Bigg Boss Season 8 Telugu Latest Updates: అతి త్వరలో సీజన్ 8 ప్రారంభం కానుండటంతో.. తెలుగునాట బిగ్‌బాస్ మేనియా ఊపందుకుంటోంది. ఈ షోకి సంబంధించి రోజుకో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే బిగ్బాస్ 8కి సంబంధించి టీజర్, ప్రోమో రిలీజ్ కాగా.. దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సీజన్‍లో "డబుల్ ధమాకా" ఉండబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఆ వివరాలు చూస్తే..
బుల్లితెరపై ఎంతో ఆదరణ పొందిన బిగ్‌బాస్‌కు.. వరల్డ్ వైడ్‌గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గుర్తింపు ఉన్న సెలబ్రిటీలను ఒకే ఇంట్లో పెట్టి వారితో మూడు నెలల పాటు ఎంటర్‌టైన్ చేయిస్తోంది ఈ షో. ఈ క్రమంలో ఇంట్లో జరిగే గొడవలు, వాదనలు, లవ్ ట్రాక్స్, గాసిప్స్.. ఇలా అన్ని ఎలిమెంట్లూ బుల్లితెర ఆడియన్స్‌కి ఫుల్ కిక్ ఇస్తున్నాయి.
బిగ్బాస్ 8 : ఈ సీజన్‍లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరో తెలుసా? - లిస్ట్ మామూలుగా లేదు!
ప్రోమో ఇలా.. బిగ్బాస్ సీజన్ 7 ఫైనల్ రోజు జరిగిన రచ్చ వల్ల.. ఈ షోపై చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యింది. దీంతో బిగ్బాస్ ఇక ఉండదని.. సీజన్ 7 మాత్రమే లాస్ట్ అంటూ ఎన్నో రూమర్స్ వచ్చాయి. అయితే.. వాటన్నింటిని పటాపంచలు చేస్తూ బిగ్‍బాస్ 8కి సంబంధించి టీజర్, ప్రోమో రిలీజ్ అయ్యాయి. ఇక ఈ ప్రోమో చూస్తే ఇందులో నాగార్జున, కమెడియన్ సత్య ఉన్నారు. సత్యను ఓ లగ్జరీ హౌస్‍లోకి నాగార్జున తీసుకెళ్లడంతో ఈ నయా ప్రోమో షురూ అయ్యింది. అయితే, తనకు ఏకాంతం కావాలని సత్య అంటే మరోసారి ఆలోచించుకోవాలని నాగార్జున చెబుతారు. ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదని అంటారు. తనకు ఫుల్ ప్రైవసీ కావాలని సత్య అంటారు. ఆ తర్వాత ఎడారిలో మాసిన దుస్తులతో సత్య కనిపిస్తారు. ఈ సారి సీజన్ 8లో ఎంటర్టైన్మెంట్కు, ఫన్‍కు, టర్న్‌లకు, ట్విస్టులకు లిమిటే లేదు అని నాగార్జున చెప్పే డైలాగ్‍తో ప్రోమో పూర్తవుతుంది. సత్యను ఒంటరిగా వేరే చోటికి పంపడం ఈ ప్రోమోలో ఉండటంతో బిగ్‍బాస్ 8వ సీజన్‍లో డిఫరెంట్ కాన్సెప్ట్ ఏమైనా ఉంటుందా అనే అంచనాలు మొదలయ్యాయి.
రెండు హౌజ్‌లు?: సాధారణంగా బిగ్బాస్ హౌజ్ అంటే.. ఒకటే ఇంట్లో సెలబ్రిటీలందరినీ పెట్టి వారితో గేమ్ ఆడిస్తుంటారు మేకర్స్. అయితే.. సీజన్ 8ని కొత్తగా చూపించే క్రమంలో.. ఈ సీజన్‍లో రెండు హౌజ్‌లు ఉంటాయనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అందులోనూ కొద్దిమంది సెలబ్రిటీలను రెండో హౌజ్‌లో ఉంచి.. షో చివర్లో వారిని మొదటి ఇంట్లోకి పంపిస్తారనే టాక్ నడుస్తోంది. అయితే, ఈ విషయంపై అధికారికంగా కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు.
స్టార్ట్ ఎప్పుడు : అయితే బిగ్‍బాస్ 8వ సీజన్ ఎప్పుడు మొదలుకానున్నది అనే విషయాన్ని టీజర్ లేదా ప్రోమోలో ఎక్కడ మేకర్స్ వెల్లడించలేదు. త్వరలోనే సీజన్ స్టార్ట్ అవుతుందని చెప్పారు కానీ.. ఎప్పుడో డేట్ చెప్పలేదు. అయితే, సెప్టెంబర్ 8వ తేదీన ఈ సీజన్ మొదలవుతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆదివారం జరుగుతున్న ఓ షో సెప్టెంబర్ 1న పూర్తి కానుండటంతో సెప్టెంబర్ 8వ తేదీ నుంచి స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
బిగ్బాస్ లోకి వేణు స్వామి - ఈ సారి ఊహకందని కంటెస్టెంట్స్ లిస్ట్!
బిగ్బాస్ బ్యూటీ "శోభా శెట్టి" లవర్ ఇతనా! "కార్తీక దీపం" సీరియల్ నుంచే ప్రేమాయణం!!