ETV Bharat / entertainment

'విశ్వంభర' హీరోయిన్ అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ - 18 ఏళ్ల తర్వాత కాంబో రిపీట్​ - chiranjeevi viswambara movie

Chiranjeevi Viswambara Movie Heroine : సోషియో ఫాంటసీ 'విశ్వంభ‌ర‌'లో హీరోయిన్ ఎవ‌ర‌నే స‌స్పెన్స్‌కు తెర‌ప‌డింది. ఇంతకీ హీరోయిన్ ఎవరంటే?

'విశ్వంభర' హీరోయిన్ అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ - 18 ఏళ్ల తర్వాత కాంబో రిపీట్​

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 5, 2024, 11:10 AM IST

Updated : Feb 5, 2024, 12:31 PM IST

Chiranjeevi Viswambara Movie Heroine : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ 'విశ్వంభ‌ర‌' చిత్రంలో హీరోయిన్ ఎవ‌ర‌నే స‌స్పెన్స్‌కు తెర‌ప‌డింది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా న‌టించనుంది. ఈ విష‌యాన్ని సోమ‌వారం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చిరంజీవినే స్వయంగా ఆఫీషియ‌ల్‌ అనౌన్స్​మెంట్​ చేశారు. త్రిష విశ్వంభ‌ర సెట్స్‌లో అడుగుపెట్టిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

18ఏళ్ల తర్వాత : ఇకపోతే గ‌తంలో 2006లో స్టాలిన్ సినిమా కోసం చిరంజీవి - త్రిష కలిసి నటించారు. ఈ చిత్రంలో చిరుకు జోడీగా త్రిష‌ ఆడియెన్స్​ను ఎంటర్​టైన్ చేసింది. మళ్లీ ఇప్పుడు దాదాపు ప‌ద్దెనిమిదేళ్ల గ్యాప్ త‌ర్వాత మ‌రోసారి చిరంజీవితో కలిసి త్రిష నటించనుంది. ప్రస్తుతం విశ్వంభర మూవీ షూటింగ్ హైదరాబాద్‌‌లో ప్రత్యేకంగా వేసిన సెట్స్​లో జరుగుతోందట. హై రేంజ్​ విజువల్స్​తో షూట్ చేస్తున్నారని అంటున్నారు. ఈ నెల 9 నుంచి ఓ సాంగ్ షూట్ చేయబోతున్నారని తెలిసింది. ఈ షెడ్యూల్‌లోనే త్రిష జాయిన్ కానుందని సమాచారం అందింది.

Viswambara Relese Date : విశ్వంభ‌ర సినిమాకు బింబిసార ఫేమ్​ వ‌శిష్ట మ‌ల్లిడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమాకు సంబంధించి కాన్సెప్ట్​ వీడియో బాగానే ఆకట్టుకుంది. మూవీపై మరింత ఆసక్తిని పెంచింది. సంక్రాంతి కానుక‌గా 2025 జ‌న‌వ‌రి 10 ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఫాంట‌సీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేష‌న్స్ బ్యానర్​పై వంశీ, ప్ర‌మోద్‌, విక్ర‌మ్ నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్​ గ్రహీత కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.

కాగా, రీఎంట్రీలో వరుస సినిమాలతో అలరిస్తున్నారు చిరంజీవి. అయితే గత ఏడాది కూడా రెండు చిత్రాలను చేయగా మొదటిది 'వాల్తేరు వీరయ్య' సూపర్​ హిట్​గా నిలిచింది. రెండోది 'భోళాశంకర్' మాత్రం దారుణంగా డిజాస్టర్​ టాక్​ను మూటగట్టుకుంది. దీంతో ఆచితూచి మరీ విశ్వంభర కథను ఎంచుకున్నారు చిరు. చూడాలి మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటో లేదో, వసూళ్లను తెచ్చిపెడుతుందో లేదో.

గ్రామీ విజేతలుగా శంకర్​ మహదేవన్​, జాకీర్ హుస్సేన్​

నిమిషానికి కోటిన్నర - 'లాల్​ సలామ్'​ రజనీ రెమ్యునరేషన్ అన్ని కోట్లా?

Last Updated : Feb 5, 2024, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.