ETV Bharat / entertainment

మెగాస్టార్ సరసన హనీరోజ్​​ - ఏ సినిమాలో అంటే? - viswambara movie heroines

Chiranjeevi Honey Rose : 'వీరసింహా రెడ్డి' వంటి బ్లాక్ బస్టర్​ తర్వాత మళ్లీ స్క్రీన్​పై కనిపించని హనీరోజ్​కు తెలుగులో మరో సూపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరుతో కలిసి నటించే అవకాశం అందుకోనున్నట్లు కథనాలు వస్తున్నాయి.

హనీరోజ్​కు లక్కీ ఛాన్స్​ - మెగాస్టార్​ సినిమాలో ఆఫర్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2024, 6:38 PM IST

Chiranjeevi Honey Rose : హనిరోజు తెలుగులో 'వీరసింహా రెడ్డి' వంటి బ్లాక్ బస్టర్​ తర్వాత మరే చిత్రంలోనూ నటించలేదు. ఈ సినిమా విడుదలై ఏడాది దాటినప్పటికీ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కానీ సోషల్​ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్​గా ఉంటూ అభిమానులకు టచ్​లోనే ఉంటోంది. ఎక్కువగా మాల్స్‌ ఓపెన్సింగ్‌ లేదా ఇతర ఫంక్షన్లలోనే కనిపిస్తూ వాటికి సంబంధించి గ్లామర్ ఫొటోలను నెట్టింట్లో పోస్ట్ చేసి ఆకట్టుకుంటోంది. అలా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే 4.2 మిలియన్ల ఫాలోవర్స్​ను సంపాదించుకుంది.

అయితే ఆ మధ్యలో మాత్రం రెండు చిత్రాల్లో నటిస్తున్నట్లు ప్రకటించింది హనీరోజ్​. రాచెల్, తెరీ మెరీ అనే సినిమాల్లో నటిస్తున్నట్లు తెలిపింది. కానీ అవి తెలుగులో నేరుగా తెరకెక్కట్లేదు. ఇందులో రాచెల్ మాత్రం పాన్​ ఇండియా లెవల్​లో రూపొందుతోంది. దీనికి సంబంధించిన పోస్టర్​లో హనీ పక్కా మాస్​ రోల్​లో కనిపించి సర్​ప్రైజ్ ఇచ్చింది. ఇక తెరీ మెరీ చిత్రంలోనూ లీడ్​ రోల్ చేస్తోంది. అయితే ఈ చిత్రాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్​ రాలేదు.

మెగాస్టార్​తో స్క్రీన్​ షేర్​ : వీర సింహారెడ్డి తర్వాత ఇంతకాలానికి తెలుగులో హనీరోజ్​ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజాగా సమాచారం అందుతోంది. ఈ సారి కూడా సీనియర్‌ హీరోతోనే రాబోతున్నట్లు తెలిసింది. మెగాస్టార్‌ చిరంజీవి సరసన నటించే లక్కీ ఛాన్స్​ను అందుకుందని ఫిల్మ్​ నగర్​లో టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం చిరు 'విశ్వంభర' అనే సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్​ వశిష్ఠ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. విజువల్‌ వండర్‌గా రానున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలై ప్రీ లుక్ పోస్టర్స్ కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని మొదటి నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అనుష్క, కాజల్​, నయనతార, మృణాల్ ఠాకూర్​ పేర్లు వినిపించగా ఇప్పుడు హనిరోజ్ పేరు తెరపైకి వచ్చింది. చర్చలు జరుగుతున్నాయని బయట కథనాలు కనిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్​మెంట్​ వచ్చేవరకు వేచి ఉండక తప్పదు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

OTTలోకి ఈ వారం 21 సినిమా, సిరీస్​లు - ఆ రెండిటిపై స్పెషల్ ఇంట్రెస్ట్​!

OTTలోకి సెన్సేషనల్​ రియల్ క్రైమ్ థ్రిల్లర్ - ఎక్కడ చూడాలంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.