Pawan kalyan OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్- సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'ఓజీ'. ఈ సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతోంది. తాజాగా సినిమా సెట్స్‌లోని ఓ ఫొటోను డైరెక్టర్ సుజీత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
షూటింగ్లో బిజీగా ఉన్న సుజీత్ తన ఫొటోనే ఒకటి పోస్ట్ చేశారు. షూటింగ్ లొకేషన్లో మైక్‌లో అసిస్టెంట్లకు ఏదో డైరెక్ట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఫొటోలో ఓ హెలికాప్టర్ కూడా ఉంది. అయితే దాన్ని కాస్త బ్లర్ (Blur) చేశారు. ఇదే ఫొటోను నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్ కూడా షేర్ చేసింది. 'బ్యాంకాక్‌లో నిజంగా వేడి ఎక్కువగా ఉంది' అని క్యాప్షన్ జోడించింది. దీంతో 'బ్లాస్ట్ ది హెలికాప్టర్' (ఇటీవల పవన్ కల్యాణ్ డైలాగ్‌ను ఉద్దేశించి), 'థియేటర్లు కూడా అదే రేంజ్లో బ్లాస్ట్ అవ్వాలి' అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ ఒక్క ఫొటోతో సినిమాపై మరోసారి అంచనాలు పీక్స్‌లోకి వెళ్లిపోయాయి.
అప్డేట్ అప్పుడే!
ఈ సినిమా నుంచి ఒక్క టీజర్ మినహా ఇప్పటివరకూ ఎలాంటి అప్డేట్స్ రాలేవు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌కు తొలి పాట వినిపించేందుకు మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నట్లు తెలిసింది. కొత్త ఏడాది సందర్భంగా జనవరి 1న ఈ సాంగ్‌ను విడుదల చేస్తారని సమాచారం. వాస్తవానికి సెప్టెంబరు 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగానే ఈ ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేయాలని భావించినప్పటికీ అప్పుడు కుదరలేదు.
Blast the helicopter.. pic.twitter.com/xo4LSiMhwP
— .... (@thaalabheem0) December 9, 2024
కాగా, ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో పవన్ కల్యాణ్ 'ఓజాస్ గంభీర' అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన్ని ఢీకొట్టే ప్రతినాయకుడిగానే బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ నటిస్తున్నారు. బ్యూటీ ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా, శ్రియా రెడ్డి కీలక పాత్ర పోషిస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య దీనిని నిర్మిస్తున్నారు. 2025 ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.
OG అప్డేట్: ఇప్పటికైతే 'సీజ్ ది షిప్'- PK ఫ్యాన్‌కు మేకర్స్ ఫన్నీ రిప్లై