ETV Bharat / entertainment

బిగ్​బాస్​ 8 గ్రాండ్​ ఓపెనింగ్ - డేట్​ అనౌన్స్ చేసేశారుగా! - ఎప్పుడో తెలుసా? - Bigg Boss 8 Starting Date - BIGG BOSS 8 STARTING DATE

Bigg Boss 8 Starting Date : బిగ్​బాస్​ సీజన్​ 8 కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తోన్నారు. ఇప్పటికే ఈ సీజన్​కు సంబంధించిన టీజర్​, ప్రోమో కూడా రిలీజ్​ కావడంతో.. కంటెస్టెంట్స్​ ఎవరు? ఎప్పుడు స్టార్ట్​ అవుతుంది? అంటూ తెగ డిస్కస్​ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. అందరి ఎదురుచూపులకు తెరదించుతూ.. ఈ షో ఎప్పుడు స్టార్ట్​ కాబోతోందో అనౌన్స్ చేసేశారు నిర్వాహకులు!

Bigg Boss 8 Opening Date
Bigg Boss 8 Starting Date (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Aug 21, 2024, 2:45 PM IST

Bigg Boss 8 Starting Date : బిగ్​బాస్​.. ఈ పేరు వింటేనే చాలా మందికి ఎక్కడలేని హుషారు వస్తుంది. కారణం.. అద్భుతమైన టాస్క్​లు.. ఆసక్తి రేకెత్తించే కంటెస్టెంట్ల మధ్య గొడవలు, ఎలిమినేషన్లు.. ఇలా ఒక్కటేమిటి 100 రోజులకు పైగా మస్తు ఎంటర్​టైన్​మెంట్​ లభిస్తుంది. అందుకే ఈ షో ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురుచూస్తుంటారు. తాజాగా.. సీజన్​ 8కి సంబంధించిన అఫీషియల్​ టీజర్​, ప్రోమో రిలీజ్​ కావడంతో.. అసలు షో ఎప్పుడు స్టార్ట్​ అవుతుందాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఓపెనింగ్​ డేట్​ అనౌన్స్ అయ్యింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

మొదటి ప్రోమో ఇలా.. బిగ్​బాస్​ సీజన్​ 7 ఫైనల్​ రోజు జరిగిన రచ్చతో.. ఇకమీదట ఈ షో ఉండదనే రూమర్స్ ఎన్నో వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ బిగ్‍బాస్ 8కి సంబంధించిన అఫీషియల్​ టీజర్​, ప్రోమో రిలీజ్​ అయ్యాయి. ఇక ఈ ప్రోమోలో నాగార్జున, కమెడియన్ సత్య సందడి చేశారు. ఒక్కసారి కమిట్​ అయితే లిమిటే లేదు అంటూ.. షోపై మరింత ఆసక్తిని పెంచేశారు. సత్యను ఒంటరిగా ఎడారిలోకి పంపడంతో.. బిగ్‍బాస్ 8వ సీజన్‍లో డిఫరెంట్ కాన్సెప్ట్ ఏమైనా ఉంటుందా అనే అంచనాలు మొదలయ్యాయి.

బిగ్​బాస్​ 8 : ఈ సీజన్​లో పాల్గొనే కంటెస్టెంట్స్​ ఎవరో తెలుసా? - లిస్ట్​ మామూలుగా లేదు! -

రెండు హౌజ్​లు?: సాధారణంగా బిగ్​బాస్​ హౌజ్​ అంటే.. ఒకటే ఇంట్లో సెలబ్రిటీలందరినీ పెట్టి వారితో గేమ్​ ఆడిస్తుంటారు మేకర్స్​. అయితే.. సీజన్​ 8ని కొత్తగా చూపించే క్రమంలో.. ఈ సీజన్​లో రెండు హౌజ్​లు ఉంటాయనే వార్తలు వైరల్​ అవుతున్నాయి. అందులోనూ కొద్దిమంది సెలబ్రిటీలను రెండో హౌజ్​లో ఉంచి.. షో చివర్లో వారిని మొదటి ఇంట్లోకి పంపిస్తారనే టాక్​ నడుస్తోంది. అయితే, ఈ విషయంపై అధికారికంగా కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు.

షో అప్పుడే మొదలు: బిగ్ బాస్ 4వ సీజన్ నుంచి సెప్టెంబర్ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. తెలుగులో మొట్టమొదటి సీజన్ 1 జులై 16 ప్రారంభం కాగా.. రెండో సీజన్ జూన్ 10 ప్రారంభమైంది. ఇక మూడో సీజన్ జులై 21న ప్రారంభ అయ్యింది. సీజన్ 4 నుంచి సెప్టెంబర్ సెంటిమెంట్‌ బాగా వర్కౌట్ అయ్యింది. నాలుగో సీజన్ నుంచి ఏడో సీజన్ వరకూ సెప్టెంబర్‌లోనే బిగ్ బాస్ ప్రారంభమయ్యింది. తాజాగా ఇదే సెంటిమెంట్​ను ఫాలో అవుతూ ఎనిమిదో సీజన్​ను సెప్టెంబర్​లోనే మొదలుపెట్టనున్నారు. ఇందుకు సంబంధించిన అఫీషియల్​ ప్రోమో కూడా రిలీజ్​ అయ్యింది. ఆ ప్రోమోలో సెప్టెంబర్ 1వ తేదీ రాత్రి 7 గంటలకు బిగ్​బాస్​ 8 గ్రాండ్​ లాంఛ్​ జరగనున్నట్టు అనౌన్స్ చేశారు.

బిగ్​ బాస్​ 8లో "డబుల్ ధమాకా" - ఇప్పటి వరకూ చూడని సరికొత్త ఎలిమెంట్​ చూపిస్తారట!

వైరల్​ అవుతున్న కంటెస్టెంట్ల పేర్లు ఇవే: బిగ్​బాస్​ సీజన్​ 8 ఎప్పుడు స్టార్ట్​ అవుతుందో తెలియడంతో హోజ్​లోకి అడుగుపెట్టేది వీళ్లే అంటూ సోషల్ మీడియాలో కొద్దిమంది పేర్లు వైరల్ అవుతున్నాయి. అందులో హీరో రాజ్​ తరుణ్​, సద్దాం, తేజస్వనీ గౌడ, రీతూ చౌదరి, సనా, విష్ణుప్రియ, నిఖిల్, యూట్యూబర్ బంచిక్ బబ్లూ, కమెడియన్ యాదమ రాజు, కిర్రాక్ ఆర్పీ, ఆలీ తమ్ముడు ఖయ్యూం, బర్రెలక్క, కుమారి ఆంటీ, యాంకర్ వింద్య, అమృత ప్రణయ్, యూట్యూబర్ సోనియా సింగ్​, జ్యోతిష్యుడు వేణు స్వామి సహా పలువురు బిగ్​బాస్​ హోజ్​లోకి వెళ్లబోతున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఇది నిజమో కాదో తెలియాలంటే సెప్టెంబర్​ 1 రాత్రి 7 గంటల వరకు వెయిట్​ చేయాల్సిందే.

వైరల్ న్యూస్ : బిగ్​బాస్​ 8లోకి టాలీవుడ్ హీరో - ఈ సీజన్​లో మస్తు షేడ్స్​ ఉన్నట్టున్నయ్​గా! - Bigg Boss Telugu 8

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.