ETV Bharat / entertainment

హీరోగా మారిన ప్రముఖ కమెడియన్​ - టైటిల్​గా ఫేమస్​ డైలాగ్​ - దర్శకుడిగా ధనరా సినిమా

Abhinav Gomatam New Movie : కమెడియన్స్​ అభినవ్ గోమఠం, ధనరజ్​ కొత్త చిత్రాల టైటిల్​ పోస్టర్స్​ రిలీజ్​ అయ్యాయి. అభినవ్​ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా ధనరాజ్​ దర్శకుడిగా మారనున్నారు. ఆ వివరాలు.

హీరోగా మారిన ప్రముఖ కమెడియన్​ - టైటిల్​గా ఫేమస్​ డైలాగ్​

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 22, 2024, 9:55 PM IST

Abhinav Gomatam New Movie : టాలీవుడ్ ప్రముఖ కమెడియన్‌ అభినవ్ గోమఠం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'మళ్లీరావా' చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఆయన.. 'ఈ నగరానికి ఏమైంది' చిత్రంలో తనదైన కామెడీతో ప్రేక్షకులను బాగా నవ్వించారు. ఆ తర్వాత 'మీకు మాత్ర‌మే చెబుతా', 'ఇచ్చట వాహనములు నిలపరాదు', 'సేవ్ టైగ‌ర్' చిత్రాలతో క‌మెడియ‌న్‌గా మంచి పాపులారిటీ సంపాందించుకున్నారు. ఇప్పుడు హీరోగా మారారు. 'ఈ న‌గ‌రానికి ఏమైంది' చిత్రంలో ఆయన చెప్పిన పాపులర్ డైలాగ్ పేరునే టైటిల్​గా ఫిక్స్​ చేశారు. అభినవ్ కథానాయకుడిగా 'మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా' సినిమా తెరకెక్కనుంది. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. వైశాలి రాజ్ హీరోయిన్​గా నటిస్తోంది. ఈ సినిమాకు తిరుప‌తి రావు ఇండ్ల ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఆరెమ్ రెడ్డి, భ‌వాని కాసుల‌, ప్ర‌శాంత్‌.వి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ల‌వ్‌, కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి చివర్లో సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.

రామం రాఘవం : కమెడియన్​ ధనరాజ్ దర్శకుడిగా మారి ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్​ పోస్టర్​ను రిలీజ్ చేశారు. 'రామం రాఘవం' అనే పేరుతో సినిమా రాబోతుంది. పోస్టర్‌లో తండ్రి కొడుకులుగా సముద్రఖని, ధనరాజ్ కనిపిస్తున్నారు. ఇంటెన్స్‌తో కూడిన ఈ పోస్టర్​కు మంచి స్పందన వస్తోంది. ఇప్పటివరకు ఎప్పుడూ చూడని తండ్రి కొడుకుల కథను అద్భుతంగా తెరమీద చూపించబోతున్నట్లు దర్శకుడు ధనరాజ్ తెలిపారు. ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, రాకెట్ రాఘవ, రచ్చ రవి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి విమానం చిత్ర దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథను సమకూర్చారు. అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. దుర్గా ప్రసాద్ ఈ సినిమాకు కెమెరామెన్. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మిస్తున్నారు.

SSMB29 బిగ్ అప్డేట్​ - మూవీ అఫీషియల్ లాంఛ్​ ఆరోజే​!

షూటింగ్​లో గాయపడిన 'దేవర' విలన్​ - ఆస్పత్రికి తరలింపు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.