Bigg Boss 8 Telugu Third Week Elimination: బిగ్‌బాస్ సీజన్ 8 అప్పుడే మూడో వారానికి చేరుకుంది. మొదటి వారం బేబక్క, రెండో వారం శేఖర్ బాషా ఎలిమినేట్ కాగా.. మూడో వారం ఎలిమినేట్ కానున్న కంటెస్టెంట్ ఎవరు? అనేది క్యూరియాసిటీగా మారింది. మరి ఆ పర్సన్ ఎవరో ఈ స్టోరీలో చూద్దాం..
థర్డ్ వీక్ ఎలిమినేషన్లో ఈసారి ఊహించని ట్విస్ట్ చోటు చేసుకోబోతోందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఈ వీక్ నామినేషన్లలో ఎలిమినేషన్ కత్తి ఆ ఇద్దరి మీదే ఉందని అంటున్నారు. కేవలం ఒకరోజు మాత్రమే జరిగిన మూడో వారం నామినేషన్ల ప్రక్రియలో 8 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. కనీసం రెండు ఓట్లు వచ్చిన ఇంటి సభ్యులు నామినేట్ అయినట్లుగా ప్రకటించాడు బిగ్ బాస్. వారిలో నాగ మణికంఠ, సీత, ప్రేరణ, యష్మీ, విష్ణుప్రియ, నైనిక, పృథ్వీరాజ్, సెల్ఫ్నామినేట్ చేసుకున్న అభయ్ నవీన్‌తో కలిపి మొత్తం 8 మంది మూడో వారం నామినేషన్స్‌లో ఉన్నారు.
ఎవరు ఎలిమినేట్ కానున్నారు? : వీరిలో విష్ణుప్రియకు మొదటి రోజు నుంచే మంచి ఓటింగ్ వస్తూ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. అలాగే, ప్రతిసారీ ఎమోషనల్ అవుతున్నప్పటికీ ఆటపరంగా మంచి పోటీ ఇస్తున్న నాగ మణికంఠ రెండో స్థానంలో ఉన్నాడు. తర్వాత ప్రేరణ, సీత, యష్మీ సైతం మంచి ఓటింగ్ సేఫ్ సైడ్ నిలుచున్నారు. ఇక డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్స్ నైనిక, అభయ్ నవీన్, పృథ్వీరాజ్ మాత్రమే.
పృథ్వీ: అగ్రెషన్ తప్పితే.. ఇతరులు గురించి ఏమాత్రం ఆలోచించని పృథ్వీకి అతి తక్కువ ఓట్లు పడ్డాయి. కానీ, పృథ్వీ ఉంటే చాలా వరకు కంటెంట్ అవకాశం ఉండటంతో తనను బిగ్ బాస్ ఎలిమినేట్ చేసే అవకాశం లేదని సమాచారం. గత వారం కూడా తక్కువ ఓట్లు వచ్చినా పృథ్వీని సేవ్ చేశారని సమాచారం.
బిగ్‌బాస్ 8: వైల్డ్‌కార్డ్ ఎంట్రీ బ్యాచ్ సిద్ధం! - వచ్చేది వీళ్లేనటగా!
నైనిక: నిజానికి నైనిక స్ట్రాంగ్ కంటెస్టెంట్. కానీ గత వారం చీఫ్ పదవి పోయిన తర్వాత.. ఈ వీక్ టాస్క్‌లలో ఆమె పార్టిసిపేషన్ ఎక్కువగా ఉన్నట్టుగా కనిపించలేదు ఫుటేజ్‌లో. అంటే ఫుటేజ్‌లో తక్కువ స్పేస్ దొరికిందంటే వాళ్లు ఎలిమినేట్ కావడం పక్కా అంటున్నారు. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఈ వారం నైనిక షాకింగ్ ఎలిమినేషన్ జరుగుతుందని టాక్ నడుస్తోంది.
అభయ్: ఇక డేంజర్ జోన్లో ఉన్న మరో కంటెస్టెంట్ అభయ్ నవీన్. అతను ఏకంగా బిగ్‌బాస్‌నే తిట్టేశాడు. అంతేకాకుండా చీఫ్‌గా తన బాధ్యతలను సరిగ్గా నిర్వహించకుండా, మరోవైపు తన మాట తీరుతో తీవ్రమైన నెగెటివిటీని ఎదుర్కొంటున్నాడు. ఇక ఆడేందుకు స్కోప్ ఉన్న అభయ్ గివప్ ఇచ్చేశాడు. దానికి పనిష్‌మెంట్‌గా చీఫ్ పదవి నుంచి తొలగించాడు బిగ్ బాస్.
ప్రస్తుతానికి డేంజర్ జోన్లో ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఎక్కువగా అభయ్ పేరు వినిపిస్తున్నా.. ఊహించని ఎలిమినేషన్ జరుగుతుందని టాక్. మరి అది నైనికా? లేదంటే ఇంకొకరా? అనేది తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
బిగ్ బాస్ 8 : నాగమణికంఠ భార్య ఎవరో తెలిసిపోయిందిగా - పెళ్లి వీడియో వైరల్!
"బిగ్‌బాస్‌కి రావడమే నేను చేసిన.." - హౌజ్‌లో బరస్ట్ అయిన విష్ణుప్రియ - ఏం జరిగిందో తెలుసా?
బిగ్‌బాస్ 8: శేఖర్ బాషా ఎలిమినేషన్‌కు అసలు కారణం ఇది! - రెమ్యునరేషన్ వివరాలు కూడా లీక్