ETV Bharat / entertainment

అరుంధతి సాంగ్​కు సాయి పల్లవి డ్యాన్స్ - ఈ వీడియో చూశారా? - Saipallavi Dance - SAIPALLAVI DANCE

Arundhati Dance By Saipallavi : పక్కింటి అమ్మాయిలా కనిపించే సాయి పల్లవి డ్యాన్స్ వేసిందంటే మరో మైకేల్ జాక్సన్​ అనాల్సిందే. సినిమా పాటల్లో హీరోలను డామినేట్ చేస్తూ డ్యాన్స్ చేసే సాయి పల్లవి అరుంధతి సినిమాలోని పాటకు డ్యాన్స్​ వేసింది. ఆ వీడియో మీరు చూశారా? Source ETV Bharat

Source ETV Bharat
Sai pallavi (Source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 18, 2024, 7:50 PM IST

Arundhati Dance By Saipallavi : సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేచురల్ యాక్టింగ్​తో పాటు అద్భుతంగా డ్యాన్స్ వేయడం ఆమె టాలెంట్. అయితే సూపర్ హిట్ చిత్రం అరుంధతి సినిమాలోని పాటకు సాయి పల్లవి డ్యాన్స్​ వేసిన ఓ త్రో బ్యాక్​ వీడియో ప్రస్తుతం బయట చక్కర్లు కొడుతోంది.

సినిమాలో పశుపతిని అంతం చేసేందుకు అరుంధతి తెలివిగా డ్యాన్స్‌తోనే తుద ముట్టిస్తుంది. ఆ సమయంలో వేద పండితుల మధ్య శబ్ద భేరీ నృత్యంతో పశుపతిని చంపేస్తుంది. ఇదే సాంగ్​కు డ్యాన్స్‌ను ఫుల్ ఎనర్జిటిక్‌గా పెర్ఫామ్ చేసి ఆకట్టుకుంది డ్యాన్స్ క్వీన్ సాయి పల్లవి.

సాధారణంగా సినిమా అంటే చాలా టేక్స్ ఉంటాయన్న సంగతి తెలిసిందే. అవసరమైతే డ్యాన్స్ సమయంలో స్టెప్పు స్టెప్పుకు కూడా బ్రేక్ తీసుకోవచ్చు. కానీ స్టేజ్ మీద ఫెర్ఫామెన్స్ అంటే బ్రేక్​ లేకుండా కంటిన్యూస్​గా చేయాలి. సాయి పల్లవి కూడా లైవ్​ షోలో ఆ సాంగ్​కు ఏ మాత్రం తజబడకుండా నెమలిలా నాట్యం చేసింది. జడ్జెస్​తో వావ్ అనిపించుకుంది. ఆమె పెర్మామెన్స్‌కు జడ్జి రంభ కూడా ఫిదా అయిపోయి చప్పట్లతో ప్రశంసించారు.

కాగా, ఇలా స్టేజీ షోలు చేయడం, డ్యాన్స్​ కంటెస్టెంట్​ ప్రోగ్రామ్స్​లో పాల్గొనడం సాయికి కొత్తేం కాదు. కాలేజి రోజుల్లో ఆమె చేసిన షీలాకి జవానీ డ్యాన్స్, టాంగో డ్యాన్సులు కూడా ఈ మధ్య వైరల్​గా మారాయి. ఇక సినిమా ఫీల్డ్‌కు వచ్చాక అందాల ఆరబోత, రొమాంటిక్ సీన్లకు కండీషన్లు పెట్టుకుని నటిస్తూ నేచురల్ బ్యూటీగా పేరు సంపాదించుకుంది సాయి పల్లవి.

ఇకపోతే తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో నటించిన సాయి పల్లవి బాలీవుడ్ లోనూ తన ముద్ర వేసేందుకు సిద్ధమవుతోంది. గార్గి, విరాట పర్వం, శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరీ, ఫిదా, పావ కదైగల్, ఎన్ జీకే, అథిరన్, మారి 2, పడిపడి లేచె మనసు, కణం, దియా, మిడిల్ క్లాస్ అబ్బాయి లాంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్‌లో రణబీర్ కపూర్ సరసన రామాయణ్ సినిమాలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె సీతాదేవి పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం.

కనిపించకుండా పోయిన ప్రముఖ నటుడు - 24 రోజుల తర్వాత ఇంటికి! - Actor Gurucharan Singh

పవన్ విషయంలో అతడిపై రేణూ దేశాయ్ ఫుల్​​ ఫైర్​! - Renu Desai Pawankalyan

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.