Chiranjeevi Vishwambhara Movie : మెగాస్టార్ చిరంజీవీ- బింబిసార ఫేమ్ వశిష్ఠ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'విశ్వంభర'. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇటీవలే విడుదలైన ఈ మూవీ టైటిల్ కాన్సెప్ట్ వీడియో మూవీ లవర్స్‌ను ఎంతాగానో ఆకట్టుకుంది. ఇందులో చూపించిన విజువల్స్ వల్ల ఈ సినిమా పై మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఓ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ కాగా, తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
హైదరాబాద్‌లో ఈ సినిమా కోసం దాదాపు 7 ఎకరాల్లో 13 భారీ సెట్స్ నిర్మిస్తున్నట్లు సమచారం. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఆధ్వర్యంలో ఈ సెట్స్ నిర్మాణం జరుగుతోందట. ఇక కొత్తగా తయారైన సెట్స్‌లో ఫిబ్రవరి మొదటి వారం నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయంపై ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Chiranjeevi Socio Fantasy Movies : ఇక చిరు ఈ తరహా జానర్ సినిమాల్లో నటించడం ఇదేం తొలిసారి కాదు. ఆయన ఇది వరకే 'జగదేక వీరుడు అతిలోక సుందరి','అంజి' లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు ఈ సినిమాతో తనను మరింత కొత్తగా చూపించేందుకు మూవీ మేకర్స్ ప్రయత్నిస్తాన్నారు. భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ సినిమాకు మ్యాజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.
మరోవైపు ఈ కాన్సెప్ట్ వీడియోను తయారు చేసిన వ్యక్తి ఎవరా అంటూ ఫ్యాన్స్ నెట్టింట తెగ ఆరా తీస్తున్నారు. అయితే అయితే ఈ టైటిల్ కాన్సెప్ట్ వీడియోను డిజైన్ చేసింది ఎవరో తెలుసా? అతని పేరే అనిల్ కుమార్ ఉపాధ్యాయుల. అసోసియేట్ డైరెక్టర్‌గా యూవీ క్రియేషన్స్ బ్యానర్లో పలు సినిమాలకు పని చేశారు. ప్రభాస్ నటించిన 'సాహో' సినిమాతో పాటు 'రాధేశ్యామ్'కు కూడా ఈయన పని చేశారు. 'రాధేశ్యామ్' చిత్రంలోని 'నీ రాతలే' సాంగ్‌కు కాన్సెప్ట్ డిజైన్ చేసి పిక్చరైజ్ చేశారు.