Chiranjeevi Screen Name Story : సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొంతమంది స్టార్స్ తమ అసలు పేరుకంటే స్క్రీన్ పేరుతో పాపులర్ అవుతుంటారు. అందులో మన చిరంజీవి కూడా ఉన్నారు. సినిమాల్లోకి రాకముందు శివ శంకర వర ప్రసాద్‌గా ఉన్న ఆయన చిరంజీవిగా ఎలా మారరో తెలుసా? ఇంతకీ ఆయనకు ఆ పేరు ఎలా వచ్చిందో చిరునే ఓ సందర్భంలో రివీల్ చేశారు. ఆ విశేషాలు మీ కోసం.
"మనం యాక్టర్ అయ్యాక, శివ శంకర్ వరప్రసాద్ అనే పేరు స్క్రీన్‌పై కనిపిస్తే కాస్త ఇబ్బందిగా ఉంటుందని అనిపించింది. అలాగ అని, శివ, శంకర్, ప్రసాద్, ఇలా ఏ పేరు పెట్టుకున్నా, ఇప్పటికే వచ్చిన పేరులానే అనిపిస్తోంది. అందుకే ఏదైనా ప్రత్యేకమైన పేరు ఉంటే బాగుంటుందని అనుకున్నాను. అయితే మనకు వచ్చిన కలలు సాధరణంగా గుర్తుండవు. కానీ, ఓ రోజు నాకొచ్చిన కల మాత్రం అలానే గుర్తుండిపోయింది. అదేంటంటే నేను రాములవారి గర్భగుడి ముందు పడుకుని ఉన్నాను. అప్పుడు ఓ పదేళ్ల అమ్మాయి ఆ గుడిలోకి వచ్చి, 'ఏంటి చిరంజీవి ఇక్కడ పడుకున్నావ్. బయటకెళ్లి పని చూసుకో. టైమ్ అయింది' అని అనడం వల్ల నేను లేచాను. అప్పుడే చూట్టూ చూసి 'ఇదేంటి గుడిలో ఉన్నాను' అని అనిపించింది. అయినా 'నా పేరు శివ శంకర్ కదా.. ఆ పాప ఎందుకు చిరంజీవి అని పిలిచింది? నేను ఉలిక్కిపడి లేవడమేంటి' అని అనుకుంటూ వస్తుండగా, గుడి గోడ బయట నుంచి నా ఫ్రెండ్ కూడా 'చిరంజీవి రా రా వెళ్దాం' అని పిలిచాడు. దీంతో ఇదేంటి అందరూ నన్ను అలా పిలుస్తున్నారంటూ అనుకుంటుండగానే నిద్ర నుంచి మెలకువ వచ్చింది. అసలు చిరంజీవి అనే ఓ పేరు ఉంటుందని నాకు అప్పటివరకూ తెలియనే లేదు. ఇదే విషయాన్ని మా అమ్మకు చెప్తే 'స్క్రీన్ నేమ్‌గా ఇదే ఎందుకు ఉండకూడదు' అని ఆమె అన్నారు. అలా తెరపై నా పేరు అడిగితే 'చిరంజీవి' అని చెప్పేశాను. అప్పటి నుంచి నా స్క్రీన్ పేరు చిరంజీవి అయింది" అని చెప్పుకొచ్చారు.
మెగాస్టార్ సాధించిన టాప్ 10 రికార్డ్స్ - చిరుకు మాత్రమే ఇవి సాధ్యం! - Chiranjeevi Top 10 Records