ETV Bharat / entertainment

చిరంజీవితో మనస్పర్థలు - అసలు విషయం చెప్పేసిన కొరటాల! - Devara Korata Siva Chiranjeevi - DEVARA KORATA SIVA CHIRANJEEVI

Devara Korata Siva Chiranjeevi : చిరంజీవి - కొరటాల శివ మధ్య మనస్పర్థలు ఉన్నాయని ఆ మధ్య జోరుగా ప్రచారం సాగింది. ఎట్టకేలకు ఈ విషయమై తాజాగా దర్శకుడు కొరటాల స్పందించారని తెలిసింది. ఆయన ఏం అన్నారంటే?

source ETV Bharat
chiranjeevi koratala (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2024, 1:12 PM IST

Devara Korata Siva Chiranjeevi : అప్పటివరకు టాలీవుడ్​లో ఒక్క ఫెయిల్యూర్​ కూడా లేకుండా సక్సెస్​ఫుల్​ డైరెక్టర్​గా పేరు తెచ్చుకున్న దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. కానీ ఆచార్య తర్వాత ఆ పేరు పోయింది. ఎందుకంటే ఈ సినిమా బాక్సాఫీస్ ముందు దారుణంగా డిజాస్టర్ అయింది. దీని తర్వాత చిరు ఓ స్టేజ్​పై చేసిన వ్యాఖ్యలు కాస్త కాంట్రవర్సీకి దారీ తీశాయి. అది ఆయన ఆచార్య ఫ్లాప్​ను దృష్టిలో పెట్టుకుని, కొరటాలను ఉద్దేశించే చెప్పారని జోరుగా ప్రచారం సాగింది. అలా అప్పటి నుంచి చిరు - కొరటాలకు మధ్య మనస్పర్థలు వచ్చాయని తెగ వార్తలు వచ్చాయి.

దీంతో ఈసారి ఎలాగైనా గట్టి హిట్ కొట్టాలని, పట్టుదలతో కొరటాల దేవరను తెరకెక్కించినట్లు మాటలు వినిపించాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్​తో కలిసి ఈ సినిమా చేశారు కొరటాల. ఇప్పుడు విడుదల తేదీ(సెప్టెంబర్ 27) దగ్గర పడడంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పేరు కనిపిస్తోంది, వినిపిస్తోంది.

అయితే తాజాగా మూవీ ప్రమోషన్స్​లో భాగంగా మీడియా ముందుకు వచ్చారు కొరటాల. ఈ నేపథ్యంలో ఆచార్య కాంట్రవర్సీ, మెగా కాంపౌండ్​తో ఉన్న బంధంపై ఆయనకు ప్రశ్న ఎదురైంది. దీనికి కొరటాల సమాధానం చెప్పారు. ఆచార్య ఫ్లాప్ అవ్వగానే తనకు మెసేజ్ చేసిన తొలి వ్యక్తి చిరంజీవినేనని అన్నారు కొరటాల. 'అంతా బానే జరుగుతుంది. మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతావ'ని మెసేజ్ చేసి ధైర్యాన్ని, భరోసా ఇచ్చారట. అలా ఫైనల్​గా చిరు చేసిన మెసేజ్​ గురించి కొరటాల ఎట్టకేలకు బయట పెట్టారు. పైగా చిరు గతంలో చేసిన కామెంట్స్​ను చాలా మంది వక్రీకరించారని, తప్పుగా అర్థం చేసుకున్నారని, తనను ఉద్దేశించి చిరు అనలేదని క్లారిటీ ఇచ్చారు కొరటాల. తమ మధ్య అనుబంధం అంతా బాగానే ఉందని స్పష్టత ఇచ్చారు.

గతంలో కొరటాల బన్నీకు ఓ కథ చెప్పారని, అది కుదరక అదే స్టోరీతో దేవరగా చేశారని ప్రచారం సాగింది. అయితే అందులో నిజం లేదని అన్నారు కొరటాల. అది వేరు, ఇది వేరు అని కూడా క్లారిటీ ఇచ్చారు.

కాగా, కొరటాల శివ ప్రస్తుతం 'దేవర' సినిమా విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. చూడాలి మరి ఆచార్య రిజల్ట్​కు సమాధానం చెప్పేలా దేవరను బ్లాక్ బస్టర్‌గా కొరటాల నిలబెడతారా? ఆడియెన్స్ ఈ సినిమాకు ఎలాంటి రివ్యూని అందిస్తారు? ఎంత కలెక్షన్స్‌ వస్తాయి? అనేది చూడాలి. ఇప్పటికే ఓవర్సీస్‌లో దేవర ప్రీ సేల్స్​ రెండు మిలియన్ల డాలర్లకు పైగా వసూలు చేసినట్లు తెలిసింది.

పారిస్‌ ఫ్యాషన్​ వీక్​లో అలియా​, ఐశ్వర్య రాయ్ ర్యాంప్ వాక్​​ - అందం అదరహో - AliaBhatt Aishwarya Rai

ఆగని 'దేవర' రికార్డులు జోరు - ఓవర్సీస్​లో మరో ఘనత - NTR Devara Pre Sales Record

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.