నటించాడు. అతడి కెరీర్‌ను మలుపు తిప్పే సినిమా అని చెప్పొచ్చు. యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు ఎమోషన్ సన్నివేశాల్లోనూ బాగా నటించాడు. నయన సారిక క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంది. తన్వి రామ్‌ది కథలో కీలక పాత్ర. అచ్యుత్ కుమార్, శరణ్య ప్రదీప్, అన్నపూర్ణమ్మ, అజయ్, బిందు చంద్రమౌళి తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి.

దర్శకులు సుజీత్- సందీప్‌ల అద్భుతంగా తెరకెక్కించారు. సామ్ సిఎస్ సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణ. పాటలన్నీ బాగున్నాయి. జాతర పాట మాస్‌ ప్రేక్షకులను ఊపేస్తుంది. యాక్షన్ సీక్వెన్స్‌లో సామ్ బ్యాక్​ గ్రౌండ్​ మ్యూజిక్​ హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేసింది. విజువల్స్ ఆకట్టుకునేలా సాగాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

చివరిగా : 'క' కిర్రాక్‌.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

'లక్కీ భాస్కర్‌' రివ్యూ - సినిమాకే అది హైలైట్

'దీపావళికి మోత మోగిపోద్ది మనదే ఇదంతా' - రవితేజ RT75 టైటిల్ పోస్టర్ రిలీజ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.