ETV Bharat / entertainment

'భారతీయుడు-2', 'గేమ్​ఛేంజర్' రిలీజ్​ అప్పుడే- 2024లో శంకర్​దే హవా! - Game Changer Update

Bharateeyudu 2 Release Date: శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న 'భారతీయుడు-2', 'గేమ్​ఛేంజర్' సినిమాలపై ప్రేక్షకుల్లో అంచనాలు పీక్స్​లో ఉన్నాయి. ఈ మూవీస్ కోసం ఆడియెన్స్​ కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ కానున్నాయంటే?

Bharateeyudu 2 Release Date
Bharateeyudu 2 Release Date
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 22, 2024, 8:14 AM IST

Updated : Jan 22, 2024, 9:43 AM IST

Bharateeyudu 2 Release Date: స్టార్ డైరెక్టర్ శంకర్ ఒకేసారి రెండు భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కిస్తున్నారు. కోలీవుడ్​ అగ్ర కథానాయకుడు కమల్ హాసన్​ లీడ్​ రోల్​లో 'భారతీయుడు- 2', గ్లోబల్ స్టార్ రామ్​చరణ్ హీరోగా 'గేమ్ ఛేంజర్' ప్రాజెక్ట్​లతో శంకర్ బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాల రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాలు ఎప్పుడెప్పుడు రానున్నాయంటే?

భారతీయుడు- 2: 1996లో బ్లాక్​బస్టర్ హిట్ అందుకున్న భారతీయుడు సినిమాకు సీక్వెల్​గా 'భారతీయుడు- 2' రూపొందుతోంది. ఇప్పటికే రిలీజైన ఇంట్రో వీడియో గ్లింప్స్ ఆడియెన్స్​ను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్​ కూడా కంప్లీట్ అయినట్లు మూవీటీమ్ అఫీషియల్​గా తెలిపింది. ఈ సినిమాలో నటుడు వివేక్, సిద్ధార్థ్, నయనతార, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్​ సింగ్, ప్రియా భవాణి శంకర్, తదితరులు ఆయా పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజిక్ సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించగా, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్​పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఇక తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ఇండియా రేంజ్​లో తెరెకెక్కిన ఈ సినిమా 2024 ఏప్రిల్​లో విడుదల కానున్నట్లు ఇన్​సైట్ టాక్.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

గేమ్​ఛేంజర్: పొలిటికల్ యాక్షన్ ఎంటర్​టైనర్​గా ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ బ్యాటీ కియారా అడ్వాణీ హీరోయిన్​గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్​రాజు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్​పై ఈ మూవీ రూపొందిస్తున్నారు. ఎప్పుడో సెట్స్​పైకి వెళ్లిన ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు మూవీయూనిట్. ఇక ఈ సినిమా 2024 సెప్టెంబర్​లో రిలీజయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మూవీమేకర్స్ నుంచి కూడా ఈ రిలీజ్ డేట్​పై త్వరలోనే ఓ క్లారిటీ కానుంది. ఇదే సమయంలో భారతీయుడు షూటింగ్ కూడా ఉండడం వల్ల గేమ్​ఛేంజర్ కాస్త లేటయ్యింది. ఇప్పుడు ఆ సినిమా కంప్లీట్ అయ్యింది. దీంతో శంకర్- రామ్​చరణ్ ఫిల్మ్​కు లైన్ క్లియరైంది. గేమ్​ఛేంజర్ సినిమా షూటింగ్​పైనే శంకర్ ఫోకస్​ పెట్టినట్లు తెలుస్తోంది.

సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - వీరలెవల్​లో ఆ బ్లాక్​బస్టర్​ మూవీకి సీక్వెల్!

మహేశ్, రాజమౌళి మూవీ వర్క్స్​ స్టార్ట్!- ఏడాదిలో పూర్తయ్యేలా బిగ్​ ప్లాన్!

Last Updated : Jan 22, 2024, 9:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.