ETV Bharat / entertainment

దీపికకు సినిమాలే కాదు, అందులోనూ ఫుల్ ఇన్‌కమ్ - ఆమె నెట్​వర్త్ ఎన్ని వందల కోట్లంటే? - Deepika padukone Net worth - DEEPIKA PADUKONE NET WORTH

Deepika Padukone Net worth Business : బాలీవుడ్ రిచెస్ట్​ హీరోయిన్స్​లో దీపికా పదుకొణె ఒకరు. అయితే ఈ భామ కేవలం సినిమాలు, యాడ్​లతో మాత్రమే కాకుండా వేరు వేరు వ్యాపారాల్లోనూ కోట్ల రూపాయలను ఇన్​వెస్ట్​మెంట్​ చేసి సంపాదిస్తోంది. ఇంతకీ ఆమె నెట్​ వర్త్​ ఎంత? ఆమె ఏఏ వ్యాపారాలను చేస్తోంది? వంటి వివరాలను తెలుసుకుందాం.

source Getty Images
Deepika Padukone Net Worth (source Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2024, 4:05 PM IST

Deepika padukone Net worth Business : ఇండియాలో టాప్​ లెవల్​లో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేసే హీరోయిన్లలో దీపికా పదుకొణె ఒకరు. కల్కి 2898 ఏడీ చిత్రంతో రీసెంట్​గానే భారీ హిట్​ను అందుకున్న ఈ భామ, కన్నడలో ఐశ్వర్య (2006) సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. అలా మొదలైన ఆమె కెరీర్​ ఆ తర్వాత బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్​ వరకు వచ్చింది. బాలీవుడ్ బాద్ షా షారూక్​ ఖాన్‌తో నటించిన తన తొలి సినిమాకు ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోని దీపికా ఇప్పుడు రూ.500 కోట్ల నెట్​ వర్త్​ సంపాదించిందట. ఈమె సినిమాలు, పలు రకాల యాడ్​ల ద్వారా సంపాదించించడంతో పాటు ఇతర వ్యాపారాల్లో కూడా ఇన్వెస్ట్ చేసి కోట్లు సంపాదిస్తోందట. మరి దీపిక చేస్తున్న ఆ వ్యాపారాలేంటో, ఆమె ఆదాయ మొత్తం ఎంతో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

1. ప్రొడక్షన్ హౌజ్ - కేఏ ఎంటర్‌ప్రైజెస్​ ఎల్ఎల్పీ పేరిట దీపికా పదుకొణె 2017లో ఓ కంపెనీ​ స్థాపించారు. ఆ తర్వాత కేఏ ప్రొడక్షన్స్ పేరిట ఒక ప్రొడక్షన్ హౌజ్ నెలకొల్పారు. మేఘనా గుల్జార్ బయోపిక్​ డ్రామాను చపాక్(2020)గా తెరకెక్కించింది ఈ సంస్థనే. యాసిడ్ దాడి బాధితురాలు అయిన లక్ష్మీ అగర్వాల్ పాత్రను దీపికానే పోషించారు.

2. క్లాతింగ్ బిజినెస్ - కేఏ ప్రొడక్షన్స్ ఆరంభించడానికి ముందు క్లాతింగ్ లైన్​లో అడుగుపెట్టిన దీపిక ప్రముఖ ఈ కామర్స్ సైట్ మింత్రాతో కలిసి 2015లో ఈ వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫ్యాషన్ అంటే తన దృష్టిలో "ఎటువంటి ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్ డ్రెస్ వేసుకోగలగడం. నేను వేసుకునే దుస్తులు నా వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఇంకా 18-35 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న మల్టీ టాస్కింగ్ మహిళల గురించి చాటి చెప్తాయి" అని వివరించారు.

3. స్కిన్ కేర్ బ్రాండ్ - 2022వలో దీపికా పదుకొణె సొంతగా స్కిన్ కేర్ బ్రాండ్ 82°Eను లాంఛ్​ చేశారు. ఈ బ్రాండ్​లో ఫేషియల్ మాస్కులు, సన్ స్క్రీన్లు, మాయిశ్చరైజర్లు, లిప్ బామ్స్, క్లెన్సర్లు అందుబాటులో ఉంటాయట. ఈమెనే కాదు కృతి సనన్, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్​లు కూడా ఇలానే సొంత బ్రాండ్లు లాంఛ్​ చేశారు.
4. ఫర్లెన్కో- 2019వ సంవత్సరం ఫర్నిచర్ రెంటల్ ప్లాట్​ఫామ్​ అయిన ఫర్లెంకోలో ఇన్వెస్ట్ చేశారు దీపికా.
5. పర్పుల్ - ఫర్లెంకో మాత్రమే కాదు ఆన్ లైన్ బ్యూటీ ప్రొడక్ట్స్ మార్కెట్ ప్లేస్ అయిన పర్పుల్‌లో కూడా ఇన్వెస్ట్ చేశారు దీపిక. అది కూడా 2019లోనే.
6. ఎపిగేమియా - 2019లోనే ముంబయి బేస్డ్ ప్యాకేజ్‌డ్ ఫుడ్ స్టార్టప్ అయిన డ్రమ్ ఫుడ్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్​తో కలిశారు. ఎపిగేమియా అనే యోగర్ట్ బ్రాండ్​లో భాగస్వామ్యమయ్యారు. అడ్వర్టైజ్మెంట్ చేశారు. 7.బెల్లాట్రిక్స్ ఎరోస్పేస్ - బెంగళూరు బేస్డ్ స్పేస్ టెక్ స్టార్టప్ అయిన బెల్లాట్రిక్ ఎరోస్పేస్ కోసం రూ.21కోట్లు వెచ్చించి 2019లో ఇన్వెస్ట్ చేశారు దీపిక.
8. బ్లూస్మార్ట్ - ముంబయి, పుణె, హైదరాబాద్, దిల్లీలలో ఎలక్ట్రిక్ ట్యాక్సీ స్టార్టప్​లోనూ పెట్టబడులు పెట్టారు.
9. మోకోబరా - 2019లో ఐదు స్టార్టప్​లలో పెట్టుబడులు పెట్టిన దీపికా 2020లో ట్రావెలింగ్ బ్యాగ్స్ తయారుచేసే మోకోబరాలోనూ పెట్టుబడులు పెట్టారు.
10. ఆటంబర్గ్(Atomberg) టెక్నాలజీస్ - స్మార్ట్ ఫ్యాన్ మేకర్ అయిన ఆటంబర్గ్ టెక్నాలజీస్​లోనూ పెట్టుబడులు పెట్టారు.
11. సూపర్ టైల్స్ - 2021లో దీపికా పెట్ కేర్ ప్లాట్​ఫామ్​ అయిన సూపర్ టైల్స్​లో కూడా పెట్టుబడులు పెట్టారు.
12. బ్లూ టోకై కాఫీ - తన సొంత బ్రాండ్లే కాకుండా 2023లో ఇతర వ్యాపార సంస్థలను ప్రోత్సహించేలా గురుగ్రామ్​కు చెందిన బ్లూటోకైలో ఇన్​వెస్ట్​మెంట్ చేశారు దీపిక.స్టార్ హీరో లైనప్​లో ఏకంగా 9 సినిమాలు - రూ.650 కోట్ల బడ్జెట్​తో! - Big Budget Upcoming Movies

'దేవర' ప్రమోషన్స్​లో జాన్వీ అందం - చీర, ఇయర్ రింగ్స్ ధర రూ.14 లక్షలు! - Devara Promotions Janhvi Kapoor

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.