ETV Bharat / entertainment

'దేవర' రిలీజ్​ పోస్ట్​పోన్​ ? - రేసులోకి ఆ రెండు టాలీవుడ్​ మూవీస్​! - ఎన్​టీఆర్​ దేవర మూవీ

Devara Release Date : జూనియర్ ఎన్​టీఆర్​, కొరటాల శివ కాంబినేషన్​లో రూపుదిద్దుకుంటున్న 'దేవర' మూవీ రిలీజ్​ డేట్​లో మార్పులు జరగనున్నాయట. ఇంతకీ ఈ మూవీ ఎప్పుడు రిలీజ్​ కానుందంటే ?

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 24, 2024, 9:20 AM IST

Devara Release Date : జూనియర్​ ఎన్​టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'దేవర'. ఫుల్​ ఆన్​ యాక్షన్​ మోడ్​లో రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ మోడ్​లో ఉంది. అయితే ఇప్పటికే పలు షెడ్యూల్స్​ కంప్లీట్​ చేసుకున్న ఈ మూవీ మరో మూడు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే తాజాగా మూవీ లవర్స్​కు షాకిచ్చే ఓ వార్త నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా విడుదల వాయిదా పడనుందంటూ రూమర్స్​ సోషల్ మీడియాలో హల్​చల్​ అవుతోంది.

రెండు పార్టులుగా దేవర సినిమా విడుదల కానుండగా ఇప్పటికే తొలి భాగాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించారు. అయితే షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని, వీఎఫ్​ఎక్స్​ పనులు పూర్తి చేసుకునేందుకు ఇంకాస్త సమయం పడుతుందని తెలుస్తోంది.

మరోవైపు ఈ సినిమాలో విలన్​ రోల్​ చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ ఇటీవలే గాయల పాలయ్యారు. దీంతో ఆయన పూర్తిగా కోలుకుని తిరిగి సెట్స్​కు వచ్చేంత వరకు ఈ సినిమా షూటింగ్​ కూడా లేట్​ కానున్నట్ల సమాచారం. ఇలా పలు కారణాల వల్ల 'దేవర' మూవీ వాయిదా పడనుందని, మేకర్స్​ కూడా కొత్త డేట్​ను అనౌన్స్​ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్​మెంట్​ వచ్చేంతవరకు క్లారిటీ రాదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇక ఏప్రిల్​ 5కి సూర్య 'కంగువ', అక్షయ్​ కుమార్​ 'బడే మియాన్ చోటే మియాన్', అజయ్ దేవగణ్ 'మైదాన్' సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇది కూడా దేవర వాయిదాకు మరో కారణం అని సమాచారం. ఒక వేళ ఈ మూవీ నిజంగానే పోస్ట్​పోన్​ చేసుకుంటే ఆ డేట్​ని లాక్​ చేసుకునేందుకు తెలుగులో రెండు సినిమాలు రెడీగా ఉన్నాయి. అందులో ఒకటి సిద్ధు జొన్నలగడ్డ 'టిల్లు స్క్వేర్'. ఇప్పటికే పలు మార్లు రిలీజ్​ డేట్​ను మార్చుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల మందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' కూడా సరైన విడుదల తేదీ కోసం ఎదురుచూస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రం పలు కారణాల వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది, ఒకవేళ 'దేవర' వాయిదా పడితే ఈ సినిమాను ఏప్రిల్​ 5కు తీసుకుని రావాలని మేకర్స్​ ప్లాన్ చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.