ETV Bharat / entertainment

ఆ అవమానం ఎదుర్కొని నెం.1 హీరోగా ఎదిగి: చిరంజీవి జర్నీ ఇది! - Chiranjeevi Birthday

Chiranjeevi Birthday: మెగాస్టార్ చిరంజీవి గురువారం పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్థానం గురించి గుర్తుచేసుకుందాం.

Chiranjeevi Birthday
Chiranjeevi Birthday (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 22, 2024, 6:12 AM IST

Chiranjeevi Birthday: మెగాస్టార్ చిరంజీవి పేరుకు పరిచయం అక్కర్లేదు. మధ్యతరగతి వ్యక్తిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన ప్రస్తుతం టాప్ హీరోగా కొనసాగుతున్నారు. అయితే ఆయన నంబర్​ 1 హీరోగా ఎదగడానికి కారణం కృషి, పట్టుదల ఎదురైన అవమానాలు. గురువారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రయాణాన్ని గుర్తుచేసుకుందామా?

అలా అరంగేట్రం
1978 సమయంలో ఎందరో హేమా హేమీల్లాంటి నటులున్న తెలుగు చిత్ర పరిశ్రమలోకి శివ శంకర వరప్రసాద్‌ (చిరంజీవి) ప్రవేశించారు. నటనపై ఎంతో ఆసక్తి ఉండడం వల్ల ఇండస్ట్రీలో వారందరినీ చూసి ఆయన భయపడలేదు. కచ్చితంగా అదే రంగంలో రాణిస్తాననే బలమైన నమ్మకంతో ఉండేవారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత 'పునాది రాళ్లు' సినిమాలో నటించారు. అయితే దాని తర్వాత నటించిన 'ప్రాణం ఖరీదు' సినిమా ముందుగా విడుదలైంది. ఈ సినిమాతోనే ఆయన ప్రేక్షకులకు పరిచయమయ్యారు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు.

ఆ క్రమంలోనే ఆయన్ను ఇతర హీరోల చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించమని కొందరు డిమాండ్‌ చేసేవారట. ఒకవేళ చెయ్యను అని చెబితే భవిష్యత్తుపై ప్రభావం పడుతుందేమోనన్న భయం, మనల్ని మనం నిరూపించుకునే సమయం ఎప్పటికైనా వస్తుందనే ఆశతోనే వాటిలో నటించినట్లు చిరంజీవి ఓ సందర్భంలో తెలిపారు. తాననుకున్న గమ్యాన్ని చేరుకుని ఎందరిలోనో స్ఫూర్తినింపారు. అవరోధాలు ఎదురైనా లక్ష్యాన్ని వీడకూడదనే దాన్ని ఈ సంఘటన తెలియజేస్తుంది.

ప్రివ్యూలు చూసి, రివ్యూలు ఇచ్చి
చిరంజీవి ఇండస్ట్రీలోకి వెళ్లకముందు హరిప్రసాద్‌, సుధాకర్‌తో మద్రాసులో ఉండేవారు. 'పూర్ణా పిక్చర్స్‌' సంస్థ మేనేజరు తాము పంపిణీ చేసే సినిమాల ప్రివ్యూలు చూసి, వాటి రివ్యూలు ఇవ్వమని వారికి చెప్పేవారు. అలా ఓ హోదాలో ఓ సినిమా చూడడానికి వెళ్లిన వారు ముందు వరుసలో కూర్చొన్నారు. ఇంతలో ఆ సినిమాలో హీరోగా నటించిన వ్యక్తికి చెందిన డ్రైవర్‌, మేకప్‌మేన్‌లు రావడం వల్ల చిరంజీవి, హరిప్రసాద్‌, సుధాకర్‌లను లేపి వారిని కూర్చోబెట్టారట. చేసేదేమీలేక చిరు అండ్‌ కో నిల్చొనే సినిమాని చూశారు.

