ETV Bharat / entertainment

బిగ్​బాస్​: నయని పావని ఎలిమినేటెడ్​​ - అప్పుడు ఒక వారం ఇప్పుడు నెల - రెమ్యునరేషన్​ వివరాలివే! - NAYANI PAVANI REMUNERATION DETAILS

-సీజన్​ 8లో క్రై బేబి ట్యాగ్​ను సొంతం చేసుకున్న నయని పావని -ఎలిమినేట్​ అయి వెళ్తూ వారికి పోటు.. వీరికి ఓటు

Nayani Pavani Elimination
Nayani Pavani Elimination and Remuneration (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2024, 10:18 AM IST

Nayani Pavani Elimination and Remuneration: బిగ్‌బాస్ సీజన్​8 తొమ్మిదో వారంలో నయని పావని ఎలిమినేట్ అయ్యింది. వైల్డ్​ కార్డ్​ ద్వారా హౌజ్​లోకి ఎంటర్ అయిన నయని మొదట్లో తన ఆటతీరు, మాట తీరుతో అందరిని ఆకర్షించింది. ఆ తర్వాత ప్రతి చిన్న దానికి ఏడుస్తూ ఆటపై ఫోకస్ కోల్పోయి, క్రై బేబి ట్యాగ్‌ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే తొమ్మిదో వారం నామినేషన్స్​లోకి వచ్చి ఇంటి బాట పట్టింది. ఇక నాలుగు వారాలు బిగ్​బాస్​ ఇంట్లో ఉన్న నయని భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

తొమ్మిదోవారం నామినేషన్స్​లో ఐదుగురు ఉండగా.. ఒక్కొక్కరూ సేవ్​ అవుతూ చివరి వరకూ నయని పావని, హరితేజలు ఉన్నారు. తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా నయని ఎలిమినేట్‌ అయినట్లు హోస్ట్​ నాగార్జున ప్రకటించారు. అనంతరం వేదికపైకి వచ్చిన ఆమె తన జర్నీ చూసుకుని ఎమోషనల్‌ అయింది. ఈ క్రమంలో హౌజ్​లో ఉన్న వాళ్లలో ఐదుగురు డమ్మీ ఆటగాళ్లు, ముగ్గురు బెస్ట్‌ ఆటగాళ్లు ఎవరో చెప్పాలని నాగార్జున అడిగారు. దీంతో..

డమ్మీ ఆటగాళ్లు:

గంగవ్వ: "అందరితో పోల్చుకుంటే గంగవ్వ గేమ్‌ ఆడటం వయసురీత్యా ఆమెకు కష్టం" అని చెప్పింది.

రోహిణి: "కొంచెం సేఫ్‌గా ఆడుతోంది. గొడవ జరిగినప్పుడు ముఖం మీదే మాట్లాడతారు. అవే విషయాలు ఆమె కూడా ఫాలో అవ్వాలి. ఒకరి తప్పు ఎత్తిచూపటం చాలా ఈజీ. మనం కూడా అన్ని విషయాల్లో కరెక్ట్‌గా ఉండాలి. వెనకాల మాట్లాడకూడదు. ఎంటర్‌టైన్‌మెంట్‌ పరంగా బాగున్నా.. గేమ్​ ఇంకా బాగా ఆడాలి" అని కామెంట్లు చేసింది.

ప్రేరణ: "కోపంలో తెలియకుండా కొన్ని పదాలు వచ్చేస్తున్నాయి. నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే ఎలా అనిపిస్తుందో.. నీ మాటల వల్ల ఎదుటి వాళ్లకూ అలాగే ఉంటుంది. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి" అని సలహా ఇచ్చింది.

గౌతమ్‌: "ఒకరి నుంచి మనం ఏదైనా ఆశిస్తున్నామంటే అదే స్థాయిలో మనం కూడా ఇవ్వాలి. ఆ విషయంలో కొంచెం నియంత్రణలో ఉండాలి." అని సూచనలు చేసింది.

విష్ణు: నువ్వు గేమ్‌ బాగా ఆడతావు. ఫిజికల్లీ, మెంటల్లీ నువ్వు స్ట్రాంగ్​. అయితే, ఇప్పుడు ఆడుతున్న గేమ్​ సరిపోదు. ఇంకా బాగా ఆడాలి" అంటూ మోటీవేట్​ చేసింది.

బెస్ట్​ ఆటగాళ్లు:

హరితేజ: "నీలో ఆ ఫైర్‌ ఉంది. గతవారం చూపించావు. ఇంకా బాగా ఆడాలి." అని సలహా ఇచ్చింది.

నిఖిల్‌: "మంచి వ్యక్తి. బయటకు కోపంగా ఉంటాడు కానీ, చిన్న పిల్లాడి మనస్తత్వం. నువ్వు చెప్పాలనుకున్నది ముఖంపైనే చెప్పు" అంటూ మాట్లాడింది.

పృథ్వీ: "హౌజ్​లో అందరి కన్నా నిజాయతీ కలిగిన వ్యక్తి పృథ్వీ. నీ మాటలకు నువ్వు కట్టుబడి ఉండు. బాగా ఆడు" అంటూ సలహా ఇచ్చింది.

రెమ్యునరేషన్​ వివరాలు ఇవే: గత సీజన్​లో ఒకటే వారం ఉన్న నయని.. ఈ సీజన్​లో 4 వారాలు బిగ్​బాస్​ హౌజ్​లో రాణించింది. దీంతో వారానికి దాదాపు రూ. 1,50,000 తీసుకున్నట్లు.. మొత్తం నాలుగు వారాలకి దాదాపుగా రూ. 6 లక్షల రెమ్యూనరేషన్‌ని అందుకుందని సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది.

బిగ్​బాస్​: మెహబూబ్​ ఎలిమినేట్​ - 3 వారాలకు రెమ్యునరేషన్​ ఎంతో తెలుసా?

మరో షాకిచ్చిన నాగ మణికంఠ - భార్య కంటే ఎన్నేళ్లు చిన్నోడో తెలుసా?

బిగ్​బాస్​ 8 : లవ్​ మ్యాటర్​ రివీల్​ చేసిన ​నబీల్ - పార్ట్​నర్​ ఆమేనటగా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.