ETV Bharat / entertainment

ఆ నటుడితో పెళ్లి పీటలెక్కిన బిగ్​బాస్ బ్యూటీ! - vasanthi krishnan marriage

Bigboss Vasanthi Krishnan Marriage : బిగ్​బాస్ బ్యూటీ వాసంతి కృష్ణన్ తాజాగా పెళ్లి పీటలెక్కింది. నటుడు పవన్ కల్యాణ్​ను పెళ్లి చేసుకుంది. ఆ వివరాలు.

నటుడు పవన్​ కల్యాణ్​ను పెళ్లి చేసుకున్న బిగ్​బాస్ బ్యూటీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 21, 2024, 10:50 AM IST

Updated : Feb 21, 2024, 11:58 AM IST

Bigboss Vasanthi Krishnan Marriage : ప్రస్తుతం ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. చాలా మంది నటీ నటులు వరుసగా తమ బ్యాచిలర్ లైఫ్​కు గుడ్​ ​బై చెప్పేసి పెళ్లి పీటలెక్కేస్తున్న సంగతి తెలిసిందే. అలా తాజాగా ఇప్పుడు మరో నటి, బిగ్​ బాస్ వాసంతి కృష్ణన్​ కూడా వివాహం చేసుకుంది.

ఈమె ప్రస్తుతం పలు ధారావాహికలతో పాటు చిత్రాల్లో నటిస్తోంది. కన్నడ చిత్రాల్లోనూ యాక్ట్ చేస్తోంది. సిరిసిరి మువ్వలు సీరియల్​తో టెలివిజన్ స్క్రీన్​పై ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత గోరింటాక్, గుప్పెడంత మనసు వంటి ధారావాహికలతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సీరియల్స్​తో తన నటనతో ఆకట్టుకుంది. కాలీఫ్లవర్, మనే నం.67, భువన విజయం, సీఎస్ఐ సనాతన్(Bigboss Vasanthi Krishnan Movies) వంటి సినిమాల్లోనూ సహాయ పాత్రల్లో నటించి మెప్పించింది.

Bigboss Vasanthi Krishnan Relationship : ఈ క్రమంలో తన ఫ్యామిలీ ఫ్రెండ్ పవన్ కల్యాణ్‌తో ప్రేమలో పడింది. అయితే పవన్ కూడా నటుడేనని బయట కథనాలు ద్వారా తెలుస్తోంది. అతడు హీరోగా రెండు మూవీస్​ చేస్తున్నాడని అందులో రాసి ఉంది. అయితే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు క్లారిటీ లేదు. గతేడాది ఈ జంట డిసెంబర్​లో నిశ్చితార్థం చేసుకుంది. ఈ మధ్యే ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలోనూ పాల్గొని సందడి చేసింది. ఆ ఇంటర్వ్యూలో అందరి ముందే ఈ జంట ముద్దు పెట్టుకుని విమర్శకులను కూడా ఎదుర్కొంది.

తాజాగా పవన్ కల్యాణ్​ - వాసంతి కృష్ణన్​ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. తిరుపతిలో బంధుమిత్రులు, ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్​గానే జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి కొంతమంది బిగ్‍‌బాస్, సీరియల్ యాక్టర్స్​ కూడా హాజరై సందడి చేసినట్లు తెలిసింది. తమ పెళ్లి ఫొటోలను, వీడియోలను స్రవంతి ఇన్​స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పెళ్లి ఫొటోలు నెట్టింట్లో బాగా చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు ఈ నూతన వధూవరులిద్దరికి శుభాకాంక్షలు చెపుతూ వాటిని షేర్ చేస్తున్నారు.

భయపెడుతున్న తెలుగు హీరోయిన్​ హారర్ థ్రిల్లర్​ మూవీ! - రిలీజ్ ఎప్పుడంటే?

షారుక్​ - నయన్ - సందీప్ వంగాకు ప్రతిష్టాత్మక అవార్డ్స్​

Last Updated : Feb 21, 2024, 11:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.