ETV Bharat / entertainment

'దేవర' ఓపెనింగ్స్​ - ​ఆల్​టైమ్ సెకండ్ హైయ్యెస్ట్​ గ్రాసర్​గా రికార్డ్! - Devara Day 1 Collections - DEVARA DAY 1 COLLECTIONS

Devara Day 1 Collections : టాలీవుడ్ ఓపెనింగ్ కలెక్షన్లలో 'దేవర' ఆల్​టైమ్ టాప్ 2లో నిలిచే ఛాన్స్ ఉందని దిల్​రాజు అన్నారు. తాజాగా హైదరాబాద్​లో నిర్వహించిన ప్రెస్​మీట్​లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Devara Day 1 Collections
Devara Day 1 Collections (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 27, 2024, 9:58 PM IST

Devara Day 1 Collections : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'దేవర పార్ట్ 1' శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు ఫస్ట్ షో నుంచే బ్లాక్​బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. తమ చిత్రాన్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు మూవీటీమ్ ధన్యావాదాలు తెలిపింది. తాజాగా హైదరాబాద్​లో ప్రెస్​మీట్​లో పాల్గొన్న మూవీటీమ్ పలు ఆసక్తికర అంశాలు షేర్ చేసుకుంది. ఈ క్రమంలో దేవర తొలి రోజు కలెెక్షన్లలో టాప్ 2లో ఉండవచ్చని ప్రముఖ నిర్మాత దిల్​రాజు అంచనా వేశారు.

డే 1 కలెక్షన్స్​ టాప్ 2లో!
ఈ ప్రెస్​మీట్​లో పాల్గొన్న నిర్మాత దిల్​రాజు 'దేవర' సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ కానుందని అన్నారు. 'దేవరకు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. డే 1 హైయ్యెస్ట్​ గ్రాస్​లో దేవర టాప్ 2లో ఉంటుదని అనుకుంటున్నా. రాత్రివరకు కచ్చితమైన నెంబర్లు వస్తాయి. ఇక సినిమాలో ఎన్టీఆర్ నటన అదిరిపోయింది. ప్రస్తుతం తెలుగు సినిమాకు విదేశాల్లో మంచి ఆదరణ లభిస్తోంది. తెలుగు సినిమాకు ఇంతలా గుర్తింరు వచ్చేలా పనిచేస్తున్న డైరెక్టర్లు, హీరోలు, ప్రొడ్యూర్లకు థాంక్స్' అని అన్నారు.

'సినిమా కోసం కష్టపడ్డ కొరటాల శివ, మేకర్స్ అందరికీ థాంక్స్. అలాగే ఆదరిస్తున్న అభిమానులు, సినీ ప్రియలకు ధన్యవాదాలు. ఈ సినిమా కోసం టీమ్‌ ఎంతో కష్టపడి పనిచేసింది. (ఎన్టీఆర్‌ను ఉద్దేశించి) నా తమ్ముడు, మా నాన్న యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. ఇది వన్‌ మ్యాన్‌ షో అని గర్వంగా చెప్పగలను. మాకు ఇలాంటి విజయాన్ని అందించిన టీమ్‌కు థాంక్యూ' అని కల్యాణ్​రామ్ అన్నారు.

కెరీర్ బెస్ట్ అంటున్నారు

దేవర తన కెరీర్​లో బెస్ట్ ఫిల్మ్ అంటున్నారని డైరెక్టర్ కొరటాల శివ తెలిపారు. 'దాదాపు మూడేళ్ల ప్రయాణమిది. మాకు ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. రాత్రి నుంచి వరుసగా ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. ఇది నా బెస్ట్‌ ఫిల్మ్‌ అని అందరూ మెచ్చుకుంటున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరి వల్లే 'దేవర' ఈ స్థాయికి వెళ్లిందని నేను నమ్ముతున్నా. ప్రతి ఒక్కరూ సినిమా కోసం కష్ట పడ్డారు. ఇది అందరి విజయం' అని శివ పేర్కొన్నారు.

కాగా, ఈ సినిమాను కొరటాల శివ రెండు పార్ట్​లుగా తెరకెక్కించారు. అందులో భాగంగా నేడు తొలి భాగం రిలీజైంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్​గా నటించగా, సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషించారు. ఇక సీనియర్ నటుడు శ్రీకాంత్, శ్రతి మరాఠే, ప్రకాశ్ రాజ్, అజయ్, మురళీ శర్మ తదితరులు నటించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.