ETV Bharat / entertainment

ఈ బాలీవుడ్​ ఖాన్ సినిమా కలెక్షన్లు రూ.25,000కోట్లు - షారుక్, సల్మాన్, ఆమిర్​ రికార్డులు బ్రేక్​! - Bollywoods Most Successful Khan

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 5, 2024, 8:24 PM IST

BOLLYWOODS MOST SUCCESSFUL KHAN : బాలీవుడ్ సూపర్ స్టార్లైన షారుక్​ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్​లకు మించి తన సినిమాలతో వేల కోట్ల కలెక్షన్లను అందుకున్నాడు ఆ నటుడు. ఇంతకీ ఆయన ఎవరంటే?

source Getty Images and ANI
Sharukh Salman Aamir (source Getty Images and ANI)

Bollywood Most SUCCESSFUL Irfhan Khan : బాలీవుడ్​లో ఖాన్ అనగానే గుర్తొచ్చేది షారుక్​, సల్మాన్, అమీర్. దాదాపు గత ముప్పై ఏళ్లుగా ఈ ముగ్గురు ఖాన్​లు బాలీవుడ్ బాక్సాఫీసు దగ్గర వసూళ్ల పంట పండిస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ చాలా మందికి తెలియన షయమేంటంటే బాలీవుడ్​లో సూపర్ స్టార్ కాకపోయినప్పటికీ ఓ విలక్షణ నటుడు ఈ ముగ్గురిని మించి తన సినిమాలతో వసూళ్లను సాధించాడు! ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఆయన కూడా ఖానే. భారతదేశంలోని అత్యుత్తమ నటులలో ఒకరైన ఆయన ప్రస్తుతం జీవించిలేరు.

Irfhan Khan Movies : అవును, మనం మాట్లాడుకుంటున్నది దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ గురించి. కమర్షియల్ హిట్లతో విమర్శకుల ప్రశంసలు పొందిన సక్సెస్ ఫుల్ స్టార్ ఈయన. తన అధ్బుతమైన నటనతో టాలీవుడ్​, బాలీవుడ్​తో పాటు హాలీవుడ్​లోనూ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారు. ఈ ఘనత సాధించిన అతికొద్ది మంది ఇండియన్ నటులలో ఇర్ఫాన్ ఒకరు. జురాసిక్ వరల్డ్, ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్, స్లమ్ డాగ్ మిలియనీర్, లైఫ్ ఆఫ్ పై వంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా విలక్షణ నటుడిగా పేరు పొందారాయన. ఈ సినిమాలన్నీ కలెక్షన్ల వర్షం కురిపించినవే. ఆయన నటించిన హాలీవుడ్​ సినిమాల కలెక్షన్లు 2.5 బిలియన్ డాలర్లు. అంటే దాదాపు రూ.22,350 కోట్లు అందుకున్నాయి.

అలానే ఈ హాలీవుడ్ సినిమాల కలెక్షన్లకు ఇర్ఫాన్ నటించిన ఇండియన్ ఫిల్మ్స్ కలెక్షన్లు కూడా కలిపితే ప్రపంచవ్యాప్తంగా రూ.25వేల కోట్లు వసూలు చేశాయట. ఇదే సమయంలో బాలీవుడ్ సూపర్ స్టార్స్ అయినప్పటికీ షారుక్​ ఖాన్ రూ.8500 కోట్లు, సల్మాన్ రూ.7000 కోట్లు, అమీర్ రూ.6500 కోట్లు వసూలు చేశారట. అంటే ఈ ముగ్గురి సినిమాల కలెక్షన్స్​ మొత్తం కలిపి రూ.22వేల కోట్లే. ఈ లెక్కన ఇర్ఫాన్ కన్నా తక్కువేనన్న మాట.

కాగా, ఇర్ఫాన్​ ఒక్కో సినిమాకు దాదాపు రూ.5 కోట్ల నుంచి రూ. 7కోట్ల వరకూ తీసుకునే వారట. సినిమాలతో పాటు కొన్ని యాడ్స్​లో కూడా ఆయన నటించారు. పలు వ్యాపారాల్లో కూడా ఈయన పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. అయితే ఇర్ఫాన్ అనారోగ్యంతో 53 ఏళ్ల వయస్సులోనే తుది శ్వాస విడిచారు. 2010 తర్వాత ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. క్యాన్సర్‌తో పోరాడి 2020వ సంవత్సరం ఏప్రిల్ నెలలో కనుమూశారు. ఈయనకు భార్య సుతాప సిక్కర్​తో పాటు బాబిల్ ఖాన్, అయాన్ ఖాన్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. త్వరలో బాలిల్ ఖాన్ సినిమాల్లోకి రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

'దేవ‌ర' సెకండ్ సాంగ్ వచ్చేసిందోచ్ - ఎన్టీఆర్​, జాన్వీ రొమాంటిక్ ట్రీట్ అదిరింది! - Devara Second Song
పుష్ప క్లైమాక్స్ షూటింగ్- రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ - Pushpa At RFC

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.