Vijay Thalapathy Sarkar Movie : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధమైపోయింది. మరీ ముఖ్యంగా నవ్యాంధ్రప్రదేశ్ చరిత్రలో నేడు ఎంతో కీలకమైన రోజు అని చెప్పాలి. ఎందుకంటే ఏపీ ప్రజలు తమ ఓటు అనే ఆయుధంతో రాజకీయ నాయకుల తలరాతను మార్చనున్నారు. అలానే భావి తరాలకు బంగారు భవిష్యత్‌ను అందించే నాయకుడిని ఎంపిక చేసుకోనున్నారు. ఇందులో భాగంగా సోమవారం(మే 13) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఇప్పటికే ఉపాధి కోసం వేరే ప్రాంతాల్లో సెటిల్ అయిన ఏపీ ప్రజలంతా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. దీంతో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. అలాగే ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా విస్తృతంగా ప్రచారం చేసింది.
అయితే ఎన్నికల గురించి, ఓటు హక్కు విలువ, ప్రయోజనాల గురించి పలు సినిమాల్లోనూ తెలియజేస్తూ దర్శకులు సన్నివేశాలను కూడా తీర్చిదిద్దారు. అలాంటి వాటిలో కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి నటించిన సర్కార్ కూడా ఒకటి. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ డైరెక్షన్లో ఇది వచ్చింది. ఇందులో విజయ్ ఓటు ప్రయోజనాన్ని గురించి చెప్పే సన్నివేశం హైలైట్‌గా ఉంటుంది. ప్రస్తుతం పోలింగ్‌కు అంతా సిద్ధమైన నేపథ్యంలో విజయ్ చెప్పిన ఆ డైలాగ్ మీరూ చూసేయండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">