ETV Bharat / entertainment

బిగ్గెస్ట్ మల్టీస్టారర్​కు బాలయ్య జై - ప్రభాస్​తో కలిసి రూ.100కోట్ల బడ్జెట్​ మూవీలో! - బాలకృష్ణ మల్టీస్టారర్​ సినిమా

Balakrishna Prabhas Movie : నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్​ బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ప్రభాస్​తో కలిసి భారీ బడ్జెట్​ సినిమాలో​ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ చిత్రం ఏంటంటే?

Balakrishna Kannappa Movie
Balakrishna Kannappa Movie
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 27, 2024, 1:16 PM IST

Balakrishna Prabhas Movie : నందమూరి నటసింహం బాలకృష్ణ 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్‌ కేసరి' చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టి ఫుల్​ జోష్​లో ఉన్నారు. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్​లో పెడుతూ బిజీగా మారిపోయారు. అయితే తాజాగా బాలయ్య బాబు ఓ భారీ మల్టీస్టారర్​ మూవీలో నటిస్తున్నట్లు సమాచారం. అది కూడా పాన్​ ఇండియా రెబల్​ స్టార్​ ప్రభాస్​తో కలిసి స్క్రీన్​మీద కనిపించున్నారని తెలుస్తోంది. అదే మంచు విష్ణు డీమ్ర్ ప్రాజెక్టు 'కన్నప్ప' చిత్రం.

మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న 'కన్నప్ప' చిత్రంలో ఇప్పటికే ప్రభాస్, మోహన్​లాల్​, శివరాజ్​ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఇప్పుడు బాలకృష్ణ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. మూవీ మేకర్స్ ఇప్పటికే బాలకృష్ణతో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. మరి బాలయ్య బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో లేదో ఇంక క్లారిటీ లేదు. ఒకవేళ ఈ సినిమాకు బాలకృష్ణ ఓకే అంటే మాత్రం ఇదే బిగ్గెస్ట్ మల్టీస్టారర్​ సినిమా కానుంది.

Manchu Vishnu Kannappa Movie :ఇక సినిమా విషయానికొస్తే మోడల్, క్లాసిక్ డ్యాన్సర్, భరత నాట్యంలో ప్రావీణ్యురాలైన ప్రీతి ముకుందన్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ముఖేశ్​ కుమార్‌ సింగ్​ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను, కలెక్షన్ మోహన్​బాబు భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్​ బాబు, మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ నటిస్తున్నారు. రీసెంట్​గా న్యూజిలాండ్‌లో ఒక షెడ్యూల్‌ పూర్తి చేసుకుని మూవీ టీమ్​ భారత్‌కు తిరిగి వచ్చింది. ఇప్పటికే కన్నప్ప చీత్రీకరణ 60శాతం వరకు కంప్లీట్ అయింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Kannappa Release Date : ఇక మిగిలిన షూటింగ్​, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో స్పీడ్ పెంచి సినిమాను త్వరగా కంప్లీట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. షెడ్యూల్ కంటే ముందే పనులన్నీ పూర్తి చేసి, 2024 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్​ ప్లాన్ చేస్తున్నారట. ఆధ్యాత్మిక జానర్ సినిమా కాబట్టి పండగ సమయంలో మంచి ఆదరణ లభించవచ్చని మూవీయూనిట్ భావిస్తున్నట్లు టాక్. అంతకుముందే హీరో మంచు విష్ణు సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. పాన్ఇండియా లెవెల్​లో రిలీజ్​ అయ్యే ఈ సినిమాను ఆయా భాషల్లో స్థానిక హీరోలతో ప్రమోట్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.

రవితేజ ట్రిపుల్ ధమాకా - ఫ్యాన్స్ కోసం మూడు గుడ్ న్యూస్​లు రెడీ!

SSMB29 : మహేశ్‌, రాజమౌళి సినిమా - ఆ ఐదు పనులు పూర్తైతేనే మూవీ షురూ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.