ETV Bharat / entertainment

భర్తను రచ్చకీడ్చి మళ్లీ కలిసిపోయిన ఆలియా - ఏం జరిగిందంటే? - Actor Nawazuddin Siddiqui Wife - ACTOR NAWAZUDDIN SIDDIQUI WIFE

గొడవపడి, కోర్టుకెక్కిన సినీ ఇండస్ట్రీలోని ఓ స్టార్ కపుల్ మళ్లీ కలిసిపోయినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 26, 2024, 1:45 PM IST

Actor Nawazuddin Siddiqui Wife : బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధికీ గురించి పరిచయం అవసరంలేదు. ఈ నటుడు తెలుగులో వెంకటేశ్ నటించిన సైంధవ్ మూవీలో విలన్​గా యాక్ట్ చేసి ఆకట్టుకున్నారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. కానీ నవాజుద్దీన్​కు నటనలో మార్కులు పడ్డాయి.

ఇక నవాజుద్దీన్ వ్యక్తిగత జీవితం గురించి చూస్తే ఆయన తన భార్య ఆలియాతో విడిపోయారన్న వార్తలు ఆ మధ్య చాలా వచ్చాయి. ఇద్దరు బహిరంగంగానే గొడవ పడేవారు. గొడవలతో తరచుగా వార్తల్లోకి ఎక్కేవారు. అలాగే తన భర్త తనను వేధిస్తున్నారని, ఆయన తల్లి ఇంట్లో నుంచి తన పిల్లలను తనని గెట్టేశారని ఆరోపిస్తూ ఆలియా అప్పట్లో కోర్టు మెట్లు కూడా ఎక్కింది. తన భర్తమీద పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు కూడా చేసింది. అంతేకాదు దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

దీంతో నవాజుద్దీన్ సిద్ధిఖీ పేరు ఆ మధ్య మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ వార్తలపై ఆయన కూడా స్పందించారు. ఆలియాతో తాను డివర్స్ తీసుకుని చాలా ఏళ్లు అయ్యిందని, పిల్లల భవిష్యత్​ కోసమే తామిద్దరం ఒక ఒప్పందానికి వచ్చామంటూ చెప్పుకొచ్చారు. తన పిల్లల జీవనం, చదువు కోసం ఆలియాకు చాలా డబ్బు ఇస్తున్నా కూడా ఆమె కావాలనే ఇలా ఆరోపణలు చేస్తోందంటూ వివరించారు.

ఈ పరిణామాల మధ్య సడెన్ ట్విస్టు ఇచ్చింది ఆలియా. తన భర్తతో విడిపోయిన ఆలియా మళ్లీ కలిసి ఉంటోందని తెలిసింది. తన 14వ వివాహ వార్షికోత్సవానికి సంబంధించిన ఓ వీడియోను ఆమె షేర్ చేసింది. తాజా సమాచారం ప్రకారం ఈ జంట కలిసి ఉంటోందని, ఆలియా తన పిల్లలతో తిరిగి తన భర్త నవాజుద్ధీన్ దగ్గరకు వెళ్లిపోయిందన్న వార్తలు బీటౌన్​లో వినిపిస్తుున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ బీటౌన్ హాట్ టాపిక్​​గా మారింది.

ఇకపోతే ముంబయిలో రీసెంట్​గా రూ. 50కోట్లతో ఓ బంగ్లా కొని హాట్​టాపిక్​గా నిలిచారు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

'కల్కి' బ్యూటీ దిశాపటానీ సిస్టర్​ను చూశారా? - ఆర్మీలో లెఫ్టినెంట్​ ఉద్యోగి - khushboo patani

రూ.300తో కెరీర్​ మొదలు - 400కుపైగా సినిమాలు - ఇప్పుడు ఎంత వసూలు చేస్తున్నారంటే? - Prakash Raj Birthday

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.