ETV Bharat / entertainment

200 గుర్రాలతో భారీ యాక్షన్ సీన్- వేరే లెవెల్​లో స్టార్ హీరో సినిమా! - 200 Horses Movie - 200 HORSES MOVIE

200 Horses Movie: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్- అహ్మద్ ఖాన్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ 'వెల్కమ్ టూ ద జంగిల్'. ఈ సినిమాలో ఓ యాక్షన్ సీన్ కోసం 200 గుర్రాలను ఉపయోగించనున్నారు.

200 Horses Movie
200 Horses Movie (Source: Getty Images (File Photo))
author img

By ETV Bharat Telugu Team

Published : May 23, 2024, 10:23 AM IST

200 Horses Movie: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కీలక పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'వెల్కమ్ టూ ద జంగిల్'. ఈ సినిమాను డైరెక్టర్ అహ్మద్ ఖాన్ భారీ తారాగణంతో తెరెక్కిస్తున్నారు. 'హీరో పంతి- 2', 'భాగీ- 2', 'భాగీ- 3' లాంటి యాక్షన్ సినిమాలను తెరకెక్కించిన అహ్మద్ ఈ సినిమాలోనూ భారీగానే ప్లాన్ చేశారట.

ఇప్పటికే తొలి షెడ్యూల్‌లో 500 మంది డ్యాన్సర్లతో గ్రాండ్​గా డ్యాన్స్ సీక్వెన్స్ షూటింగ్ కంప్లీట్ చేశారట. కాగా, మరో షెడ్యూల్‌లో భాగంగా భారీ యాక్షన్ సీక్వెల్ షూట్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇందులో ఓ యాక్షన్ సన్నివేశానికి గుర్రాలను వాడనున్నారట. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 200 గుర్రాలను ఆ సీన్​లో షూటింగ్​కు ఉపయోగించనున్నట్లు బీ టౌన్ వర్గాలు తెలిపాయి. ఈ సీన్ సినిమా మొత్తానికి హైలైట్​గా నిలుస్తుందని మేకర్స్ భావిస్తున్నాట్లు తెలుస్తోంది.

దీని కోసం ఇప్పటికే సినిమా యూనిట్ 200 గుర్రాలను అద్దెకు తీసుకుందట. ఇప్పటి వరకూ సినీ పరిశ్రమలో ఎన్నడూ చూడనంత యాక్షన్ సీక్వెన్స్​ను చూస్తారని డైరెక్టర్ ఓ సందర్భంలో చెప్పారు. ఏడు రోజుల్లోగా గుర్రాలపై సన్నివేశాలను పూర్తి చేస్తారు. ఇప్పటికే వీటన్నింటినీ ముంబయి, మహాబళేశ్వర్, లోనావియా లాంటి ప్రధాన నగరాల నుంచి ముంబయి ఫిల్మ్ సిటీకి తెప్పించారు. వీటితో పాటు వాటి ట్రైనర్లను కూడా రప్పించారు.

ఫుల్ ప్యాక్డ్​ యాక్షన్ సినిమాలో భాగంగా ముందుగా ఈ సినిమాలో సంజయ్‌దత్ నటిస్తున్నట్లు ప్రకటించారు. అక్షయ్ కుమార్ కూడా తమ ఫస్ట్ డే రోజు షూటింగ్ అప్పుడు సంజయ్ బాబాకి వెల్కమ్ మేమిద్దరం కలిసి పనిచేయబోతున్నామంటూ ఇన్‌స్టాలో పోస్టు పెట్టారు. 15 రోజుల షూటింగ్ తర్వాత డేట్స్ కుదరకపోవడంతో ఈ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకున్నారు. వాస్తవానికి సంజయ్ పాత్రకు ఉన్న ఇంపార్టెన్స్ తగ్గిపోవడంతో మధ్యలో డ్రాప్ అయినట్లు తెలుస్తోంది.

ఇతర ప్రధాన పాత్రల్లో సునీల్ శెట్టి, దిశా పటానీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, జానీ లివర్, తుషార్ కపూర్, కృష్ణా అభిషేక్, కీకు శర్దా, దాలేర్ మెహిందీ, మీకా సింగ్, పరేశ్ రావల్, అర్షద్ వార్సీ, లారా దత్తా, శ్రేయాస్ తల్పడే, రవీనా టాండన్ లు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాను 2024 డిసెంబర్ 20 కల్లా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

'కన్నప్ప' సినిమాలో బాలీవుడ్ హీరో - అక్షయ్ తెలుగు​ డెబ్యూ ఇదే! - Akshay Kumar Kannappa Movie

'నాటు నాటు' బీటౌన్ వెర్షన్​ - ఆ సాంగ్​కు హుక్​ స్టెప్​ వేసిన అక్షయ్​, టైగర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.