Dhanush Career Journey: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సౌత్ ఇండియా టాప్ హీరోల్లో ఒకరు. చిన్నతనంలోనే సినిమా రంగంలోకి వచ్చిన ధనుష్ తన యాక్టింగ్‌తో తనను తాను నిరూపించుకొని, ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగారు. అయితే ధనుష్ తన కెరీర్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. అవేంటంటే?
సినిమాల్లోకి ఎంట్రీ అలా: తనకు 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తెరంగేట్రం చేశారు. తన తండ్రి, అన్నలు కలిసి సినిమాలు చెయ్యాలని పట్టుబట్టి, ఇండస్ట్రీలోకి తీసుకువచ్చారని ధనుష్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం కావడం వల్ల సులభంగానే ఎంట్రీ లభించిందని చెప్పారు. కానీ తన కెరీర్లో ఎన్నో అవమానాలు పడ్డినట్లు ధనుష్ గుర్తుచేసుకున్నారు.
ధనుష్ ఏడ్చిన సందర్భం: 2002లో 'తులువాదో ఇలమై' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ధనుష్ మొదటి సినిమాతో హిట్ కొట్టారు. 2003లో 'కాదల్ కొండె' సినిమా షూటింగ్ సమయంలో బాడీ షేమింగ్‌ను ఎదుర్కొన్నట్లు ధనుష్ వివరించారు. పలుచగా ఉన్న తనను చూసి కొంతమంది వెక్కిరించారని, అది విన్న తాను కారులో కూర్చొని వెక్కివెక్కి ఏడ్చినట్లు ధనుష్ తెలిపారు.
బాలీవుడ్, హాలీవుడ్లో ధనుష్: తమిళంలోనే కాకుండా ధనుష్ బాలీవుడ్, హాలీవుడ్లో సినిమాలతో అదరగొడుతున్నారు. హిందీలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి 'షమితాబ్' అనే సినిమా చేశారు. అక్షయ్ కుమార్, సారా అలీఖాన్‌లతో కలిసి 'అత్రంగి', సోనమ్ కపూర్‌తో కలిసి 'రాంఝనా' అనే హిందీ సినిమాల్లో ధనుష్ నటించారు. అలాగే హాలీవుడ్లో 'ది ఎక్స్ ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ఫకీర్', 'ది గ్రే మ్యాన్' లాంటి సినిమాలు చేశారు.
హీరో ధనుష్ ప్రస్తుతం 'కెప్టెన్ మిల్లర్' అనే సినిమాతో సందడి చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ జనవరి 26న రిలీజ్ కానుంది. అటు తమిళంలో హిట్ టాక్ అందుకోవడం వల్ల ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. కాగా హీరో ధనుష్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.20కోట్ల నుంచి రూ.35కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">