Director Venkat Prabhu About GOAT Result : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ లేటెస్ట్ మూవీ 'ది గోట్' ప్రస్తుతం తమిళంలో అలాగే ఓవర్సీస్లో ఓ రేంజ్లో నడుస్తోంది. అయితే తెలుగులో మాత్రం ఈ చిత్రం మిశ్రమ ఫలితాలతో రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ వెంకట్ ప్రభు తాజాగా ఈ సినిమా రిజల్ట్ గురించి షాకింగ్ కామెంట్ చేశారు.
చెన్నై సూపర్ కింగ్స్‌ను హైలైట్ చేసే సీన్స్ తెలుగు, హిందీ ప్రేక్షకులకు అంతగా నచ్చలేదని వెంకట్ ప్రభు అన్నారు. అందుకే ఈ రెండు భాషల్లో ఈ చిత్రం అంతగా ఆడలేదని పేర్కొన్నారు. అయితే మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీని ఒక్క సీన్లోనైనా నటించేలా చేయాలని అనుకున్నా కానీ అది సాధ్యపడలేదంటూ వెంకట్ అన్నారు. అందుకే ఐపీఎల్ విజువల్స్ ద్వారా ధోనీని స్క్రీన్‌పై చూపించారని తెలిపారు. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. దీనిపై నెటిజన్లు కూడా మిశ్రమంగా స్పందిస్తున్నారు.
ఇక 'గోట్' విషయానికి వస్తే, దళపతి విజయ్ డబుల్ యాక్షన్‌లో మెరిసిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, వైభవ్, లైలా, ప్రశాంత్, స్నేహ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను ఉపయోగించి దివంగత కోలీవుడ్ నటుడు విజయకాంత్‌ను తీసుకొచ్చి ఆయన్ను గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా 'డీ-ఏజింగ్' టెక్నాలజీ ఉపయోగించి విజయ్‌ని 25 ఏళ్ల కుర్రాడిగానూ ఈ సినిమాలో చూపించారు. అయితే విజయ్ను ఇలా చూపించడం పట్ల కూడా నెట్టింట కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి.
ఇదిలా ఉండగా, కోలీవుడ్ స్టార్స్ శివ కార్తికేయన్, నటి త్రిష గెస్ట్ రోల్స్‌లో మెరిసి తమ నటనతో అలరించారు. AGS ఎంటర్టైన్మెంట్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించింది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. అయితే ఈ సినిమా ఒరిజినల్ రన్ టైమ్ 3 గంటల 40 నిమిషాలు కాగా, దాన్ని కాస్త 2 గంటల 59 నిమిషాలకు కుదించి థియేటర్లలో రిలీజ్ చేశారు.
'గోట్' సినిమాకు విజయ్ భారీ రెమ్యునరేషన్- సగం బడ్జెట్ కంటే ఎక్కువ! - Vijay Thalapathy Remuneration