Bramayugam Review: సినిమా: భ్రమయుగం; నటీనటులు: మమ్ముట్టి, అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్డా లిజ్, మణికందన్ ఆర్.ఆచారి; దర్శకత్వం: రాహుల్ సదాశివన్; సంగీతం: క్రిస్టో జేవియర్; ఛాయాగ్రహణం: షెహనాద్ జలాల్; రచన, నిర్మాతలు: చక్రవర్తి, రామచంద్ర, ఎస్.శశికాంత్; విడుదల తేదీ: 23-02-2024.
కొత్త కథలకు, ప్రయోగాత్మక సినిమాలకు మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి పెట్టింది పేరు. ఇప్పడు తాజాగా ఆయన 'భ్రమయుగం' అనే మరో ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బ్లాక్ అండ్ వైట్ షేడ్‌లో రూపొందిన ఈ మూవీలో మమ్ముట్టి డిఫరెంట్ పాత్రలో కనిపించారు. ఈ సినిమా ఇప్పటికే మలయాళంలో విడుదలై మంచి విజయం దక్కించుకోగా, తాజాగా తెలుగులో విడుదలైంది. మరి 'భ్రమయుగం' ఆడియెన్స్‌కు ఈ సినిమా ఎలాంటి అనుభూతి పంచింది? అసలు ఈ కథేంటి? మమ్ముట్టి నటన ఎలా ఉంది?
కథేంటంటే: అది 17వ శతాబ్దం మలబార్ తీరం. కులానికి చెందిన జానపద గాయకుడు దేవన్ (అర్జున్ అశోకన్) ఓ రాజు ఆస్థానంలో పాటలు పాడుతుంటాడు. ఓసారి దేవన్ ఆ రాజు నుంచి తప్పించుకొని, మిత్రుడితో కలిసి ఇంటి దగ్గరున్న తన తల్లిని కలుసుకునేందుకు కలిసి అటవీ మార్గంలో బయలుదేరుతాడు. ఈ క్రమంలోనే ఆ దట్టమైన అడవిలో అతడు తప్పిపోతాడు. అదే సమయంలో తన మిత్రుడ్ని యక్షి (అమల్డా లిజ్) తినేస్తుంది. ఒంటరివాడైన దేవన్ ఆ అడవిలో ఆహారం వెతుక్కుంటూ అటు ఇటు తిరిగి ఓ పెద్ద పాడుబడ్డ ఇంటిలోకి అడుగు పెడతాడు. అక్కడ యజమాని కొడుమన్ పొట్టి (మమ్ముట్టి), వంటవాడు (సిద్ధార్థ్ భరతన్) మాత్రమే ఉంటారు. చాలా కాలం తర్వాత తన ఇంటికి ఓ అతిథి వచ్చాడని చెప్పి దేవన్‌ను కొడుమన్ ఇంట్లోకి సాదరంగా ఆహ్వానిస్తాడు. ఆ ఇంట్లోకి ప్రవేశించాక దేవన్‌కు చిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. కొద్దిరోజుల్లోనే తను ఆ ఇంట్లో బందీ అయినట్లు తెలుసుకుంటాడు. దీంతో అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తాడు. మరి తప్పించుకున్నాడా? అసలు ఆ వంటవాడు ఆ ఇంట్లోఎందుకు ఉంటున్నాడు? అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి.
ఎలా సాగిందంటే: ఈ సినిమా బ్లాక్ అండ్ వైట్ జానర్లో డిఫరెంట్‌గా తెరకెక్కించారు.ఈ కథ ముఖ్యంగా మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంటుంది. కానీ, ప్రేక్షకుడికి ఏ ఒక్క ఫ్రేమ్‌లోనూ చూసిందే మళ్లీ చూస్తున్నామన్న ఫీలింగ్, కథ ఒకే దగ్గర తిరుగుతుందన్న భావన రాకుండా దర్శకుడు రాహుల్ సదాశివన్ తెరకెక్కించారు. దేవన్ అడవిలో దారితప్పిపోయి అటు ఇటు తిరుగుతున్న సన్నివేశంతో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది.
తనతో పాటు వచ్చిన మిత్రుడిని యక్షి తినేయడం, అది చూసి దేవన్ భయంతో అడవిలో పరుగెత్తడం, ఈ క్రమంలోనే పాడుబడ్డ కొడుమన్ ఇంట్లోకి అడుగు పెట్టడం ఇలా కథ చకచకా సాగిపోతుంది. కొడుమన్‌గా మమ్ముట్టి సీన్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇంటర్వెల్‌కు ముందు కథలో అసలు ట్విస్ట్ ఉంటుంది. అప్పుడే కొడుమన్‌లోని మరో రూపం ప్రేక్షకులకు తెలుస్తుంది. దాన్ని డైరెక్టర్ అద్భుతంగా చూపించారు. దీంతో సెకండ్ హాఫ్‌పై అంచనాలు పెరిగిపోతాయి. సెకండ్ హాఫ్‌లో హారర్ సీన్స్, ప్రేక్షకుల్ని మెప్పించాయి. క్లైమాక్స్ కూడా చాలా థ్రిల్లింగ్‌గా ఉంది.
బలాలు
- కథా నేపథ్యం..
- మమ్ముట్టి, అర్జున్ అశోకన్ నటన..
- విరామ, పతాక సన్నివేశాలు, సాంకేతిక విభాగాల పనితీరు
బలహీనతలు
- అక్కడక్కడా నెమ్మదిగా సాగే కథనం..
చివరిగా: 'భ్రమయుగం' థ్రిల్లింగ్‌గా ఉంది.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సినిమాలోనూ రాజధాని పేరు వింటే జగన్ ఉలిక్కిపడుతున్నారు: నారా లోకేశ్