'సినిమా ఎలా ఉంది?' అని ఆ సంస్థ అధినేత భార్య అడగ్గా 'ఆంటీ మీ అతిథులుగా మేం అక్కడకు వెళ్లాం. కానీ, ఆ హీరో మమ్మల్ని డోర్‌ దగ్గర నిలబెట్టాడు. తిరిగి వచ్చేస్తే మీకు చెడ్డపేరు వస్తుందని భరించాం. చూడండి ఆంటీ ఈ ఇండస్ట్రీకి నంబరు 1 హీరోని కాకపోతే నన్ను అడగండి' అని ఆవేశంతో అన్నారట. చివరకు ఆమెకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఆత్మవిశ్వాసానికి మించింది మరొకటి లేదని ఈ పరిణామం స్పష్టం చేస్తుంది.

విమర్శలు స్వీకరించి
ఇండస్ట్రీలో డ్యాన్స్‌ అంటే చిరు అనే పేరుంది. ఆయన అంత గొప్ప డ్యాన్సర్‌గా మారడం వెనుక ఆసక్తికర కథ ఉంది. తొలినాళ్లలో చిరంజీవి ఓ సినిమాలోని పాట పూర్తిచేసుకుని బయటకు వచ్చి వెంకన్న అనే మేనేజరును కలుసుకున్నారు. 'ఎలా ఉంది? నా పెర్ఫార్మెన్స్‌' అని అడగ్గా 'ఆ అందులో ఏముంది? నీ వెనుక డ్యాన్సర్లు ఏం చేశారో, అదే నువ్వు చేశావ్‌. నీ ప్రత్యేకత చూపించాలి కదా?' అని ఆ మేనేజరు అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి కొరియోగ్రాఫర్లు చెప్పినదానికి అదనంగా డ్యాన్స్‌ చేస్తూ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు చిరు.

నటన మెరుగుపరుచుకోవడంలో సినీ క్రిటిక్‌ గుడిపూడి శ్రీహరి పాత్ర ఉందని చిరంజీవి ఓ సందర్భంలో తెలిపారు. ఓ సినిమాకి సంబంధించిన రివ్యూలో 'నటనలో వేగం ఉండాలిగానీ మాటలో కాదు' అని శ్రీహరి ఇచ్చిన సమీక్ష తనలో మార్పు తీసుకొచ్చిందన్నారు. సద్విమర్శలను స్వీకరించి, ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుసుకుని వాటిని సరిదిద్దుకుంటే విజయం వరిస్తుందనడానికి ఇవి ఉదాహరణలు.

'ఖైదీ'కి ముందు, తర్వాత
చిరంజీవి కెరీర్‌ని 'ఖైదీ'కి ముందు, తర్వాత అని ప్రస్తావించాల్సిందే. 1983లో వచ్చిన ఈ సినిమా సృష్టించిన సంచలనం అలాంటిది మరి! చిరంజీవికి మాస్‌ ఇమేజ్‌, స్టార్‌డమ్‌ని తెచ్చిపెట్టింది. తనదైన శైలి డ్యాన్స్‌, డైలాగ్స్‌తో అలరించే ఆయన పాలిటిక్స్‌లో వెళ్లి, నటనకు దూరమవడం అభిమానులు, ఆడియన్స్‌ను కాస్త బాధపెట్టింది. 'ఖైదీ నం. 150'తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ప్రేక్షకుల్లో మళ్లీ అదే హుషారు తీసుకొచ్చారు. వరుస సినిమాలు చేస్తూ యంగ్‌ హీరోలకు పోటీనిస్తున్నారు. ఇప్పటి వరకు 155 చిత్రాల్లో నటించిన చిరు 'నంది', 'ఫిల్మ్‌ఫేర్‌'వంటి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 'పద్మ భూషణ్‌' గా నిలిచారు. కాగా, గతేడాది కేంద్ర ప్రభుత్వం చిరును 'పద్మ విభూషణ్' అవార్డుతో సత్కరించింది. తమిళం, కన్నడ, హిందీలోనూ నటించిన చిరంజీవి హీరోగా ఓ హాలీవుడ్‌ మూవీ ఖరారైనా, అది కార్యరూపం దాల్చలేదు.

