ETV Bharat / entertainment

'సార్ మీతో సినిమా చేయాలని ఉంది' - కోలీవుడ్ దర్శకుడికి ఎన్టీఆర్ రిక్వెస్ట్​ - Devara NTR - DEVARA NTR

Devara NTR : ఓ కోలీవుడ్ దర్శకుడిపై తన అభిమానాన్ని చాటుకున్నారు ఎన్టీఆర్​. ఆయనతో సినిమా చేయాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు. పూర్తి వివరాలు స్టోరీలో

source Getty Images
Devara NTR (source Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 18, 2024, 10:43 AM IST

Devara NTR Vetrimaaran Movie : తెలుగు చిత్ర పరిశ్రమ, తమిళ చిత్ర పరిశ్రమ అని విభజించి చూసే రోజులు 'బాహుబలి' తర్వాత పోయాయని, మనం మాట్లాడే భాషలు వేరు అయినప్పటికీ, మనందరినీ సినిమా ఏకతాటిపై నిలుపుతోందని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నారు. దేవర ప్రమోషన్స్​లో భాగంగా చెన్నై వెళ్లిన ఆయన అక్కడ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇకపోతే తారక్​ కోలీవుడ్ టాప్ దర్శకుడు వెట్రిమారన్​తో ఓ సినిమా చేయబోతున్నారని ఆ మధ్య ప్రచారం జోరుగా సాగింది. అదే సమయంలో తన ఫేవరెట్ కోలీవుడ్ డైరెక్టర్​ వెట్రిమారన్ అని తారక్ కూడా అన్నారు. అయితే తాజాగా మరోసారి ఎన్టీఆర్​ వెట్రిమారన్​పై తనకున్న అభిమానాన్ని చూపారు.

'తమిళంలో సినిమా ఎప్పుడు చేయనున్నారు' అని అడిగిన ఓ ప్రశ్నకు తారక్​ స్పందిస్తూ "నా ఫేవరెట్ డైరెక్టర్​ వెట్రిమారన్‌. ఆయన ఎప్పుడు నాతో సినిమా తీస్తే అప్పుడు డైరెక్ట్​గా తమిళంలో నటిస్తాను" అని చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్​ అటు కోలీవుడ్ సినీ ప్రియుల్లో ఇటు తారక్ అభిమానుల్లో వైరల్​గా మారాయి. త్వరగా వీరిద్దరి కాంబోలో సినిమా రావాలని అందరూ కామెంట్లు చేస్తున్నారు.

NTR Devara Promotions : ఇక ఎన్టీఆర్‌ దేవర గురించి మాట్లాడుతూ "నా కెరీర్‌లో నేను బలంగా కోరుకుని చేసిన సినిమా దేవర. డైరెక్టర్​ విజన్‌కు టెక్నికల్​ టీమ్​ మూలస్తంభాలుగా నిలిచింది. జాన్వీ అద్భుతమైన నటి" అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది.

ఇకపోతే గతంలో తమిళ కమెడియన్ సూరి ప్రధాన పాత్రలో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో వెట్రిమారన్ తీసిన సినిమా 'విడుదల'. ఈ మూవీ ప్రమోషన్స్​లో భాగంగా అప్పట్లో వెట్రిమారన్ హైదరాబాద్​కు వచ్చారు. అప్పుడు ఎన్టీఆర్​తో మూవీ గురించి ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. అప్పుడు తాను ఎన్టీఆర్​ను కలిశానని, కానీ కొన్ని కారణాల వల్ల సినిమా కుదరలేదని వివరించారు. అప్పటి నుంచి వీరిద్దరి కాంబోలో సినిమా గురించి గాసిప్స్​ ఎక్కువయ్యాయి.

విడుదలకు ముందే దూసుకెళ్తోన్న 'దేవర' - ఆ రికార్డులన్నీ బ్రేక్​! - Devara Movie Records

ఆ మూవీ షూటింగ్​లో వాళ్లను గన్​తో బెదిరించిన చిరు! - అసలు అప్పుడేం జరిగిందంటే? - Chiru Threatened with Real Gun

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.