Allu Sirish Buddy Movie : టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ లీడ్ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'బడ్డీ'. యాక్షన్ థ్రిల్లర్‌గా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్‌తోనే సరిపెట్టుకుంది. అయితే ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆగస్టు 30 నుంచి ఈ చిత్రం అందుబాటులోకి రానున్నట్లు తాజాగా ఆ సంస్థ ప్రకటించింది. తెలుగుతో పాటు మలయాళం, తమిళం, కన్నడ భాషల్లోనూ ఇది స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ ప్రకటనలో ఉంది.
స్టోరీ ఏంటంటే :
ఆదిత్య (అల్లు శిరీష్) ఓ పైలెట్. తన డ్యూటీలో భాగంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌తో తరచూ మాట్లాడుతుంటాడు. అప్పుడే అక్కడ పని చేసే పల్లవి (గాయత్రీ భరద్వాజ్)తో అతడికి పరిచయం ఏర్పడుతుంది. వాళ్లిద్దరూ ఒకరినొకరు చుసుకోనప్పటికీ, ఆ మాటల పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. దీంతో తన మనసులోని మాటను చెప్పేందుకు వెయిట్ చేసే పల్లవికి ఊహించని షాక్ తగులుతుంది. ఓ రోజు ఆమె చేసిన చిన్న తప్పిదం కారణంగా ఆదిత్యను సస్పెండ్ చేస్తారు. తన వల్ల ఉద్యోగం పోయినందుకు గిల్టీగా ఫీల్ అయిన పల్లవి అతడ్ని నేరుగా కలిసి సారీ చెప్పాలనుకుంటుంది. ఇంతలోనే ఆమె కిడ్నాప్‌కు గురవుతుంది. అప్పుడు జరిగిన గొడవలో ఆమె కోమాలోకి వెళ్లగా, తన ఆత్మ ఓ టెడ్డీబేర్‌లోకి చేరుతుంది. అయితే ప్రాణంతో ఉండగానే పల్లవి ఆత్మ అలా బయటకెలా వచ్చింది? ఆమెను కిడ్నాప్ చేసిన ముఠాతో హాంకాంగ్‌లో ఉన్న డాక్టర్ అర్జున్ కుమార్ వర్మ (అజ్మల్)కూ ఉన్న సంబంధం ఏంటి? ఇంతకీ పల్లవిని ఆదిత్య ఎలా కాపాడాడు? అన్నదే మిగతా స్టోరీ.
OTTలో ఫ్రీగా చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ - ఆఫర్ రెండు రోజులు మాత్రమే
చిరు ఫ్యాన్స్‌తో పాటు ఓటీటీ ప్రియులకు వీకెండ్ ఆఫర్‌ను ఇచ్చింది సన్నెక్స్ట్. చిరు నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రాన్ని ఫ్రీగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు, మెంబర్షిప్ అవసరం లేదని వెల్లడించింది. అయితే ఈ ఆఫర్ మూడు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుందని చెప్పుకొచ్చింది. కేవలం ఆగస్ట్ 23, 24, 25 తేదీల్లో మాత్రమే అని తెలిపింది.
ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలా? - OTTలో ఈ 7 సినిమాలు బెస్ట్ ఆప్షన్ ! - Top Family Movies In OTT
OTTలోకి 'కల్కి' ట్రిమ్ వెర్షన్- 6 నిమిషాలు కట్- ఏ సీన్లు కత్తిరించారంటే? - Kalki 2898 AD OTT