Bigg Boss 8 Telugu First Week Nominations: బిగ్‌బాస్ లాంఛింగ్ ఎపిసోడ్ కంటే.. కిక్ ఇచ్చే ఎపిసోడ్ అంటే సోమవారం నాటి నామినేషన్స్ ఎపిసోడే. అయితే గత అన్ని సీజన్లలో ప్రతి సోమవారం హౌజ్‌లో నామినేషన్స్ జరిగాయి. కానీ ఈ సీజన్ 8లో మంగళవారం నాడు నామినేషన్స్ ప్రక్రియను చేపట్టారు. దీనికి సంబంధించిన ప్రోమోలు కూడా రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ వీక్ నామినేషన్స్‌లోనే కంటెస్టెంట్స్ మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్లో జరిగింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
సీజన్ 8లో ఫస్ట్ వీక్ నామినేషన్స్ హీట్ ఊపందుకుంది. హౌజ్‌లోకి అడుగుపెట్టిన 14 మంది కంటెస్టెంట్స్ మధ్య తొలివారం నామినేషన్స్ మొదలయ్యాయి. సాధారణంగా బిగ్‌బాస్ హౌజ్‌లో ఫస్ట్ వీక్ నామినేషన్స్ అంటే కాస్త సిల్లీగానే ఉంటాయి. ఎందుకంటే వీళ్లు చెప్పే కారణాలు అలా ఉంటాయి. ఐ కాంటాక్ట్ ఇవ్వలేదని.. హాయ్ చెప్పలేదని.. నలుగురితో కలవడం లేదని.. ఇలా కారణాలు చెప్పి నామినేషన్స్ వేస్తుంటారు. తొలివారం నామినేషన్స్‌లో కూడా చాలా వరకూ ఇవే కనిపించాయి. ఇక ప్రోమో చూస్తే..
బిగ్‌బాస్ హౌస్‌కి చీఫ్‌గా ఎన్నికైన ముగ్గురు నిఖిల్, నైనిక, యష్మీ గౌడ.. ఇమ్యూనిటీ పొంది నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు. ప్రోమో స్టార్టింగ్‌లో హౌజ్‌లో చీఫ్లుగా సెలెక్ట్ అయిన నిఖిల్, నైనిక, యష్మీ గౌడలను అభినందించిన బిగ్‌బాస్.. మెడలో హారాలను ధరించి వారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కుర్చీలలో కూర్చోమని చెప్పారు. ఆ తర్వాత నామినేషన్స్ ప్రక్రియ మొదలు కానున్నట్లు ప్రకటించారు.
సోనియా Vs బేబక్క: ముందుగా సోనియా ఆకుల.. బెజవాడ బేబక్క, ప్రేరణలు ఫొటోలు సెలెక్ట్ చేసింది. ఇక బేబక్కపై సోనియా బాగానే విరుచుకుపడింది. ఫుడ్‌కు సంబంధించిన విషయంలో ఈ ఇద్దరి మధ్య హీటెడ్ డిస్కషన్ జరిగినట్లు ప్రోమో చూపించారు.
నాగమణికంఠ వర్సెస్ శేఖర్ బాషా: ఈ ఇద్దరి మధ్య కూడా హీటెడ్ డిస్కషన్ జరిగింది. "కట్టేసినా కుక్క లాగా భౌ భౌ మనడం నా నేచర్ కాదు" అంటూ నాగమణికంఠ గట్టిగానే ఇచ్చిపడేశాడు. దీనికి శేఖర్ బాషా" యూ ఆర్ నాట్ బిగ్‌బాస్, యూ ఆర్ నాట్ జడ్జ్" అని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య వాదనలు గట్టిగానే జరిగినట్లు ప్రోమోలో చూపించారు.
సోనియా VS ప్రేరణ: సోనియా, ప్రేరణ మధ్య కూడా మాటల యుద్ధం జరిగింది. "నువ్వు ఎవరు చెప్పడానికి" అంటూ సోనియాపై ప్రేరణ విరుచుకుపడింది. ఈ ఇద్దరి మధ్య కూడా వార్ గట్టిగానే జరిగినట్లు ప్రోమోలో క్లియర్‌గా కనిపించింది.
బిగ్‌బాస్ 8: తొలిరోజే మొదలైన రచ్చ - సోనియా వర్సెస్ శేఖర్ బాషా! ప్రోమో చూసేయండి!
అయితే ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే.. ప్రతి సీజన్లో మామూలుగా ఒక కంటెస్టెంట్.. ఇద్దరిని నామినేట్ చేయాలి. ఇక్కడ కూడా అదే రూల్. అయితే ఈ సీజన్ ఫస్ట్ వీక్ నామినేషన్స్‌లో ప్రతి కంటెస్టెంట్.. ఇద్దరిని నామినేట్ చేసినా అందులో ఒకరిని ఫైనల్ చేసేది మాత్రం అక్కడ కూర్చున్న ముగ్గురు చీఫ్లని అర్థమైపోయింది. ఎందుకంటే ప్రోమోలో చూపించిన విధంగా.. ఒక బజర్ మోగగానే ముగ్గురు చీఫ్‌లు పరిగెత్తుకుంటూ వచ్చి మధ్యలో ఉన్న కత్తిని తీసుకోవాలి. ఆ కత్తిని ఎవరైతే తీసుకుంటారో వారు.. నామినేట్ చేసిన ఇద్దరి కంటెస్టెంట్స్‌లో ఎవరో ఒకరి ఫొటో మీద కత్తి దింపాలి. ప్రోమోలో చూపించిన దాని ప్రకారం.. సోనియా.. బేబక్క, ప్రేరణను నామినేట్ చేయగా.. కత్తి సంపాదించిన యష్మీ.. బేబక్క ఫొటోపై కత్తి దింపినట్లుగా చూపించారు. సో ఫస్ట్ వీక్ నామినేషన్స్‌లో ఫస్ట్ ఓట్ బేబక్కకు పడినట్లు క్లియర్‌గా కనిపిస్తుంది.
ఇక సెకండ్ ప్రోమో సైతం రిలీజ్ చేశారు. అందులో కూడా నామినేషన్స్‌కి సంబంధించి కంటెస్టెంట్స్ మధ్య గట్టిగానే గొడవ జరిగింది. నిఖిల్ వర్సెస్ కిర్రాక్ సీత, శేఖర్ బాషా వర్సెస్ నాగమణికంఠ మధ్య మాటల యుద్ధం జరిగింది. మరి ఈ వారం బయటికి వెళ్లేందుకు నామినేట్ అయినవారు ఎవరో తెలియాలంటే ఎపిసోడ్ పూర్తిగా చూడాల్సిందే..!
బిగ్ బాస్ 8లో "డబుల్ ధమాకా" - ఇప్పటి వరకూ చూడని సరికొత్త ఎలిమెంట్ చూపిస్తారట!
Bigg Boss Show : 3 రోజులు రూ.2 కోట్లు.. హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ తెలుసా?