ETV Bharat / entertainment

"నీ వైఫ్​ రావాల్సింది నువ్వు ఎందుకు వచ్చావ్​" - నామినేషన్లలో అవినాష్​ వర్సెస్​ పృథ్వీ! - BB8 SEVENTH WEEK NOMINATIONS

-గౌతమ్​, నబీల్​ మాటల యుద్ధం -ఏడ్చిన యష్మీ, ప్రేరణ -హోరాహోరీగా ఏడోవారం నామినేషన్లు

Bigg Boss 8 Updates
Bigg Boss 8 Seventh Week Nominations Updates (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 15, 2024, 5:10 PM IST

Bigg Boss 8 Seventh Week Nominations Updates: బిగ్‌బాస్ సీజన్​ 8లో ఏడో వారం నామినేషన్స్ రసవత్తరంగా సాగుతోన్నాయి. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీల(రాయల్​ క్లాన్​) రాకతో అటు ఆటలో, ఎంటర్​టైన్​మెంట్​లో​ మాత్రమే కాదు నామినేషన్స్‌లోనూ ఓ ఊపు వచ్చింది. గత వారం కూడా వాళ్లు ఉన్నప్పటికీ వాళ్లని నామినేట్ చేసే అవకాశం ఓజీ క్లాన్‌ సభ్యులకు రాలేదు. కానీ ఈ వారం నామినేషన్స్‌లో ఎవరు ఎవరినైనా నామినేట్ చేసే అవకాశం ఉందని బిగ్​బాస్​ చెప్పడంతో నామినేషన్లు హాట్​హాట్​గా సాగిపోతున్నాయి. ఇక తాజాగా రిలీజ్​ అయిన ప్రోమోలో మరోసారి ప్రేరణను హ్యాట్ పట్టుకోకుండా పృథ్వీ అండ్ కో ఆపేశారు. కానీ ఈసారి ప్రేరణకి సపోర్ట్‌గా యష్మీ వచ్చింది.

ఇక ప్రోమో చూస్తే.." రేయ్ ఆ పుషింగ్ అది ఎందుకురా అసలు".. అంటూ ప్రేరణతో హరితేజ అంది. దీంతో అటు నయనిని ఓ సారి చూడు అంటూ ప్రేరణ చెప్పింది. అయితే నయని మాత్రం హ్యాట్​ చూట్టూనే తిరుగుతోంది. ఇంతలో గుర్రం సౌండ్ రాగానే నయని ఆ హ్యాట్ పట్టుకొని ప్రేరణకి దొరక్కుండా తిరిగింది. దీనికి విష్ణుప్రియ కూడా హెల్ప్ చేసింది. మరోవైపు ప్రేరణకి హ్యాట్ దక్కకుండా పృథ్వీ ఆపాడు. దీంతో తన ఫ్రెండ్ కోసం హరితేజను ఆపింది యష్మీ. ఈ తోపులాటలో యష్మీ కింద పడిపోయింది. హ్యాట్ మళ్లీ హరితేజకే దక్కింది. "నాకు చాలా కోపం వస్తుందిరా" అంటూ యష్మీ కన్నీళ్లు పెట్టుకుంది. అందుకే ఇది వద్దని చెప్పింది అంటూ హరితేజ అంటే "నాకు ఏమైనా ఫర్లేదు.. నా కాలు విరిగిపోయినా ఫర్లేదు.. నేను న్యాయం వైపే ఉంటా" అంటూ యష్మీ అనింది.

నబీల్ Vs గౌతమ్: ఇక తర్వాత టేస్టీ తేజను నామినేట్ చేశాడు నబీల్. "ఇల్లు ఎలా ఉంది అని అడిగితే.. ఇది మా సీజన్‌లా లేదు కిరాయికి వచ్చినట్లుంది అని తేజ నాతో అన్నాడు.. నాకు అది నచ్చలేదు.. అందుకే నామినేట్​ చేస్తున్నా" అంటూ నబీల్ చెప్పాడు. ఆ తర్వాత మూడోసారి అవకాశం వచ్చినప్పుడు కూడా తేజనే నామినేట్ చేశాడు నిఖిల్. ఇక గౌతమ్.. నబీల్‌ను నామినేట్ చేశాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య హీటింగ్ డిస్కషన్ జరిగింది. "నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు నాకు అనిపిస్తుంది.. నువ్వు అలానే ఆడుతున్నావ్" అంటూ నబీల్ అన్నాడు. దీంతో కొద్దిసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

