ETV Bharat / entertainment

మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ సినిమా - మొదటి అడుగు​ పడింది అక్కడే! - Mokshagna Prasanth Varma

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 6, 2024, 3:40 PM IST

Mokshagna Prasanth Varma Simba Movie : టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ తన డెబ్యూ మూవీ చేయనున్నట్లు అఫీషియల్ అనౌన్స్​మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విశేషాలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. పూర్తి వివరాలు స్టోరీలో

source ETV Bharat
Balakrishna Prasanth Varma Mokshagna (source ETV Bharat)

Mokshagna Prasanth Varma Simba Movie : నందమూరి అభిమానులు ఎన్నో ఏళ్ల పాటు ఎదురు చూసిన క్షణం వచ్చేసింది. బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన ఎంట్రీని నేడు(సెప్టెంబర్ 6) అధికారికంగా ప్రకటించారు. ప్రశాంత్​ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ లాంఛ్​ అవ్వనున్నట్లు అనౌన్స్​​ చేశారు. సుధాకర్ చెరుకూరి, తేజస్విని సంయుక్తంగా చిత్రాన్ని భారీ బడ్జెట్​తో రూపొందిస్తున్నారు. PVCU సినిమాటిక్ యునివర్స్​లో భాగంగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన డీటెయిల్స్ బయటికి రాకుండా టీమ్ జాగ్రత్త పడుతోంది.

Balakrishna Cameo Role Mokshagna Movie : కానీ ఈ సినిమా గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్, భారీ వీఎఫెక్స్ ఎఫెక్ట్స్​తో చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. వినోదాత్మక కథనంతో పురాణాలను టచ్ చేస్తూ దీన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. హీరోయిన్​గా కొత్త అమ్మాయిని తీసుకునే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఈ మూవీలో బాలయ్య ఒక స్పెషల్ కేమియో రోల్​ చేయబోతున్నారని కూడా అంటున్నారు. అది కూడా శ్రీకృష్ణుడి గెటప్​లో క్లైమాక్స్​లో గూస్ బంప్స్ వచ్చే రేంజ్​లో కనిపిస్తారని టాక్ నడుస్తోంది.

వాస్తవానికి అన్​స్టాపబుల్​ షూటింగ్ సమయంలోనే ప్రశాంత్ వర్మ - బాలయ్య జర్నీ మొదలైంది. అన్​స్టాపబుల్​ కోసం ప్రశాంత్ వర్మ పని చేశారు. అప్పుడే బాలయ్యకు ప్రశాంత్ వర్మ ఓ లైన్​ను వినిపించారట! అది బాలయ్యను ఆకట్టుకుందట!. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం కూడా భారీ బ్లాక్ బస్టర్ అందుకోవడంతో బాలయ్య నమ్మకం మరింత రెట్టింపు అయింది. అందుకే ప్రశాంత్ వర్మకు బాలయ్య అవకాశాన్ని ఇచ్చారని తెలిసింది.

పైగా మోక్షజ్ఞ ఇండస్ట్రీ లాంఛ్​ కోసం బాలయ్య చాలా ఏళ్ల నుంచి ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. మోక్షజ్ఞ డెబ్యూ నందమూరి ఫ్యాన్స్​తో పాటు సినీ ప్రియుల్ని అలరించే విధంగా ఉండేలా ప్లాన్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే అప్పటికే స్టార్ వారసుల లాంఛ్ అంతా కమర్షియల్​ స్టోరీలతోనే అయింది. రామ్ చరణ్ చిరుత, మహేశ్​ బాబు రాజకుమారుడు, జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని, ప్రభాస్ ఈశ్వర్ అన్నీ కమర్షియల్ ఫార్ములాతోనే రూపొందాయి. నాగ చైతన్య జోష్​ మెసేజ్ ఒరియెంటెడ్​గా తీసిన అంచనాలను అందుకోలేకపోయింది.

అందుకే బాలయ్య, మోక్షజ్ఞను డిఫరెంట్​గా, కొత్తగా పరిచయం చేయాలని ఇంతకాలం ఆగారు. అయితే ఒక దశలో ఆదిత్య 999 ద్వారా పరిచయం చేయాలని కూడా అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అనంతరం ఇప్పుడు ఫాంటసీ బ్యాక్ డ్రాప్​ను ఎంచుకుని ఆసక్తి రేపారు. టాలెంటెడ్ డైరెక్టర్​ ప్రశాంత్ వర్మకు అవకాశాన్ని ఇచ్చి అంచనాలను పెంచారు.

ఇకపోతే మోక్షజ్ఞ కూడా తన ఇండస్ట్రీ లాంఛ్​ కోసం బాగానే శ్రమించినట్లు తెలుస్తోంది. తన మేకోవర్​ను పూర్తిగా మార్చుకున్నారు. త్వరలోనే ఆయన కొత్త సినిమా ప్రారంభోత్సవం జరగనుంది.

మోక్షుకు తారక్ స్పెషల్ విషెస్ - నందమూరి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ! - Jr NTR Wishes Mokshagna

PVCUలోకి బాలయ్య వారసుడు- కిర్రాక్​గా మోక్షు ఫస్ట్ లుక్ - Mokshagna Teja Debut Movie

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.