ETV Bharat / entertainment

పనిమనిషి ఆత్మహత్యాయత్నం - ప్రముఖ నిర్మాతపై పోలీస్ కేస్​ - Ke Gnanavel Raja

Ke Gnanavel Raja Police case : ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞానవేల్‌ రాజాపై పోలీసు కేసు నమోదైంది. అతని పనిమనిషి కుమార్తె చేసిన కంప్లైంట్‌ మేరకు పోలీసులు కేసు ఫైల్‌ చేశారు. ఏం జరిగిందంటే?

పనిమనిషి ఆత్మహత్యాయత్నం - ప్రముఖ నిర్మాతపై పోలీస్ కేస్​

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 26, 2024, 8:44 PM IST

Ke Gnanavel Raja Police case : ప్రముఖ తమిళ నిర్మాత కెఇ జ్ఞానవేల్ రాజాపై పోలీసు కేసు నమోదైంది. ఆయన ఇంట్లో పని చేసే మహిళ(లక్ష్మీ), కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జ్ఞానవేల్‌ రాజా, తన తల్లిపై దొంగతనం ఆరోపణలు చేశారని, అందుకే ఆమె మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని కంప్లైట్‌లో పేర్కొంది.

  • జ్ఞానవేల్‌ రాజా ఇంట్లో దొంగతనం?
    చెన్నైలోని టి నగర్‌లో జ్ఞానవేల్‌ రాజా నివాసం ఉంటున్నారు. ఇంట్లో తన భార్య నేహా బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో, పనిమనిషి లక్ష్మీపై ఆయన దొంగతనం ఆరోపణలు చేశారు. లక్ష్మీనే దొంగతనానికి పాల్పడినట్లు అనుమానిస్తూ మాంబలం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
  • పనిమనిషి ఆత్మహత్యాయత్నానికి కారణం ఏంటి?
    పోలీసుల విచారణలో, పోయిన నగలకు తనకు ఎలాంటి సంబంధం లేదని లక్ష్మీ తెలిపింది. అవసరమైనప్పుడు తదుపరి విచారణ కోసం అందుబాటులో ఉండాలని పోలీసులు ఆమెకు చెప్పి పంపారు. తనపై వచ్చిన ఆరోపణలతో మనస్తాపానికి గురైన లక్ష్మీ గన్నేరు పప్పు (Arali Seeds) తిని ఆత్మహత్యాయత్నం చేసింది. అదృష్టవశాత్తూ, చుట్టుపక్కల వాళ్లు గమనించడంతో హుటాహుటిన చెన్నై రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన అనంతరం లక్ష్మీ కూతురు జ్ఞానవేల్‌ రాజాపై పెట్టిన కేసు దర్యాప్తులో ఉంది.
  • కోలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత
    జ్ఞానవేల్ రాజా చెన్నైలో ఉన్న ప్రొడక్షన్‌, డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ స్టూడియో గ్రీన్ యజమాని. కోలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత. ఈ సంస్థ బ్యానర్‌పై ఆయన సిల్లును ఒరు కాదల్, పరుత్తివీరన్, సింగం, సిరుత్తై, ఆల్ ఇన్ ఆల్ అళగు రాజా, మద్రాస్, బిరియానీ, ఇంద్రు నేట్రు నాలై వంటి హిట్ సినిమాలు నిర్మించారు. సూర్య హీరోగా 2017లో వచ్చిన యాక్షన్‌ మూవీ సింగం 3ని కూడా ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.

తాజాగా డైరెక్టర్‌ శివ, స్టార్ హీరో సూర్యతో కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన కంగువ మూవీకి కూడా జ్ఞానవేల్ రాజా నిర్మాతగా వ్యవహరించారు. త్వరలో రిలీజ్‌ కానున్న కంగువపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి.

రీరిలీజ్ రికార్డ్స్​ - టాప్​లో ఎవరున్నారంటే? - Rerelease records

కాల్పులకు భయపడి సల్మాన్ ఖాన్ ఇల్లు మారుతున్నారా? - అసలు విషయం ఇదే - salman khan shoot out case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.