మరోవైపు యష్మీని నామినేట్ చేశాడు టేస్టీ తేజ. "ఫ్రెండ్స్‌ను తీసుకొచ్చి నామినేషన్స్‌లో వేయడం నాకు నచ్చలేదు" అంటూ తేజ అన్నాడు. దీంతో "ప్రేరణ నాకు 10 ఇయర్స్‌గా ఫ్రెండ్ కాదు. ఇక్కడికొచ్చాక ఫ్రెండ్.. అయినా నా ఇష్టం నేను ఎవరితో ఫ్రెండ్ షిప్ చేయాలి.. ఎలా గేమ్ ఆడాలి అనేది నా ఇష్టం.. ఇది నా గేమ్" అంటూ తేజపై రెచ్చిపోయింది యష్మీ.

బిగ్ బాస్ 8 : నాగమణికంఠ భార్య ఎవరో తెలిసిపోయిందిగా - పెళ్లి వీడియో వైరల్!

మరో ప్రోమో: ఇక నామినేషన్స్​కు సంబంధించి రెండో ప్రోమో కూడా వచ్చేసింది. ఇందులో కొద్దిసేపు యష్మీ, ప్రేరణ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత గుర్రం సౌండ్​ వచ్చినప్పుడు హ్యాట్​ను యష్మీ తీసుకుని ప్రేరణకు ఇచ్చింది. ఇక నిఖిల్​ అండ్​ విష్ణుప్రియ నామినేట్​ చేయడానికి నిలబడగా.. విష్ణుప్రియ రివెంజ్​ నామినేషన్​ వేస్తున్నట్లు చెప్పింది. దీంతో బిగ్​బాస్​ కలుగజేసుకుని "రివెంజ్​ నామినేషన్​ అనేది సరైన కారణం కాదు" అంటూ చెప్పారు. ఇక టేస్టీ తేజ కూడా "ఇక్కడ నామినేషన్లు ఓజీ వర్సెస్​ తేజ అన్నట్లు నడుస్తున్నాయి" అని చెప్పాడు.

అవినాష్​Vs పృథ్వీ: ఇక నామినేషన్ల విషయంలో అవినాష్​ , పృథ్వీ మధ్య హీటెడ్​ డిస్కషన్​ జరిగింది. "నువ్వు ఓన్లీ ప్రోమోలు చూసి కేవలం రెండు టాస్కుల్లోనే కనపడ్డావు అని చెప్పి నామినేట్​ చేయడం నాకు నచ్చలేదు" అని పృథ్వీ చెప్పాడు. దీంతో అవినాష్​"నేను చూసిన రెండు ఎపిసోడ్లలో రెండు, మూడు టాస్కులల్లో తప్పించి నాకు ఎక్కడా కనపడలేదు, మా వైఫ్​ రెగ్యులర్​గా చూసింది" అని అన్నాడు. దీంతో "మీ వైఫ్​ చూసినప్పుడు మీ వైఫ్​ రావాల్సింది బిగ్​బాస్​కు మీరు ఎందుకు వచ్చారు" అని పృథ్వీ అనగా.. వైఫ్​ పేరు తీసుకురావద్దు అంటూ అవినాష్​ సీరియస్​ అయ్యాడు.

"పోయిన వారం నేను ఏ పాయింట్​ చెప్పానో, ఈ వారం గంగవ్వ కూడా అదే చెప్పంది" అని అవినాష్​ అంటే "గంగవ్వది ఎందుకు చెబుతావురా" అంటూ పృథ్వీ అన్నాడు. దీంతో రా అనొద్దు అంటూ అవినాష్​ సీరియస్​ అయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. అయితే నిన్నటి ఎపిసోడ్​లో అంటే సోమవారం రోజు జరిగిన నామినేషన్లలో గౌతమ్​, పృథ్వీ, నిఖిల్​, మణికంఠ నామినేట్​ అయినట్లు చూపించారు. ఇక ఇప్పుడు రిలీజ్​ అయిన ప్రోమోలో వారితో పాటు తేజ, యష్మీ కూడా నామినేట్​ అయినట్లు చూపించారు. మరి ఆ ప్రోమోలు మీరూ చూసేయండి!

బిగ్​బాస్​ 8 : లవ్​ మ్యాటర్​ రివీల్​ చేసిన ​నబీల్ - పార్ట్​నర్​ ఆమేనటగా!

"పక్కనోళ్ల బాధ గురించి వాడికి అక్కర్లేదు" - "వాడికి అదే సమస్య" - నాగ మణికంఠ చెల్లెలు షాకింగ్​ కామెంట్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.