Bigg Boss 8 Eighth Week Nominations: బిగ్‌బాస్ హౌజ్‌లో ఎనిమిదో వారం నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఇంట్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిన తర్వాత ప్రతిసారి నామినేషన్స్ ప్రక్రియ రెండు రోజుల పాటు జరుగుతోంది. ఈ వారం కూడా కంటెస్టెంట్ల మధ్య నామినేషన్ల ప్రక్రియ వాడీవేడిగా సాగింది. సోమవారం నబీల్ నామినేషన్స్ వేయడంతో ఆరోజు పూర్తయింది. మరి మంగళవారం ఎపిసోడ్లో ఏం జరిగింది? ఎంత మంది నామినేట్ అయ్యారో ఇప్పుడు చూద్దాం..
మంగళవారం రోజున నామినేషన్స్ ప్రక్రియను తేజ మొదలుపెట్టాడు. "నెగిటివ్ ఎనర్జీ పాస్ చేస్తావ్ ఎందుకు" అంటూ గంగవ్వపై నువ్వు కామెంట్ చేశావ్.. అది నాకు నచ్చలేదు.." అంటూ విష్ణుప్రియను నామినేట్ చేశాడు. ఇక ప్రతిసారి రివేంజ్ అనడం అస్సలు నచ్చలేదని చెప్పి పృథ్వీ పేరు చెప్పాడు. అయితే ఈ నామినేషన్ టైమ్‌లో రోహిణి-పృథ్వీ మధ్య మరోసారి గొడవైంది.
తర్వాత వచ్చిన మెహబూబ్.. సరిగా ఆడట్లేదని, ఫైర్ కాస్త ఫ్లవర్ అయిందని, చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి అని కారణాలు చెబుతూ హరితేజను నామినేట్ చేశాడు. ఓవర్ స్మార్ట్ గేమ్‌లో నయని సరిగా ఆడలేదని నామినేట్ చేశాడు మెహబూబ్. గంగవ్వ.. నిఖిల్, విష్ణుప్రియని నామినేట్ చేసింది. అనంతరం నిఖిల్ వచ్చి.. మెహబూబ్, నయనిని నామినేట్ చేశాడు. యష్మి వంతు వచ్చేసరికి.. విష్ణుప్రియ, మెహబూబ్‌ని నామినేట్ చేసింది.
ఇక ప్రేరణ.. విష్ణుప్రియని నామినేట్ చేసింది. చెప్పేది ఒకటి చేసేది మరొకటి అని కారణం చెప్పింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చాలాసేపు వాగ్వాదం నడించింది. విష్ణుప్రియ ఓ ఫేక్ ఫ్రెండ్ అని ముద్ర వేసేసింది. "పృథ్వీని నేను నామినేట్ చేయడం నీకు నచ్చలేదు కదా" అని ప్రేరణ అనేసరికి.. "అవును, ఆ డెసిషన్ నాకు నచ్చలేదు" అని విష్ణు వాదించింది. "నీ గేమ్ మొత్తం పృథ్వీ వైపే ఉంది, అతడే నీ గేమ్" అని ప్రేరణ వాదించేసరికి.. "అవును అయితే ఏంటి, నువ్వు పెడిక్యూర్, మేనిక్యూర్, హెయిర్ స్టైల్ తప్ప హౌజ్‌లో ఏం చేస్తున్నావ్" అని విష్ణు వాదించింది.
తర్వాత ప్రేరణ.. పృథ్వీ పేరు చెప్పింది. "నువ్వు రివేంజ్ నామినేషన్ వేస్తావ్, బయటికెళ్లడానికి చాలా అర్హత ఉంది నీకు" అని సీరియస్ అయ్యింది. "రెండు వారాల ఇమ్యూనిటీ ఇస్తానన్నా సరే గడ్డం తీయలేదు. మరెవరైనా అయితే చేసేవాళ్లు" అని కారణాలు చెప్పింది. దీంతో రెచ్చిపోయిన పృథ్వీ.. "ఓటింగ్ ప్రకారం ఉంటా, గేమ్‌పై నమ్మకముంది. నువ్వు మాత్రం టాస్క్ ఇవ్వండి అని అడుక్కుంటూ కూర్చో" అని పృథ్వీ అన్నాడు.
