ETV Bharat / entertainment

వరుణ్, సమంత - సింగిల్ షాట్​లో 11 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్​ - CITADEL HONEY BUNNY TRAILER

సిటాడెల్​ సిరీస్​ కోసం తాను సమంత ఎంతలా కష్టపడ్డారో వివరించిన హీరో వరుణ్ ధావన్.

Citadel - Honey Bunny Trailer
Citadel - Honey Bunny Trailer (source ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 15, 2024, 7:00 PM IST

Citadel - Honey Bunny Trailer : బాలీవుడ్​ హీరో వరుణ్‌ ధావన్‌, హీరోయిన్ సమంత జంటగా నటించిన యాక్షన్‌ థ్రిల్లింగ్‌ వెబ్‌సిరీస్‌ సిటడెల్‌: హనీ-బన్నీ. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో ఇది తెరెకక్కింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముంబయిలో లాంఛ్ ఈవెంట్​ నిర్వహించి దీనిని విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రంలో యాక్షన్‌ సన్నివేశాల్లో వరుణ్‌, సమంత అదరగొట్టారు.

Varun Dhawan Samantha : ఈ లాంఛ్ ఈవెంట్​లో వరుణ్ ధావన్ మాట్లాడుతూ సినిమాలో తాను సమంత ఓ సీన్​ కోసం ఎంతలా కష్టపడ్డారో వివరించారు. సింగిల్ షాట్​లో 11 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్​ చేసినట్లు వివరించారు. ఎటువంటి కట్స్​ లేకుండా దానిని చేసినట్లు తెలిపారు. ఇది పక్కా ఇంటెన్స్​ యాక్షన్ సీక్వెన్స్​ అని, సిరీస్​ క్లైమాక్స్​లో వస్తుందని పేర్కొన్నారు.

మాతో ఎందుకు చేయరు అని అడిగా? - "లాక్‌డౌన్‌ టైమ్​లో దర్శక - నిర్మాత ఆదిత్య చోప్రాను కలిశాను. అప్పుడు ఆయన టైగర్‌ 3 సినిమా ( కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ హీరో) పనుల్లో ఫుల్​ బిజీగా ఉన్నారు. సర్‌ ఎందుకు యంగ్‌ హీరోస్​తో మీరు యాక్షన్‌ చిత్రాలను చేయరు? అని అడిగాను. దానికి బడ్జెట్‌ లెక్కలు ఉంటాయని ఆయన బదులిచ్చారు. దీంతో సిటడెల్‌ క్రియేటర్స్‌ నన్ను కలిసి నప్పుడు బడ్జెట్‌ గురించే మొదట మాట్లాడాను. నాకు అవకాశం ఇచ్చిన రాజ్‌ అండ్​ డీకే, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీ సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు" అని వరుణ్ ధావన్ పేర్కొన్నారు.

కాగా, ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మ్యాడెన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్‌ సిరీస్‌ సిటడెల్‌. దీనికి ఇండియన్‌ వెర్షన్​గా సిటడెల్‌ : హనీ -బన్నీ తెరకెక్కింది. దీని కూడా రాజ్‌, డీకే దర్శకత్వం వహించారు. కానీ ఇది మిక్స్​డ్​ రివ్యూస్​ను అందుకుంది. ఇకపోతే ఇండియన్ వెర్షన్ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో నవంబరు 7 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఇందులోని యాక్షన్‌ సీన్స్‌ ప్రత్యేకంగా ఉంటాయని మూవీటీమ్ చెబుతోంది.

శిరస్సు వంచి ఈ విషయాన్ని చెబుతున్నాను! : ఎన్టీఆర్​

రామ్​చరణ్​తో పోటీకి దిగనున్న నాగచైతన్య!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.