Balakrishna 50 years Golden Jubilee Celebrations : నందమూరి నటసింహం బాలకృష్ణ తన వెండితెర ప్రయాణంలో 50 ఏళ్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఆయన తొలి చిత్రం 'తాతమ్మ కల' 1974 ఆగస్టు 30న విడుదలైంది. ఈ సందర్భంగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సెప్టెంబరు 1న హైదరాబాద్‌లో అంగ రంగ వైభవంగా స్వర్ణోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో బాలయ్య సాధించిన రేర్ రికార్డులను గురించి తెలుసుకుందాం.
- తన తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో తాతమ్మ కల చిత్రంతో అరంగేట్రం చేశారు బాలయ్య. సాహసమే జీవితం బాలయ్యకు హీరోగా తొలి సినిమా(1984). ఆయన 25వ చిత్రం 1986లో నిప్పులాంటి మనిషి. 1990లో 50వ చిత్రం నారీ నారీ నడుమ మురారి. 199లో 75వ చిత్రం కృష్ణ బాబు. 2017లో 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి. ప్రస్తుతం 109వ చిత్రం NBK 109లో నటిస్తున్నారు.
- బాలయ్య ఎక్కువగా కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో నటించారు. మొత్తం 13 చిత్రాలు చేశారు. ఏకంగా 17 చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేసిన హీరో కూడా బాలయ్యనే. అధినాయకుడు చిత్రంలో ట్రిపుల్ రోల్ కూడా చేశారు.
- సాంఘికం, జానపదం, పౌరాణికం, సైన్స్ ఫిక్షన్, బయోపిక్ ఇలా అన్ని జానర్లలో నటించి హిట్ కొట్టిన ఏకైక స్టార్ హీరో బాలయ్య.
- 1987లో బాలయ్య నటించిన సినిమాలు ఏకంగా 8 విడుదలయ్యాయి. పైగా అవన్నీ విజయం సాధించడం మరో విశేషం.
- బాలకృష్ణ నటించిన 71 సినిమాలు 100 రోజులకుపైగా, లెజెండ్ 1000కి పైగా రోజులు(కొన్ని కేంద్రాల్లో) ఆడటం విశేషం.
- 43వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(గోవా) వేడుకకు టాలీవుడ్ తరఫున చీఫ్ గెస్ట్ హోదాలో వెళ్లిన నటుడు బాలయ్యనే.
- గౌతమిపుత్ర శాతకర్ణి కోసం ఎక్కువగా కష్టపడ్డారు. కసరత్తులు చేశారు. గౌతమి పుత్ర శాతకర్ణిలో కొన్ని సీన్లకు, పెద్దన్నయ్య క్లైమాక్స్‌కు దర్శకత్వం వహించారు.
- ఎన్టీఆర్ బయోపిక్‌లో అత్యధిక గెటప్స్‌లో కనిపించారు. ఇప్పటివరకూ ఒక్క రీమేక్ కూడా చేయలేదు.
- బాలయ్యలో నటుడు మాత్రమే కాదు ఇంకా పలువురు ఉన్నారు. బాలయ్యలో ఓ రచయిత ఉన్నాడు. ఓ రాత్రి ఆదిత్య 369(Aditya 369)కు సీక్వెల్ చేయాలని ఆలోచిస్తూ తెల్లారేసరికి కథ (ఆదిత్య 999) సిద్ధం చేశారు.
- మామా ఏక్ పెగ్‌లా అంటూ తనలోని గాయకుడిని, అన్‌స్టాపబుల్ అంటూ తనలోని వ్యాఖ్యాతను పరిచయం చేసి అభిమానుల్లో జోష్ నింపారు. ఎన్టీఆర్ బయోపిక్‌తో నిర్మాతగానూ వ్యవహరించారు.
- బాలయ్యకు మూడు నంది(నరసింహనాయుడు, సింహా, లెజెండ్), సైమా (లెజెండ్), ఆరు ఫిలింఫేర్ అవార్డులు వరించాయి.
- చంఘీజ్ ఖాన్, గోన గన్నారెడ్డి, రామానుజాచార్య బాలయ్య డ్రీమ్ రోల్స్. ఓ సూపర్ స్టార్‌తో 'రైతు' పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించాలనేది బాలయ్య డ్రీమ్.