ETV Bharat / entertainment

మంచి మనసు చాటుకున్న హరీశ్ శంకర్- రియల్ హీరో అంటూ డైరెక్టర్​పై ప్రశంసలు

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 14, 2024, 10:00 AM IST

Updated : Mar 14, 2024, 10:43 AM IST

Director Harish Shankar: అగ్ర దర్శకుడు హరీశ్​ శంకర్ చేసిన ఓ పనికి ఆయనపై నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. మరి ఆయన ఏం చేశారంటే?

Director Harish Shankar Car Push
Director Harish Shankar Car Push

Director Harish Shankar: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ బ్లాక్​బస్టర్ సినిమాలు తెరకెక్కించడమే కాకుండా రీయల్ లైఫ్​లో సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తుంటారు. అప్పుడప్పుడు ఇతరులకు సాయం చేస్తూ తన మంచి మనసును చాటుకుంటున్నారు. ఈ క్రమంలో గురువారం ఆయన చేసిన పనికి సోషల్ మీడియాలో హరీశ్​పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ హరీశ్ చేసిన పని ఏంటి? ఆయనపై నెటిజన్లు ప్రశంసలు కురిపించడానికి కారణం ఏంటో తెలుసా?

అయితే రోడ్డుపై నిలిచిపోయిన ఓ వాహనాని (కారు)కి డైరెక్టర్ హరీశ్ సాయం చేశారు. ఎదో కారణం చేత ఆగిపోయిన కారును నిర్మాత రవిశంకర్​తో కలిసి ఆయన కొద్ది దూరం నెట్టారు. ఆయనతోపాటు మరికొందరు కూడా హెల్ప్ చేశారు. దీన్నీ ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా హరీశ్​పై ప్రశంసలు కురుస్తున్నాయి. స్టార్ డైరెక్టర్ రేంజ్​లో ఉన్నప్పటికీ నడి రోడ్డుపై ఆగిపోయిన కారును నెట్టడం ఆయన 'సింప్లిసిటికి నిదర్శనం' అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్​లో వైరలైంది.

ఇక హరీశ్ శంకర్ సినిమాల విషయానికొస్తే, ఆయన పవర్ స్టార్ పవన్ కల్యాణ్​తో 'ఉస్తాద్ భగత్ సింగ్​', మాస్ మహరాజ రవితేజతో 'మిస్టర్ బచ్చన్' ప్రాజెక్ట్​లతో బిజీగా ఉన్నారు. పవన్ కల్యాణ్ బిజీ షెడ్యూల్ కారణంగా ఉస్తాద్ కాస్త బ్రేక్ తీసుకుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు రీస్టార్ట్ కానున్నాయి. ఇక మిస్టర్ బచ్చన్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

అయితే ఈ రెండు ప్రాజెక్ట్​ల తర్వాత హరీశ్- మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయనున్నారని ప్రచారం సాగుతోంది. బీవీఎస్​ రవి ఈ సినిమాకు కథను అందిస్తుండగా, పీపుల్​ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించనుందని సినీ వర్గాలు తెలిపాయి. చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల కో-ప్రొడ్యూసర్​గా వ్యవహరించనున్నారట. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్​కు చిరంజీవి గ్రీన్​సిగ్నల్​ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ త్వరలోనే రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర' సినిమా షూటింగ్​లో ఉన్నారు. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు.

మెగాస్టార్​తో హరీశ్ శంకర్ కొత్త ప్రాజెక్ట్!

'సర్దేసుకుని పోవడమే' - హరీశ్ శంకర్ వైరల్​ ట్వీట్​కు రవితేజ రిప్లై!

Last Updated : Mar 14, 2024, 10:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.