ETV Bharat / entertainment

బిగ్​బాస్​ 8: చివరి ఎలిమినేషన్​తో మారిన టాప్​ 5 లెక్కలు - ఫినాలేకు చేరుకుంది వీళ్లే!! - BIGG BOSS 8 TODAY ELIMINATION

-క్లైమాక్స్​కు వచ్చిన బిగ్​బాస్​ సీజన్​ 8 -డబుల్​ ఎలిమినేషన్​తో మారిన టాప్​ 5 లెక్కలు

Bigg Boss 8 Telugu Today Elimination
Bigg Boss 8 Telugu Today Elimination (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 8, 2024, 5:28 PM IST

Bigg Boss 8 Telugu Today Elimination: బిగ్​బాస్ సీజన్ 8లో ఫైనల్​కు​ ముందు జరగబోయే చివరి ఎలిమినేషన్‌కు సమయం వచ్చేసింది. గత సీజన్​ మాదిరే ఫైనల్స్‌కు టాప్ 6 కంటెస్టెంట్స్ వెళ్లి మిడ్​ వీక్ ఎలిమినేషన్​ ఉంటుందనుకుంటే.. అనూహ్యంగా 14వ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని.. ఫైనల్స్‌కు కేవలం ఐదుగురు మాత్రమే వెళ్తారని హోస్ట్​ నాగార్జున ప్రకటించారు. అలా డబుల్​ ఎలిమినేషన్​లో భాగంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌజ్​లోకి ఎంటర్ అయిన రోహిణి.. శనివారం రోజు(డిసెంబర్ 7న​) ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసింది. ఇక ఆదివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో మరొక ఎలిమినేషన్ జరగనుంది. మరి ఎలిమినేట్​​ అయ్యింది ఎవరు? టాప్​ 5కు చేరుకున్న కంటెస్టెంట్లు ఎవరో ఈ స్టోరీలో చూద్దాం..

ఈ వారం సండే ఎపిసోడ్​ను మరింత ఫన్​ డేగా మార్చారు హోస్ట్​ నాగార్జున. ఇప్పటికే ఈ ఎపిసోడ్​కు సంబంధించిన షూటింగ్​ పూర్తయింది. ఇక ఈ సండే ఎపిసోడ్​లో కంటెస్టెంట్లతో వివిధ రకాల గేమ్స్​ ఆడించారు. ముఖ్యంగా అవినాష్​పై పంచులు వేస్తూ తెగ ఎంజాయ్​ చేశారు హోస్ట్​ నాగార్జున. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోలు కూడా రిలీజ్​ చేశారు. ఇక ఎపిసోడ్​ మధ్యమధ్యలో నామినేషన్స్​లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్​ చేస్తూ టాప్​ 5 కంటెస్టెంట్స్​గా అనౌన్స్​ చేశారట.

ఎలిమినేట్​ అయ్యింది ఎవరంటే: ఇక చివరి టాప్​ 5 కంటెస్టెంట్ కోసం.. విష్ణుప్రియ, నబీల్ మధ్య ఎలిమినేషన్​ రౌండ్​ జరగనుంది. ఇది ప్రోమోలో కూడా క్లారిఫై అయ్యింది. ఇద్దరినీ కాసేపు టెన్షన్ పెట్టి విష్ణుప్రియను ఎలిమినేట్ చేయబోతున్నారని టాక్​. ఇప్పటికే ఈ విషయం సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. విష్ణుప్రియ ఎలిమినేట్​ అవడంతో నబీల్​ సేఫ్​ అయ్యి టాప్​ 5 కు చేరుకున్నట్లు తెలుస్తోంది.

విష్ణుప్రియ ఎలిమినేషన్​కు కారణమదేనా: నిజానికి విన్నర్​ మెటీరియల్​గా హౌజ్​లోకి అడుగుపెట్టింది విష్ణుప్రియ. ఎందుకంటే సీజన్​8 మొదట్లో హౌజ్​లోకి ఎంటర్​ అయిన కంటెస్టెంట్లలో విష్ణుప్రియ ఒక్కరే తెలిసి ఉండటంతో అందరూ ఆమెనే విన్నర్​ అవుతుందని భావించారు. కానీ ఆడియన్స్​ అనుకున్నట్లుగా విష్ణుప్రియ గేమ్స్​ ఆడట్లేదు సరికదా.. మరో కంటెస్టెంట్​ పృథ్వీ వెంట పడి కేవలం వీకెండ్​ ఎపిసోడ్స్​ మినహా 13వ వారం వరకూ కూడా పర్ఫామెన్స్​ చేయలేదు. దీంతో విష్ణుప్రియకు ఓట్లు రావడం కష్టమైంది. ప్రతిసారి నామినేషన్స్​కు వచ్చినా కేవలం పాయింట్ల తేడాతో సేవ్​ అవుతూ వచ్చింది. గత వారం చివర్లో సేవ్​ అయిన విష్ణుప్రియ.. ఈ వారం ఇంటి బాట పట్టింది. అలా సీజన్​ 8లో 14 వారం ఎలిమినేట్​ అయ్యింది.

టాప్​-5 ఎవరంటే: మొదటి నుంచి ఉన్న విష్ణుప్రియ 14వ వారంలో ఎలిమినేట్​ కావడంతో టాప్​ 5 లో అవినాష్​, నిఖిల్​, గౌతమ్​, ప్రేరణ, నబీల్​ ఉన్నారు. ఇక ఐదుగురిలో ఒకరు వచ్చే వారం జరిగే ఫైనల్స్​లో పోటిపడనున్నారు. ఈ గ్రాండ్​ ఫినాలే ఎపిసోడ్​ డిసెంబర్​ 15వ తేదీ ఆదివారం రాత్రి 7 గంటలకు మొదలు కానుంది.

బిగ్ బాస్ 8: అర్ధరాత్రి గంగవ్వకు గుండెపోటు - తీవ్రంగా భయపడ్డ కంటెస్టెంట్లు - అప్​డేట్​ ఇచ్చిన నిర్వాహకులు!

"తమ్ముడంటే జెలస్​ - త్వరలోనే స్ట్రెయిట్ తెలుగు సినిమా" - బిగ్​బాస్​లో హీరో సూర్య సందడి!

"పక్కనోళ్ల బాధ గురించి వాడికి అక్కర్లేదు" - "వాడికి అదే సమస్య" - నాగ మణికంఠ చెల్లెలు షాకింగ్​ కామెంట్స్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.