ETV Bharat / entertainment

అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'అయలాన్' - స్ట్రీమింగ్ ఎక్కడంటే? - అయలాన్ ఓటీటీ సన్​ నెక్ట్స్​

Ayalaan OTT Release Date : హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ 'అయలాన్'. ఈ మూవీ తెలుగు వెర్షన్ థియేటర్లలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఓటీటీ రిలీజ్​పై అఫీషియల్ అనౌన్స్​మెంట్ వచ్చేసింది.

అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'అయలాన్' - స్ట్రీమింగ్ ఎక్కడంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2024, 4:15 PM IST

Ayalaan OTT Release Date : కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ 'అయలాన్'. ఈ చిత్ర తమిళ వెర్షన్ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై మంచి టాక్​ను దక్కించుకుంది. అయితే తెలుగులో సంక్రాంతి టైమ్​లో గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్‌, నా సామిరంగ వంటి చిత్రాలు రిలీజ్ అవ్వడంతో అయలాన్​కు తెలుగులో స్క్రీన్లు దక్కలేదు. దీంతో రెండు వారాలు ఆలస్యంగా జనవరి 26న రిలీజ్ చేయాలని అనుకున్నారు.

తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో పాటు ప్రమోషన్స్ కూడా చేశారు. ఈ ప్రమోషన్స్​కు శివకార్తికేయన్ కూడా హాజరై సందడి చేశారు. కానీ లీగల్ సమస్యలు తలెత్తడం వల్ల ఇప్పుడీ చిత్రం రిలీజ్​కు నోచుకోలేదు. బుకింగ్స్ బాగానే జరిగినా స్క్రీనింగ్‌కు అవకాశం లేకపోవడం వల్ల డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చినట్లు తెలిసింది.

ఫిబ్రవరి 2లోగా ఈ లీగల్ సమస్యలు క్లియర్ చేసే పనిలో మూవీటీమ్​ ఉన్నట్లు సమాచారం అందింది. అప్పటికీ కూడా సమస్యలు కొలిక్కి రాకపోతే ఇక తెలుగు వెర్షన్​ను థియేటర్లలో విడుదల చేయడం కష్టమేనని తెలిసింది. దీంతో నేరుగా ఓటీటీలోనే విడుదల చేస్తారని టాక్ వినిపిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ సినిమా సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్​ అవ్వనుంది. శనివారం సన్ సెక్స్ట్ అఫీషియల్‌గా ఈ విషయాన్ని అనౌన్స్‌ చేసింది. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించింది. అయితే స్ట్రీమింగ్ తేది గురించి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ కామెడీ మూవీ ఫిబ్రవరి 9 నుంచి ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. తమిళంతో పాటు తెలుగు, మలయాలం, కన్నడం, హిందీలోనూ స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు సమాచారం.

ఏదేమైనా థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా అవ్వకముందే ఓటీటీలోకి రానుండటం సర్​ప్రైజింగ్ అండ్ షాకింగ్​గా ఉంది. ఈ చిత్రం రూ.60 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతికి విడుదలైన తమిళ సినిమాల్లో కెప్టెన్ మిల్లర్ తర్వాత హయ్యెస్ట్ కలెక్షన్స్ అందుకున్న మూవీ ఇదే.

'అది చూసి వాంతు వచ్చినట్టైంది' - ఆ స్టార్ హీరో మూవీపై రాధిక కామెంట్స్​!

హిందీలోనూ 'హనుమాన్' జోరు- KGF, జైలర్​ను దాటేసిన సూపర్​హీరో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.