Chiranjeevi PadmaVibhushan : టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి తన నటనతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలతోనూ ప్రజల మనసుల్లో నిలిచారు. అయితే ఆయన ఈ ఏడాది దేశంలోని రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికైన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్, సినీ రాజకీయ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గురించి గతంలో సినీ సెలబ్రిటీలు ఎవరెవరు ఏమని చెప్పారో తెలుసుకుందాం.
1. బ్రదర్ చిరంజీవిలోని క్రమశిక్షణ, వినయ విధేయతలే అతడిని ఉన్నత స్థానానికి తీసుకు వెళ్ళాయి. - ఎన్టీ రామారావు
2. చిరంజీవి కళాకారుడు కాదు, కళాకార్మికుడు. - రావు గోపాలరావు
3. చిరంజీవి కళ్ళంటే నాకెంతో ఇష్టం. ఆ కళ్ళల్లో పులి చూపు, లేడి చూపూ రెండూ ఉన్నాయి. ఎలా కావాలంటే అలా మలుచుకోగల నటుడు చిరంజీవి. - బాపు
4. చిరంజీవిని చూస్తే నాకు ఈర్ష్య. అతడు నాకన్నా అందగాడు కాదు, కానీ శాస్త్రీయ, జానపద, డిస్కో, బ్రేక్ ఇలా ఏ డ్యాన్స్ అయినా అది చిరంజీవి చేస్తేనే అన్పించేట్టు చేస్తాడు. అందుకే చిరంజీవి అంటే నాకు ఆనందంతో కూడిన అసూయ! - కమల్ హాసన్
5. తన స్టెప్స్‌తో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసే చిరంజీవిని చూసి అసూయపడతాను - రజనీకాంత్
6. మా ముందున్న ఏకైక లక్ష్యం చిరంజీవిగారు. అసలు ఆయనంటూ లేకుంటే మాకొక లక్ష్యం లేకుండా పోయుండేది, అంతటి గొప్ప ఆర్టిస్టు చిరంజీవిగారు!! - వెంకటేశ్
7. ఇండియాలో డ్యాన్స్ అద్భుతంగా చేయగల హీరో చిరంజీవిగారొక్కరే!! - నాగార్జున
8. నేను అభిమానించే ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి - గోవిందా
9. రజనీకాంత్ + కమల్‌హాసన్ = చిరంజీవి - కె. బాలచందర్
10. చిరంజీవి '' God of Andhra Pradesh - ప్రవేశ్ సిప్పి
11. చిరంజీవి ఇమేజ్ అనితర సాధ్యం! చిరంజీవి లాంటి నటుడు భారతీయుడు కావడం గర్వకారణం. - అనిల్ కపూర్
12. 'చిరంజీవిలోని డిసిప్లిన్, డెడికేషన్ ఇంతదాకా ఏ హీరోలోను నేను చూడలేదు'. - ఎన్.ఎన్. సిప్పీ
13. ఇండస్ట్రీకి లాస్ట్ నంబర్వన్ హీరో మెగాస్టార్ చిరంజీవిగారే! - మహేశ్ బాబు
14. చిరంజీవితో నేను 23 సినిమాలకు దర్శకత్వం వహించాను. తపన, ఏకాగ్రత, నిరంతర కృషి, క్రమశిక్షణ, చిరంజీవిలో నేను పరిశీలించిన అంశాలు. ఎంత కంఫర్టబుల్ ఆర్టిస్ట్ కాకపోతే చిరంజీవితో నేను అన్ని సినిమాలు చేయగలను!! - హి ఈజ్ బిగ్, బిగ్గర్ ద్యాన్ ది వర్డ్!! - ఎ. కోదండ రామిరెడ్డి
15. ఇండస్ట్రీలో ఇంకో మెగాస్టార్ పుట్టలేదు, పుట్టబోడు, ఎప్పటికీ చిరంజీవి ఒక్కరే మెగాస్టార్. - ప్రకాశ్ రాజ్
16. చిరంజీవి అంటే ఒక బంగారు నాణెం, ఏ నాణాకైనా ఒక పక్క బొమ్మ, ఒక పక్క బొరుసూ ఉంటే చిరంజీవి అనే నాణానికి రెండు వైపులా బొమ్మే ఉంది. ఒక బొమ్మలో మహోన్నత వ్యక్తి ఉంటే, మరో బొమ్మలో మహోన్నత నటుడు ఉన్నాడు. - సి. అశ్వనీదత్
17. చిరంజీవి వందరోజుల హీరోకాదు, 365 రోజుల హీరో - డా. దాసరి నారాయణరావు
18. 24 గంటల్లో 22 గంటలు పని చేసే హీరో మెగాస్టార్ చిరంజీవి - టి. త్రివిక్రమరావు
19. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే 1 నుండీ 50 వరకూ చిరంజీవిగారే స్టార్ హీరో - కోడి రామకృష్ణ
20. చిరంజీవిగారికి తప్ప మిగతా ప్రపంచానికంతా ఆయన మెగాస్టార్. తనకు మాత్రం చిరంజీవే!! - వి.వి. వినాయక్
21. ఉదయించే సూర్యుడు సాయంత్రానికి అలసిపోతాడు, అలుపెరగని సూర్యుడు చిరంజీవి - బ్రహ్మానందం
22. చిరంజీవిగారు ఆంధ్రప్రదేశ్‌కు మదర్ థెరిస్సా లాంటివారు - చిన్ని క్రిష్ణ
23. చిరంజీవి ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ - ఛోటా.కె. నాయుడు
-24. 'ఆయన కాలు బాగుంటే నా కాలు బాగుంటుంది' - లారెన్స్
25. "చిరంజీవి మంచి విలన్ అవుతాడనుకొని నా చెల్లెలు సురేఖనిచ్చి పెళ్ళి చేశాను. ఇలా అయిపోతాడనుకోలేదు. ఏమిటో నేను షేక్ హ్యాండిచ్చిన మహిమ, పై కొచ్చాడు." - అల్లు అరవింద్
చిరంజీవికి పద్మ విభూషణ్ - అల్లు అర్జున్, రామ్‌చరణ్ ఏమన్నారంటే?
సినిమాలకు గ్యాప్ - 'ఖైదీ 150'తో టాప్ - అప్పటికీ ఇప్పటికీ 'మెగా'స్టారే