Bollywood Longest Movie: సాధారణంగా సినిమాలంటే రెండున్నర నుంచి 3 గంటల నిడివితో ఉంటాయి. మహా అనుకుంటే మరో అరగంట పెరుగుతుంది. ఇటీవలే విడుదలైన 'యానిమల్' మూవీ దాదాపు మూడున్నర గంటలు రన్టైమ్తో తెరకెక్కింది. ఇలా లాంగెస్ట్ రన్‌తో ఎన్నో సినిమాలు వెండితెరపై సందడి చేశాయి. అయితే ఇండియన్ సినిమా హిస్టరీలో ఓ సినిమా దాదాపు నాలుగు గంటలకు పైగా రన్ టైమ్‌తో విడుదలైంది. అదే బాలీవుడ్ మూవీ 'LOC కార్గిల్'. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఈ సినిమాలో 33 మంది హీరోలు, 12 మందికి పైగా హీరోయిన్లు నటించారు. మన టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కూడా ఈ చిత్రంలో కీ రోల్ ప్లే చేశారు.
2003లో జేపీ దత్తా అనే బీ టౌ డైరెక్టర్ దీన్ని రూపొందించారు. కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం సాధించిన విజయ గాథను చెప్పే సినిమాగా తీశారు. వార్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు ఇది 4 గంటల 15 నిమిషాల నిడివితో థియేటర్లలో రన్ అయ్యింది. ఈ నేపథ్యంలో భారతీయ సినీ చరిత్రలో రూపొందిన అతి పొడవైన హిందీ చిత్రంగానూ గుర్తింపు పొందింది. సంజయ్ దత్, అజయ్ దేవగన్, సైఫ్ అలీ ఖాన్, అభిషేక్ బచ్చన్, నాగార్జున, అక్షయ్ ఖన్నా, మనోజ్ బాజ్‌పేయి, అశుతోష్ రాణా, సుదేశ్ బెర్రీ, రాజ్ బబ్బర్, మోహ్నిష్ బెహ్ల్, అవతార్ గిల్ లాంటి హీరోలు కనిపించగా, రాణి ముఖర్జీ, కరీనా కపూర్, రవీనా టాండన్, ఈషా డియోల్ సహా 12 మందికి పైగా హీరోయిన్లు ఈ సినిమాలో నటించారు. అప్పట్లోనే సూమారు రూ.33 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారట. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ అందుకోలేకపోయింది. మంచి కలెక్షన్లను సాధించలేకపోయింది. భారీ తారాగణం, బడ్జెట్, స్టోరీ ఇలా అన్నీ ఉన్నప్పటికీ ఇది బాక్సాఫీస్ వద్ద నిరాశగానే మిగిలింది.
Longest Run Time Movie In Tollywood: మరోవైపు టాలీవుడ్లో ఇప్పటివరకు ఈ లిస్ట్‌లో 'దాన వీర సూర కర్ణ' టాప్ పొజిషన్లో ఉంది. ఇది సుమారు 4 గంటల 17 నిమిషాల నిడివితో తెరకెక్కింది. సీనియర్ ఎన్టీఆర్ త్రి పాత్రాభినయం చేసిన ఈ మూవీ టాలీవుడ్లోనే కాకుండా ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే లాంగెస్ట్ రన్టైన్ గల మూవీగా రికార్డుకెక్కింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">