ETV Bharat / entertainment

శర్వా కోసం ఇద్దరు భామలు - 'సిటాడెల్‌' అప్డేట్​తో సమంత - శర్వానంద్ సంయుక్తమేనన్

Citadel Webseries Samantha : హీరోయిన్ సమంత సిటాడెల్​ సిరీస్​ గురించి అప్డేట్​ ఇచ్చింది. అలాగే హీరో శర్వానంద్​ కొత్త సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని తెలిసింది. ఆ వివరాలు

శర్వా కోసం ఇద్దరు భామలు - సమంత 'సిటాడెల్‌' ఎక్కడిదాకా వచ్చిందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2024, 6:35 AM IST

Citadel Webseries Samantha : హీరోయిన్ సమంత, బాలీవుడ్ హీరో వరుణ్​ ధావన్‌ జంటగా నటించిన యాక్షన్‌ థ్రిల్లింగ్‌ వెబ్‌సిరీస్‌ 'సిటాడెల్‌'. 'ఫ్యామిలీ మెన్' సిరీస్​ ఫేమ్​ రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించారు. ఎప్పుడో ప్రారంభమైన ఈ సిరీస్‌ తాజాగా షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని హీరోయిన్​​ సమంత సోషల్ మీడియాలో షేర్ చేసింది. సిరీస్‌లో తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పినట్లు పేర్కొంది. స్టూడియోలో ఉన్న ఫొటోలను ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేసింది. కాగా, 'ఫ్యామిలీ మ్యాన్‌ 2'లో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న రోల్​తో ఆకట్టుకున్న సామ్​ 'సిటాడెల్‌' కోసం ప్రత్యేకంగా సిద్ధమైంది. మార్షల్‌ ఆర్ట్స్‌లోనూ శిక్షణ తీసుకుంది. ముఖ్యంగా వరుణ్‌, సామ్‌ కలిసి చేసే యాక్షన్‌ సీన్స్​ అలరిస్తాయని మూవీటీమ్ చెబుతోంది. 1990ల నేపథ్యంలో ఈ సిరీస్‌ సాగనుందని తెలుస్తోంది. వీలైనంత వరకు డూప్‌ లేకుండా సామ్​ యాక్షన్‌ సీక్వెన్స్‌ను పూర్తి చేసిందని తెలిసింది. ఈ క్రమంలోనే స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. రుస్సో బ్రదర్స్‌ నిర్మించిన ఈ సిరీస్‌ పలు దేశాల్లో, వివిధ భాషల్లో రూపొందింది. సిటాడెల్‌ ఒరిజినల్ వెర్షన్​లో ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మ్యాడెన్‌ నటించారు.

శర్వా కోసం ఇద్దరు : 'సామజవరగమన' చిత్రంతో ఆడియెన్స్​ను విపరీతంగా నవ్వించారు దర్శకుడు రామ్‌ అబ్బరాజు. ఇప్పుడాయన తన నెక్ట్స్​ మూవీని హీరో శర్వానంద్‌తో చేసేందుకు రెడీ అవుతున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ దీన్ని నిర్మించనుంది. రొమాంటిక్​ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో శర్వాకు జోడీగా ఇద్దరు హీరోయిన్లు కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. సంయుక్తా మేనన్‌తో పాటు సాక్షి వైద్య పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వారిద్దరితో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్‌ నచ్చడం వల్ల వాళ్లు కూడా సుముఖత చూపించినట్లు తెలిసింది. శర్వానంద్‌ ప్రస్తుతం శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. అది ముగింపు దశకు వచ్చింది. ఈ మూవీ కంప్లీట్ అవ్వగానే కొత్త చిత్రం పట్టాలెక్కనుంది.

NBK 109 బాలయ్యకు జోడీగా శ్రద్ధ?

రాజమౌళి - మహేశ్ సినిమాలో నాగార్జున?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.