ETV Bharat / entertainment

ఫస్ట్ వైల్డ్​ కార్డ్​ ఎంట్రీ ఇతనిదే - ఫొటో రిలీజ్​ చేసిన బిగ్​బాస్ - ఎవరో గుర్తుపట్టగలరా? - First Wild Card Contestant in BB 8 - FIRST WILD CARD CONTESTANT IN BB 8

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8లోకి వచ్చే వైల్డ్​ కార్డ్​ ఎంట్రీస్​ గురించే ప్రస్తుతం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంట్లోకి అడుగుపెట్టబోతున్న ఫస్ట్ కంటెస్టెంట్ ఫొటోను బిగ్ బాస్ రివీల్ చేశారు. మరి.. ఆ వ్యక్తి ఎవరో మీరు గుర్తుపట్టగలరా?

Bigg Boss 8 Telugu
Bigg Boss 8 Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2024, 3:50 PM IST

Bigg Boss 8 Telugu First Wild Card Contestant: బిగ్ బాస్ సీజన్ 8లో వైల్డ్​ కార్డ్స్​ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్​ అయ్యింది. ఇటీవలె బిగ్ బాస్ 12 మంది వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ హౌజ్​లోకి అడుగు పెట్టబోతున్నారు అని చెప్పారు. కానీ.. ఆ 12 మందిలో ఎంతమందిని హౌజ్​లోకి రానిస్తారు అనేది మాత్రం ప్రస్తుతం హౌజ్​లో ఉన్న కంటెస్టెంట్స్ చేతుల్లోనే ఉంటుందని బాంబు పేల్చారు. తాజాగా రిలీజ్​ అయిన ప్రోమోలో మొత్తంగా 8 మంది తుపాను లాగా ఇంట్లోకి రాబోతున్నారంటూ చెప్పేశాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ​అడుగు పెట్టబోతున్న ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి హింట్ ఇచ్చి సోషల్ మీడియాలో రిలీజ్​ చేశారు బిగ్ బాస్. మరి ఆ కంటెస్టెంట్ ఎవరో గెస్​ చేస్తారా?

ప్రస్తుతం సీజన్​ 8లో వైల్డ్​ కార్డ్​ ఎంట్రీస్​ గురించి పెద్ద చర్చే జరుగుతోంది. గత సీజన్లలో పాల్గొన్న మాజీ కంటెస్టెంట్స్​.. వైల్డ్​ కార్డ్​ ద్వారా ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారన్న వార్త ఇప్పటికే చక్కర్లు కొడుతోంది. అలాగే చాలా మంది మాజీ కంటెస్టెంట్స్ పేర్లు తెరపైకి రాగా, సీజన్ 8 ఫస్ట్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఎవరో చెప్పుకోండి చూద్దాం అంటూ ఫేస్ రివీల్ చేయకుండా అతని నీడను మాత్రమే బయట పెట్టారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఇక బిగ్​బాస్ ఇచ్చిన ఈ హింట్​ను చూస్తే ఆ కంటెస్టెంట్ ఎవరో ఇట్టే చెప్పేయొచ్చు. అతను మరెవరో కాదు "టేస్టీ తేజ".

గత సీజన్లో కమెడియన్​గా హౌజ్​లోకి వెళ్లిన టేస్టీ తేజాకి అదృష్టంతో పాటు అభిమానులు కూడా పెరగడంతో ఏకంగా తొమ్మిది వారాలు ఉన్నాడు. ఇక టేస్టీ తేజ వైల్డ్​ కార్డ్​ ద్వారా హౌజ్​లోకి అడుగుపెడితే ఎంటర్టైన్మెంట్ పరంగా బిగ్ బాస్ ప్రియులకు ఎలాంటి ఢోకా ఉండదని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం హౌజ్​లో ఉన్న కంటెస్టెంట్స్​ను తట్టుకొని నిలబడితే టేస్టీ తేజ మరో నాలుగు ఐదు వారాలు హౌజ్​లో ఉండొచ్చని అంటున్నారు. కానీ టాప్ ఫైవ్​లోకి వెళ్తాడా అనే సందేహాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ఆయనకి నారదుడు, ఐరన్ లెగ్ అనే రెండు బిరుదులు ఉన్నాయి.

నారదుడు ఎందుకు: బిగ్ బాస్ సీజన్ 7 లో టేస్టీ తేజాకి ఐరన్ లెగ్ అనే ట్యాగ్ పడింది. ఎందుకంటే ఏకంగా ఎనిమిది మంది కంటెస్టెంట్స్​లో ఆరుగురు తేజ వల్లే ఎలిమినేట్ అయ్యారు అప్పట్లో. అంటే ఇతను ఎవరిని నామినేట్ చేస్తే వాళ్లు ఎలిమినేట్ అయిపోతారు అనే పేరు వచ్చింది. ముఖ్యంగా సందీప్ మాస్టర్, నైని పావని, పూజ మూర్తి, శుభశ్రీ, రతిక, దామిని వీళ్లంతా అతను నామినేట్ చేయడం వల్ల ఎలిమినేట్ అయిన వాళ్లే. ఇక నారదుడు అని ఎందుకు అంటే.. అక్కడిది ఇక్కడ.. ఇక్కడిది అక్కడ చెప్పే వ్యక్తి అనే ఉద్దేశంతో నారదుడు అనే పేరు వచ్చింది.

బిగ్​బాస్​ భారీ షాక్ - మిడ్​ వీక్​ ఎలిమినేషన్​తో ఊహించని దెబ్బ - ఆ ఇద్దరిలో ఇంటికి వెళ్లేదెవరో?

బిగ్​బాస్​ 8: "రీలోడ్​ ఈవెంట్​" - వైల్డ్​ కార్డ్​ ఎంట్రీస్​పై హింట్​ ఇచ్చిన నాగార్జున - ఎవరొస్తున్నారో తెలిసిపోయిందిగా!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.