ETV Bharat / entertainment

ఫ్యాన్​ కోరిక తీర్చిన బాలయ్య - అభిమానులంటే ఆయనకు అంత ప్రేమ! - Balakrishna Fulfills Fans Dream

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2024, 4:58 PM IST

Balakrishna Fulfills Fans Dream : తన ఫ్యాన్స్​ను ఎంతో అభిమానించే నందమూరి బాలకృష్ణ ఓ సారి తన అభిమాని కోరికను నెరవేర్చి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఇంతకీ అదేంటంటే?

Balakrishna Fulfills Fans Dream
Balakrishna (ETV Bharat)

Balakrishna Fulfills Fans Dream : నందమూరి నటసింహం బాలకృష్ణకు ఫ్యాన్స్​లో ఉన్న క్రేజే వేరు. సినిమాల్లో ఆయన నటన్నే కాదు ఇతరులకు సహాయం చేసే ఓ మంచి మనసున్న వ్యక్తిగా కూడా బాలయ్య అభిమానుల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన్ను కలిసిన ఎవ్వరైనా సరే 'పసిపిల్లాడి మనసతత్వం మన బాలయ్యది' అని అన్న సందర్భాలు మనం చాలానే చూసుంటాం. అయితే ఆయన ఒకానొక సంద్భంలో తన అభిమాని అడిగిన ఓ కోరిక తీర్చి ప్రేక్షకుల మన్నలను పొందారు. ఇంతకీ అదేంటంటే?

బాలకృష్ణ, డైరెక్టర్ కేఎస్ రవికుమార్ కాంబినేషన్​లో తెరకెక్కిన యాక్షన్ మూవీ 'రూలర్‌'. ఇందులో బాలయ్య డిఫరెంట్​ లుక్​లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య ఫ్రెంచ్‌కట్‌ గడ్డం లుక్‌ అందరినీ ఆకట్టుకుంది. అయితే బాలయ్య వేసుకున్న ఈ గెటప్‌ వెనక ఓ ఆసక్తికర స్టోరీ ఉంది.

ఒకానొక సమయంలో బాలయ్యకు ఓ వీరాభిమాని హాలీవుడ్‌ స్టార్‌ స్టిల్‌ని పంపాడు. 'మిమ్మల్ని ఈ గెటప్‌లో చూడాలని ఉంది సార్ ' అంటూ ఆ ఫ్యాన్ తన మనసులో మాటను చెప్పాడు. ఇది తెలుసుకున్న బాలయ్య, తన నెక్స్ట్ మూవీ 'రూలర్‌'లో ఈ గెటప్ వేయాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని డైరెక్టర్​కు చెప్పగా ఆయన కూడా ఈ లుక్​ బాగుందని అన్నారు. అలా అభిమాని కోరికను నెరవేర్చి బెస్ట్ హీరోగా పేరొందారు. దీన్ని బట్టి బాలయ్య తన అభిమానుల్ని ఎంతగా ప్రేమిస్తారో మీరు అర్థం చేసుకోవచ్చు.

Balakrishna Hit Movies List : బాలయ్య సినిమా రిలీజవుతుదంటే ఇక అభిమానులకు పెద్ద పండగ అనే చెప్పాలి. థియేటర్లలో ఆ సందడి అలా కనిపిస్తుంది మరీ. ఆయన సినిమాలకు అప్పట్లోనే కాదు ఇప్పట్లోనూ ఓ రేంజ్​లో క్రేజ్ ఉంది. అయితే నందమూరి ఫ్యాన్స్ మర్చిపోలేని ఏడాది ఒకటి ఉంది. అదే 1986. ఇంతకీ ఈ ఏడాది ప్రత్యేకత ఏంటి అని అంటారా? ఎప్పటిలాగే సెన్సేషన్ సృష్టించే బాలయ్య ఆ ఏడాది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు బ్లాక్​బ్లస్టర్​ మూవీస్​ను (ముద్దుల క్రిష్ణయ్య, సీతారామ కల్యాణం, అనసూయమ్మ గారి అల్లుడు
,దేశోద్ధారకుడు,కలియుగ కృష్ణుడు,అపూర్వ సహోదరులు) అభిమానులకు అందించి బాక్సాఫీస్​ వద్ద కాసుల వర్షం కురిపించారు.

చిరు సినిమాల్లో బాలయ్య ఫేవరెట్ మూవీ ఏంటో తెలుసా? - Balakrishna Favourite Movie

బాలకృష్ణ అలాంటి వ్యక్తి : 'యానిమల్' విలన్ బాబీ దేఓల్​ - Bobby Deol Balakrishna NBK 109

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.