Deepika Ranveer Baby : బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె- రణ్‌వీర్ సింగ్ ఆరేళ్ల ప్రేమ తరువాత 2018లో పెళ్లి పీటలెక్కిన విషయం తెలిసిందే. వ్యక్తిగతంగా ఎంత బిజీగా ఉన్నా ఒకరికొకరు టైమ్ ఇచ్చుకుంటూ హ్యాపీగా కనిపించే ఈ జంట బాలీవుడ్‌లోనే 'ది మోస్ట్ క్యూట్ కపుల్'గా పేరు పొందింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాము త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నామంటూ దీపిక తన ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేశారు. తమ బిడ్డ సెప్టెంబర్‌లో జన్మించే అవకాశం ఉందని పిల్లల బట్టలు, బూట్లు ఉన్న ఫోటోకి 'సెప్టెంబర్ 2024' అనే క్యాప్షన్ యాడ్ చేసి ఇన్‌స్టాగ్రామ్ షేర్ చేశారు. ఇక అప్పట్నుంచి కాబోయే అమ్మగా తన మధుర జ్ఞాపకాల్ని అభిమనులతో పంచుకుంటూ వచ్చిన దీపిక తాజాగా ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ఈ జంట.
'అమ్మాయే కావాలి, అచ్చు ఆమెలాగే ఉండాలి'
అయితే దీపిక గర్భం దాల్చినప్పట్నుంచీ తనకు పాపే కావాలని కోరుకున్నారట రణ్‌వీర్. ఈ విషయాన్ని ఇటీవలే ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. "మేం పేరెంట్స్ కానున్నామని తెలిసిన రోజు నుంచి మాకు ఆడపిల్లే పుట్టాలని నేను కోరుకున్నాను. పాప కూడా అచ్చం వాళ్ల అమ్మ దీపికలా ఉంటే బాగుంటుందని అనుకొనేవాడిని. ఎందుకంటే దీపిక చిన్ననాటి ఫొటోల్ని చూశాను కదా! అందులో తను చాలా క్యూట్‌గా ఉండేది. రాబోయే మా బుజ్జాయి కూడా దీపికలా క్యూట్‌గా ఉండాలని కలలుకనే వాడిని." అని చెప్పుకొచ్చారు రణ్‌వీర్. మొత్తానికి తన కోరిక ప్రకారమే ఆడపిల్ల పుట్టడం వల్ల ఇప్పుడు ఆయన చెప్పలేనంత సంతోషంలో మునిగిపోయ.
డెలివరీ కోసం ఆస్పత్రికి వెళ్లడానికి ముందు ఈ జంట వినాయక చవితికి ఒక్కరోజు ముందే ముంబయిలోని ప్రముఖ సిద్ధివినాయకుని ఆలయాన్ని సందర్శించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఈ జంట సెప్టెంబర్ 8న పండింటి పాపకు తల్లిదండ్రులయ్యారు. ఈ విషయాన్ని వారు ఓ క్యూట్ పోస్ట్‌తో అనౌన్స్ చేయగా, పలువురు సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.
పండంటి పాపకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె - Deepika Ranveer Singh baby
దీపిక 'బేబీ బంప్' ఫొటోషూట్- రణ్వీర్తో క్యూట్ ఫోజులు - Deepika Padukone Baby Bump