Dhanush Captain Miller : కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కెప్టెన్ మిల్లర్'. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా తమిళంలో రిలీజైన ఈ చిత్రం మంచి టాక్‌ను దక్కించుకుంది. అయితే తాజాగా ఈ చిత్రం ఓ వివాదంలో చిక్కుకుంది. తాను రచించిన నవలను కాపీ కొట్టి 'కెప్టెన్ మిల్లర్' సినిమా తెరకెక్కించారంటూ ప్రముఖ రచయిత వేల రామమూర్తి ఆరోపించారు.
"నేను రాసిన పట్టుతు యానై నవల ఆధారంగా 'కెప్టెన్ మిల్లర్' తీశారు. నాకు న్యాయం చేయాలని కోరుతూ త్వరలోనే డైరెక్టర్స్ యూనియన్‌ను సంప్రదిస్తాను. యూనియన్ అధ్యక్షుడు భారతీరాజా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. డబ్బు కోసం నేను ఆరోపణలు చేయడం లేదు. హక్కుల కోసం పోరాడుతున్నాను" అని రామమూర్తి పేర్కొన్నారు.
Captain Miller Story : 1930-40ల మధ్య కాలంలో జరిగిన ఆసక్తికర కథాంశంతో యాక్షన్ డ్రామాగా 'కెప్టెన్ మిల్లర్'ను చిత్రీకరించారు. సామాజిక సందేశంతో రూపొందిన ఈ చిత్రంలో ధనుశ్ తిరుగుబాటు నాయకుడిగా కనిపించారు. ఆయన కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో నిర్మితమైన చిత్రమిది. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, ప్రియాంక మోహన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. తెలుగులో రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఏషియన్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో ప్రేక్షకులకు అందిస్తున్నాయి. అయితే మూవీ నిడివి కొంత తగ్గించి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఒరిజినల్ వెర్షన్ 160 నిమిషాల నిడివి ఉండగా 11 నిమిషాలు ట్రిమ్ చేసి 149 నిమిషాల నిడివితో రిలీజ్ చేస్తున్నారంట.
ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ధనుశ్ హైదరాబాద్ కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రీసెంట్‌గానే ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రాన్ని స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ పాజిటివ్ వైబ్ కూడా 'కెప్టెన్ మిల్లర్'కు కలిసొచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">