రెండు బిరుదులు
ఒకే హీరోకి రెండు బిరుదులు ఉండటం అరుదు. తొలినాళ్లలో 'సుప్రీమ్‌ హీరో'గా పేరొందిన చిరు ఆ తర్వాత 'మెగాస్టార్‌'గా విశేష క్రేజ్‌ సంపాదించుకున్నారు. 1988లో వచ్చిన 'మరణ మృదంగం'తో చిరంజీవి మెగాస్టార్‌గా మారారు. ఆ చిత్ర నిర్మాత కె.ఎస్‌. రామారావు చిరుకి ఆ బిరుదునిచ్చారు. అంతకు ముందు వరకు ఆయన నటించిన సినిమా టైటిల్స్‌లో కొన్నింటిలో చిరంజీవి అని, మరికొన్ని చిత్రాల్లో 'సుప్రీమ్‌ హీరో' అని కనిపిస్తుంది. చిరు 'సుప్రీమ్‌ హీరో'గా కనిపించిన చివరి చిత్రం 'ఖైదీ నంబరు. 786'. సుప్రీమ్‌ హీరో, మెగాస్టార్‌ ఈ రెండింటిపైనా పాటలు రావడం విశేషం.

46 ఏళ్ల ప్రస్థానంలో చిరు సాధించిన ఘనతల్లో కొన్ని

  • పర్సనల్‌ వెబ్‌సైట్‌ కలిగిన తొలి భారతీయ నటుడు. ఆయన గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటే https://www.kchiranjeevi.com/ ను సందర్శించవచ్చు.
  • ప్రతిష్ఠాత్మక 'ఆస్కార్‌' వేడుక (1987)లో అతిథిగా పాల్గొనే ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటుడు.
  • 1999- 2000 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా చిరంజీవి 'సమ్మాన్‌' అనే అవార్డు పొందారు. 2002లో అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి చిరుకి ఈ అవార్డుని అందించారు.
  • 'పసివాడి ప్రాణం' సినిమాతో బ్రేక్‌ డ్యాన్స్‌ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు.
  • 'బావగారు బాగున్నారా' చిత్రంలో బంగీజంప్‌ చేశారు. ఈ సినిమాలోని ఓ సన్నివేశం కోసం 240 అడుగుల ఎత్తునుంచి దూకారు.
  • ఏక పాత్రాభినయం, ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం చేసిన సినిమాలు 100 రోజులు ప్రదర్శితమైన రికార్డు ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో చిరంజీవికే దక్కింది.
  • అత్యధిక పారితోషికం (రూ.కోటికిపైగా) అందుకున్న తొలి భారతీయ నటుడిగా 1992లో వార్తల్లో నిలిచారు.
  • చిరంజీవి నటించిన 'ఘరానా మొగుడు' రూ. 10 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ సాధించిన తొలి తెలుగు చిత్రంగా, 'ఇంద్ర' రూ. 30 కోట్లకుపైగా గ్రాస్‌ వసూళ్లు చేసిన తొలి తెలుగు చిత్రంగా చరిత్ర సృష్టించాయి.
  • రష్యన్‌లోకి డబ్‌ అయిన తొలి తెలుగు చిత్రం చిరంజీవి నటించిన 'స్వయంకృషి'.
  • 1980, 1983 ఈ ఏడాదుల్లో చిరంజీవి నటించిన 14 చిత్రాలు విడుదలయ్యాయి.
  • 2023లో చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం రెండో అత్యుత్తమ పౌర పురస్కారం పద్మ విభూషణ్​తో సత్కరించింది.

'ఇంద్ర' షూటింగ్​లో మెగా ఫ్యామిలీ సందడి - యంగ్ చెర్రీని చూశారా? - Indra Re Release Behind The Scenes

ఆ ఒకే ఒక్క కలతో - శివ శంకర వరప్రసాద్ కాస్త​ చిరుగా ఛేంజ్! - Chiranjeevi Screen Name Story

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.