Balakrishna Favourite Movie In Chiranjeevi Films : సినీ ఇండస్ట్రీల్లో కొంతమంది సెలబ్రిటీల మధ్య ఉన్న అనుబంధాన్ని పత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయా స్టార్స్ తమ సహా నటులతో ఉన్న రిలేషన్ గురించి పలుమార్లు చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సినిమాల పరంగా ఎంత పోటీ ఉన్నా కూడా పర్సనల్ లైఫ్ వచ్చేసరికి మంచి మిత్రులుగా మారిపోతుంటారు. అలాంటి వాళ్లలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా ఉన్నారు.
ఎన్నోసార్లు ఈ ఇద్దరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద క్లాష్ అయినప్పటికీ ఇద్దరూ ఒకరిపై ఇంకొకరు ప్రశంసల జల్లు కురిపిస్తూ సపోర్ట్ చేస్తుంటారు. అలా తమ అభిమానాన్ని చాటుకున్న సందర్భాలూ కూడా చాలానే ఉన్నాయి. అలా ఒకానొక సమయంలో చిరంజీవి గురించి నందమూరి నటసింహం బాలకృష్ణ మాట్లాడారు. చిరు నటించిన సినిమాల్లో తనకు నచ్చిన మూవీ గురించి చెప్పుకొచ్చారు.
చిరు సినిమాల్లో ఆయనకు ఎంతో ఇష్టమైన సినిమా ఏంటంటే అది 'జగదేకవీరుడు అతిలోకసుందరి' అని బాలయ్యే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ విషయం విన్న ఫ్యాన్స్ బాలయ్య ఛాయిస్ బాగుందంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఒకే వేదికపై చిరు బాలయ్య
ఏదైనా సినిమాలకు సంబంధించిన ఫంక్షన్స్‌లోనో లేకుంటే ఏదైనా ముఖ్యమైన ఈవెంట్స్‌లోనూ చిరు, బాలయ్యను ఒకే వేదికపై చూసుంటాం. ముఖ్యంగా సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో వీరిద్దరూ చేసిన సందడి అంతా ఇంతా కాదు. కానీ తరచూ చూడటం మాత్రం అరుదు. అయితే చాలా కాలం తర్వాత చిరు బాలయ్య ఒకే వేదికపై కనిపించనున్నారట.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫరామ్ వేదికగా బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన 'అన్‌స్టాపబుల్' మూవీ ప్పుడు నాలుగో సీజన్‌తో ముందుకు రానుంది. ఇప్పటికే ఈ షో కోసం సన్నాహాలు కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. అయితే ఈ సీజన్‌కు చీఫ్ గెస్ట్‌గా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రానున్నారని సమాచారం. వాస్తవానికి ఈ ప్రచారం ప్రతీ సీజన్‌లోనూ సాగింది. కానీ అది జరగలేదు.
అయితే ఈ కొత్త సీజన్‌కు మాత్రం చిరు వస్తారని రూమర్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే చిరంజీవినే కాదు టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున కూడా ఈ సారి పాల్గొంటారని సమాచారం. వీటన్నింటితో పాటు, మరికొన్ని సర్‌ప్రైజ్ కూడా ఉంటాయని సమాచారం. దీనిపై ఆహా నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఆ ఒకే ఒక్క కలతో - శివ శంకర వరప్రసాద్ కాస్త చిరుగా ఛేంజ్! - Chiranjeevi Screen Name Story