ETV Bharat / entertainment

వచ్చే వారం OTTలోకి రాబోతున్న 4 క్రేజీ సినిమాలివే - ప్రభాస్​ 'కల్కి' కూడా - August Last Week OTT Releases - AUGUST LAST WEEK OTT RELEASES

August Last Week OTT Movies Releases : ఆగస్ట్ నాలుగో వారంలో పలు క్రేజీ సినిమాలు ఓటీటీ రిలీజ్​కు రెడీ అయ్యాయి. ఇందులో ప్రభాస్ కల్కి కూడా ఉంది. పూర్తి వివరాలు స్టోరీలో

source ETV Bharat
August Last Week OTT Movies Releases (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 17, 2024, 9:16 AM IST

Updated : Aug 17, 2024, 9:33 AM IST

August Last Week OTT Movies Releases : ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఓటీటీల్లోకి ప్రతీ వారం సినిమాలు, వెబ్ సిరీస్‍లు క్యూ కడుతాయన్న సంగతి తెలిసిందే. అలానే వచ్చే వారం(ఆగస్టు నాలుగో వారం) కూడా ఓటీటీ ప్లాట్​ఫామ్స్​లోకి పలు క్రేజీ​ సినిమాలు స్ట్రీమింగ్​కు వచ్చేందుకు రెడీ అయ్యాయి. వీటిలో ముఖ్యంగా మూడు సినిమాలు ఆసక్తిని పెంచుతున్నాయి. ధనుశ్​ స్వీయ దర్శకత్వంలో హీరోగా తెరకెక్కిన రాయన్​ సహా ఓ మలయాళ చిత్రం ఉన్నాయి. అలానే ఓ హిందీ మూవీ కూడా డైరెక్ట్​గా స్ట్రీమింగ్‍కు సిద్ధమైంది. కల్కి 2899 ఏడీ చిత్రం కూడా వచ్చే వారమే ఓటీటీలోకి వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.

రాయన్(Raayan OTT Release) - తమిళ స్టార్ హీరో ధనుశ్​ హీరోగా నటించిన రాయన్ సినిమా రీసెంట్​గా థియేటర్లలో విడుదలై రూ.175 కోట్ల వరకు వసూళ్లను సాధించింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్టు 23 నుంచి స్ట్రీమింగ్‍కు రానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనుంది.

గర్ర్​ - ఈ మలయాళ సర్వైవల్ కామెడీ సినిమా ఆగస్టు 20 నుంచి డిస్నీ ప్లస్​ హాట్‍స్టార్​లో స్ట్రీమింగ్‍కు అడుగు పెట్టనుంది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో వ్యూయర్స్​కు అందుబాటులో ఉండనుంది. సూరజ్ వెంజరమూడు, కుంచాకో బోబన్ ప్రధాన పాత్రల్లో నటించారు. జై కే దర్శకత్వం వహించారు.

తిక్‍డమ్ - తిక్‍డమ్ అనే హిందీ సినిమా డైరెక్ట్​గా జియో సినిమాలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఆగస్టు 23 నుంచి ఈ మూవీ అందుబాటులో ఉంటుంది. ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామా మూవీలో దివ్యాంశ్ ద్వివేది, అమిత్ సియాల్‍, ఆరోషి సౌద్, భాను, ప్రధాన పాత్రల్లో నటించారు. వివేక్ అర్చాలియా దర్శకత్వం వహించారు. ఉపాధి కోసం పిల్లలతో కలిసి నగరానికి వచ్చి ఓ తండ్రి పడే తిప్పలు చుట్టూ ఈ కథ నడుస్తుంది.

కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD OTT Release) - భారీ బ్లాక్​ బస్టర్ సినిమా కల్కి 2898 ఏడీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటించగా, అమితాబ్ బచ్చన్​, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించారు. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి రూ.1100 కోట్ల వసూళ్లు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్, నెట్​ఫ్లిక్స్​ ఈ మూవీ రైట్స్​ను దక్కించుకున్నాయి. ఆగస్టు 22 నుంచి ఓటీటీలోకి ఈ కల్కి 2898 ఏడీ రానుందని అఫీషియర్​ అనౌన్స్​మెంట్ చేశారు మేకర్స్.

వీకెండ్ స్పెషల్​ - ఈ వారం 23 సినిమా/సిరీస్​లు - ఆ 4 వెరీ ఇంట్రెస్టింగ్​! - This Week OTT Releases

2024 నేషనల్ అవార్డ్​ ఫిలిమ్స్​ - ఇవి ఏ OTTలో ఉన్నాయంటే? - 2024 National Award Films OTT

Last Updated : Aug 17, 2024, 9:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.