ETV Bharat / entertainment

నిఖిల్ 'స్వయంభు' - ఆయుధపూజ మొదలు - NIKHIL SWAYAMBHU MOVIE

టాలీవుడ్​ హీరో నిఖిల్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్వయంభు సెట్స్​లో ఆయుధపూజ!

source ETV Bharat
Nikhil (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2024, 3:25 PM IST

Nikhil swayambhu Movie : టాలీవుడ్ హీరో నిఖిల్‌ అప్పట్లో 'కార్తికేయ 2' చిత్రంతో సూపర్‌ హిట్‌ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత 'స్పై' మిస్టరీ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. ఆ తర్వాత నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'స్వయంభు'. భరత్​ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతోందీ చిత్రం. భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా ఠాగూర్‌ మధు సమర్పణలో భువన్‌, శ్రీకర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సోషియో ఫాంటసీ కథాంశంగా ఇది రానుంది.

swayambhu Movie Shooting : దేవీ నవరాత్రులను పురస్కరించుకుని తాజాగా స్వయంభు సెట్‌లో ఆయుధ పూజను నిర్వహించారు. చిత్రంలో ఉపయోగిస్తున్న ఆయుధాలన్నింటికీ పూజ చేశారు. వీటికి సంబంధించిన స్పెషల్‌ వీడియోను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ప్రజలకు దసరా శుభాకాంక్షలను చెప్పింది. కాగా, ఈ సినిమాకి రవి బస్రూర్‌ సంగీతమందిస్తున్నారు. మనోజ్‌ పరమహంస ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. నిఖిల్ సరసన సంయుక్త మేనన్‌ నటించనుంది. ఈ సినిమాలో మరో నాయికగా నభా నటేష్‌ కనిపించనుంది. ఇది నిఖిల్​ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌ మూవీగా రానుంది. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా ముస్తాబవుతోంది. చిత్రంలో నిఖిల్‌ ఓ యోధుడిగా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం తను ఇప్పటికే మార్షల్‌ ఆర్ట్స్‌, గుర్రపు స్వారీల్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

Nikhil Upcoming Movie : ఇక ఈ చిత్రంతో పాటు సుధీర్‌ వర్మతో హీరో నిఖిల్‌ ఓ సినిమా చేస్తున్నారు. రామ్‌ చరణ్‌ సమర్పణలో ది ఇండియా హౌస్‌ పేరుతో ఇది తెరకెక్కనుంది. అలాగే కార్తికేయ3 కూడా లైన్‌లో ఉంది.

ఇకపోతే నిఖిల్‌ హీరోగా మరో సినిమా కూడా తెరకెక్కుతోంది. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ఇది రూపొందనుంది. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో పేరుతో ఇది రానుంది. రుక్మిణీ వసంత్‌, దివ్యాంశ హీరోయిన్స్‌గా కనిపించనున్నారు. దీపావళి కానుకగా ఈచిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం తాజాగా పోస్టర్‌ షేర్‌ చేసింది. షూట్‌ గురించి ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వకుండా డైరెక్ట్‌గా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించడంపై సినీ ప్రియులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

'దేవర- 2'లోనూ బాలీవుడ్‌ స్టార్స్‌- కొరటాల ప్లానింగ్ వేరే లెవెల్!

అమితాబ్- రజనీ కాంబోలో 4 మూవీస్ - అన్నీ సూపర్ హిట్టే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.