బిగ్‌బాస్ 8: ఏడో వారం నాగ మణికంఠ అవుట్ - ఉండలేనంటూ సెల్ఫ్ ఎలిమినేషన్ - రెమ్యునరేషన్ వివరాలివే!
నెక్ట్స్ అవినాష్.. పృథ్వీని నామినేట్ చేశాడు. "లాస్ట్ వీక్ నువ్వు నన్ను రా అనడం నాకు అగౌరవంగా అనిపించింది.. మీరు నాకు నచ్చకపోయినా ఆ పదాన్ని మళ్లీ మళ్లీ వాడారు.. అలానే కటింగ్ టాస్కు వచ్చినప్పుడు మీరు గడ్డం తీసుకొని ఉంటే బావుండేది" అంటూ అవినాష్ అన్నాడు. దీనికి "మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వకముందు ప్రైజ్ మనీ 18 లక్షలు ఉండేది.. అందులో నేను కూడా కాస్త సంపాదించాను.. నాకు ఎందులో నచ్చితే అందులో సంపాదిస్తాను ప్రైజ్ మనీ. అలానే నేను బయటా మనీ కోసం ఏదీ చేయను.. ప్యాషన్ ఉంటేనే చేస్తా" అంటూ పృథ్వీ అన్నాడు. దీంతో "బిగ్‌బాస్‌కి ఫ్రీగా వచ్చావా? కాదుగా.. మనీ కోసం వచ్చావ్.. కానీ బిగ్‌బాస్‌లో మనీ ఇస్తే తీసుకోవు" అంటూ డైలాగ్ కొట్టాడు అవినాష్.
అలానే "బిగ్‌బాస్ అంటే మాకు పిచ్చి.. ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయాలని హెయిర్ కట్ చేయించుకున్నాం.. ఇక్కడ అందరికీ అలాంటి పిచ్చే.. కానీ నేను ఏం చేయను అంటే బిగ్‌బాస్ ఎలా ముందుకెళ్తుంది" అంటూ అవినాష్ అన్నాడు. దీంతో "మరి లక్ష రూపాయల హెయిర్ స్టైయిల్ ఉంది కదా మీరెందుకు 50వేలు చేసుకున్నారు.. ప్రైజ్ మనీ అప్పుడు గుర్తురాలేదా" అంటూ పృథ్వీ పాయింట్ తీశాడు. దీనికి అది నా ఇష్టం.. అని అవినాష్ అనడంతో కదా ఇది నా ఇష్టం.. అంటూ పృథ్వీ కౌంటర్ వేశాడు. ఇక అవినాష్ కూడా నిఖిల్‌ను నామినేట్ చేశాడు. దీంతో నిఖిల్‌కి మొత్తం అత్యధికంగా 5 ఓట్లు పడ్డాయి.
ఇలా నామినేషన్స్ పూర్తయ్యే సరికి నిఖిల్, విష్ణుప్రియ, పృథ్వీ, మెహబూబ్, ప్రేరణ, హరితేజ, నయని.. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. ఇక నామినేషన్స్ షీల్డ్ ఉన్నప్పటికీ హరితేజను ఇద్దరు సభ్యులు నామినేట్ చేసిన కారణంగా విన్నర్స్ ప్రైజ్ మనీ నుంచి రూ.లక్ష తగ్గుతాయి.. అంటూ చెప్పాడు బిగ్‌బాస్. అయితే నామినేట్ అయిన సభ్యుల్లో నుంచి ఒకరిని సేవ్ చేయొచ్చు అంటూ మెగా చీఫ్ గౌతమ్‌కి ఆఫర్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో హరితేజను సేవ్ చేశాడు గౌతమ్. దీంతో ఈ వారం నామినేషన్స్‌లో ఆరుగురు సభ్యులు ఫైనల్ అయ్యారు.
- నిఖిల్
- విష్ణుప్రియ
- పృథ్వీ
- మెహబూబ్
- ప్రేరణ
- నయని
బిగ్‌బాస్ 8 : లవ్ మ్యాటర్ రివీల్ చేసిన నబీల్ - పార్ట్నర్ ఆమేనటగా!