Devi Sri Prasad Allu Arjun Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప 2'. సూపర్ హిట్ పుష్పకు కొనసాగింపుగా తెరకెక్కుతోంది. మొదటి భాగంలో దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం శ్రోతలను ఏ రేంజ్లో ఊపు ఊపేసిందో తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆయన రెండో భాగంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఈ సినిమా మరో స్థాయిలో ఉంటుందని చెప్పారు. ఫస్ట్ హాప్ అదిరిపోతుందంటూ ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తి రేకెత్తించారు. గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఈ నెల 19న దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించనున్నారు. దీంతో ముందుగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈవెంట్ విశేషాలతో పాటు పుష్ప 2 గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
"భారత్‌లో మ్యూజికల్ కాన్సర్ట్ చేయాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం. ఇప్పటికే విదేశాల్లో చాలా ప్రదర్శనలు ఇచ్చాం. ఇండియాలోనూ ఆ స్థాయిలో నిర్వహించాలని హైదరాబాద్‌తో మొదలు పెట్టాం. టీమ్ ఎంత కష్టపడిందో ఈ షో చూశాక మీకే అర్థం అవుతుంది. వేడుకకు మేం ఆహ్వానించక ముందే, ఈ విషయం తెలిసుకుని చాలా మంది మేం వస్తున్నామని కాల్ చేసి చెప్పడం సంతోషంగా ఉంది. ఆ ప్రేమకే మా షో విజయవంతమైనట్టు అనిపించింది. ఎలాంటి ఇగో లేకుండానే పరిశ్రమకు చెందిన వారు నన్ను ఆదరిస్తున్నారు. ఇన్నేళ్లు నేను సంపాదించింది ఇదే. ఈవెంట్‌లో ఆర్కెస్ట్రాతో పాటు తీన్‌మార్ డప్పులు కూడా ఉంటాయి. మీకు కొత్త అనుభూతి కలిగిస్తుందని ఆశిస్తున్నా" అని దేవీ శ్రీ ప్రసాద్ పేర్కొన్నారు.
మరిన్ని ప్రశ్నలకు దేవీ శ్రీ సమాధానాలు ఇవే
ఈవెంట్‌లో పుష్ప 2 కొత్త పాట గురించి ఏదైనా రివీల్ చేస్తారా?
దేవిశ్రీ : దర్శకుడు సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలను ఈ ప్రశ్న అడగాలి. అలాంటి ఏమీ ప్లాన్ చేయలేదు.
హైదరాబాద్‌లోనే ప్రారంభించడానికి కారణం ఏంటి?
దేవిశ్రీ : హైదరాబాద్‌లోనే నా కెరీర్ ప్రారంభమైంది. అందుకే ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం.
ఈవెంట్ పనుల్లో బిజీగా ఉంటే. మరి, పుష్ప 2 సంగతి?
దేవిశ్రీ : దేని పని దానిదే. పుష్ప 2 పనులు సింహ భాగం దాదాపుగా పూర్తైపోయాయి.
అతిథులుగా ఎవరెవరు వస్తున్నారు?
దేవిశ్రీ : ఆ వివరాలు త్వరలోనే చెబుతాను
'70 ఏళ్లలో ఎప్పుడూ అలా జరగలేదు' - పుష్ప 2 అప్డేట్ ఇచ్చిన నిర్మాత
8 నెలల క్రితం చనిపోయిన అమ్మాయితో హీరో ప్రేమ! - ఈ వారం థియేటర్/OTT సినిమాలివే